న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ Vs విండిస్: 22 నుంచి రాజ్‌కోట్ టెస్టు టికెట్ అమ్మకాలు

India vs West Indies : Tickets For Rajkot Test To Be Sold From September 22
India vs West Indies: Tickets for Rajkot Test to be sold from September 22

హైదరాబాద్: సెప్టెంబర్ 22 నుంచి భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరిస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్-విండిస్ జట్ల మధ్య రాజ్‌కోట్ వేదికగా అక్టోబరు 4 నుంచి ప్రారంభంకానున్న తొలి టెస్టు మ్యాచ్ టికెట్ అమ్మకాలు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి.

ఆసియా కప్‌లో కృనాల్‌కి ఛాన్సివ్వండి..: సెలక్టర్లకు అగార్కర్ సూచనఆసియా కప్‌లో కృనాల్‌కి ఛాన్సివ్వండి..: సెలక్టర్లకు అగార్కర్ సూచన

ఈ మేరకు సౌరాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ (ఎస్‌సీఏ) గురువారం ఓ ప్రకటనని విడుదల చేసింది. తొలి టెస్టుకి సంబంధించిన కొన్ని టికెట్లను ఇప్పటికే ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నట్లు వెల్లడించిన ఎస్‌సీఏ.. అందుబాటులో ఉన్న రెండు కార్పొరేట్ బాక్స్‌ టికెట్ల ధరలను కూడా ప్రకటించింది.

కార్పొరేట్ బాక్స్‌ ధర రూ.7 వేలు

కార్పొరేట్ బాక్స్‌ ధర రూ.7 వేలు

సౌత్ పెవిలియన్‌ కార్పొరేట్ బాక్స్‌ ధర రూ.7 వేలు, వెస్ట్ స్టాండ్ కార్పొరేట్ బాక్స్ ధర రూ. 4 వేలుగా సౌరాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ (ఎస్‌సీఏ) నిర్ణయించింది. స్టేడియంతో పాటు రాజ్ కోట్ సిటీలో మొత్తం ఐదు చోట్ల టికెట్ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు

ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు

ఈ టికెట్లను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు క్రికెట్ అభిమానులు కొనుగోలు చేయొచ్చు. భారత పర్యటనలో భాగంగా వెస్టిండిస్ జట్టు రెండు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. అక్టోబరు 4 నుంచి రాజ్‌కోట్ వేదికగా తొలి టెస్టు ప్రారంభంకానుంది.

అనంతరం 12 నుంచి హైదరాబాద్‌లో రెండో టెస్టు

అనంతరం 12 నుంచి హైదరాబాద్‌లో రెండో టెస్టు

అనంతరం 12 నుంచి 16 వరకు హైదరాబాద్‌ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. రాజ్‌కోట్‌లో ఇప్పటి వరకు కేవలం ఒక అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ మాత్రమే జరిగింది. 2016లో ఈ స్టేడియం భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్‌కి ఆతిథ్యమిచ్చింది. టెస్టు సిరిస్ అనంతరం అక్టోబర్ 21 నుంచి వన్డే సిరిస్ ప్రారంభం కానుండగా, ఆ తర్వాత టీ20 సిరిస్ ప్రారంభం అవుతుంది.

 ఆసియా కప్‌లో బిజీగా ఉన్న భారత్

ఆసియా కప్‌లో బిజీగా ఉన్న భారత్

ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో భారత్ ఆడుతోంది. ఈ ఆసియా కప్ టోర్నీ సెప్టెంబర్ 28తో ముగియనుంది. అనంతరం వెస్టిండీస్‌తో భారత్ జట్టు రెండు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది.

Story first published: Friday, September 21, 2018, 11:38 [IST]
Other articles published on Sep 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X