న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs WI : వెస్టిండీస్ తుక్కురేగ్గొట్టిన భారత స్పిన్నర్లు.. ఫలించిన హార్దిక్ ప్రయోగాలు.. ఇండియా ఘనవిజయం

axar

ఫ్లోరిడా : వెస్టిండీస్ గడ్డపై టీమిండియా హార్దిక్ పాండ్యా సారథ్యంలో చివరిదైనా అయిదో టీ20లో బరిలోకి దిగి విజయ బావుటా ఎగురవేసింది. తద్వారా ఇండియా 4-1తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా తన మార్క్ కెప్టెన్సీని చూపించాడు. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం, అనూహ్యంగా శ్రేయస్ అయ్యార్‌ను ఓపెనర్‌గా పంపించడం, అక్షర్ పటేల్‌తో తొలి ఓవర్‌తో పాటు తొలి స్పెల్ వేయించడం అన్నీ ఫలించాయి. 189పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 15.4ఓవర్లలో 100పరుగులకే ఆలౌటైంది. రవి బిష్ణోయ్ 2.4ఓవర్లలో 16పరుగులు 4వికెట్లు కెరీర్ బెస్ట్ ప్రదర్శనతో చెలరేగడంతో పాటు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలా మూడు వికెట్లు పడగొట్టి వెస్టిండీస్ పతనాన్ని శాసించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా అక్షర్ పటేల్ నిలవగా..ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా అర్షదీప్ సింగ్ నిలిచాడు.

ఆదిలోనే వెస్టిండీస్‌కు షాక్

ఇక ఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అనూహ్యంగా ఓపెనర్ స్థానంలో బరిలోకి దిగిన జాసన్ హోల్డర్ అక్షర్ పటేల్ వేసిన తొలి ఓవర్లో బౌల్డై డకౌట్ అయ్యాడు. తర్వాత షమ్రా బ్రూక్స్ (13), థామస్ (10)లను కూడా అక్షర్ పటేల్ బుట్టలో వేసుకున్నాడు. ఇక ఆ తర్వాత కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ ఎటాక్‌లోకి దిగారు. చాలా రోజుల తర్వాత టీమిండియా తరఫున బరిలోకి దిగిన కుల్దీప్.. పూరన్ (3)ను ఎల్బీడబ్ల్యూగా బురిడీ కొట్టించాడు. దీంతో 50పరుగులకే 4వికెట్లు కోల్పోయి వెస్టిండీస్ తీవ్ర కష్టాల్లో పడింది.

హెట్మయర్ ఒక్కడే

ఇక కాసేపు వికెట్ పడకుండా రోవ్మన్ పావెల్, హెట్మయర్ జాగ్రత్తగా ఆడారు. అయితే రోవ్మన్ పావెల్ (9)ను బిష్నోయ్ అవుట్ చేయడంతో 33పరుగుల వీరి భాగస్వామ్యానికి తెరపడింది. మిగతావాళ్లెవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. హెట్మయర్ (56పరుగులు 35బంతుల్లో 5ఫోర్లు, 4సిక్సులు) 9వ వికెట్‌కు ఔటవ్వడంతో ఇక వెస్టిండీస్ పరాజయం లాంఛనమైంది. ఆ తర్వాత మరో మూడు బంతులకు మెక్కాయ్ (0) కూడా ఔటవ్వడంతో ఇండియా 88పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

తొలుత శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో

ఇక బ్యాటింగ్లో తొలుత శ్రేయస్ హాఫ్ సెంచరీ (64పరుగులు 40బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సర్లు), దీపక్ హుడా (38పరుగులు 25బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) హార్దిక్ పాండ్యా (28పరుగులు 16బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) చెలరేగడంతో ఇండియా నిర్ణీత 20ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 188పరుగులు చేయగలిగింది. వెస్టిండీస్ బౌలర్లలో ఒడియన్ స్మిత్ 3వికెట్లతో చెలరేగగా.. హోల్డర్, డ్రేక్స్, వాల్స్ తలా ఓ వికెట్ తీశారు.

తుది జట్లు :

వెస్టిండీస్ (ప్లేయింగ్ XI) : షమర్ బ్రూక్స్, షిమ్రాన్ హెట్మెయర్, నికోలస్ పూరన్ ( కెప్టెన్ ), డెవాన్ థామస్ ( వికెట్ కీపర్ ), జాసన్ హోల్డర్, ఓడియన్ స్మిత్, కీమో పాల్, డొమినిక్ డ్రేక్స్, ఒబెడ్ మెక్‌కాయ్, హేడెన్ వాల్ష్, రోవ్‌మన్ పావెల్

భారత్ (ప్లేయింగ్ XI) : ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్

Story first published: Monday, August 8, 2022, 7:10 [IST]
Other articles published on Aug 8, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X