న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆదుకున్న అయ్యర్‌.. పంత్‌ తొలి హఫ్‌సెంచరీ.. స్కోర్ 200/4

India vs West Indies: Shreyas Iyer, Rishabh Pant half centurys; Iyer falls after century stand

చెన్నై: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చెన్నై చిదంబరం స్టేడియంలో భారత్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో భారత్‌ బ్యాట్స్‌మెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ దూకుడుగా ఆడారు. ఈ ఇద్దరు విండీస్ బౌలర్లను సమర్ధవంతగా ఎదుర్కొని హాఫ్ సెంచరీలతో రాణించి జట్టును ఆదుకున్నారు. పంత్ 49 బంతుల్లో 50 హఫ్‌సెంచరీ చేయగా.. శ్రేయాస్ అయ్యర్ 70 బంతుల్లో 50 హఫ్‌సెంచరీ పూర్తి చేశాడు.

<strong>టీ20 ప్రపంచకప్‌.. కీపర్‌ రేసులో కేఎల్‌ రాహుల్‌!</strong>టీ20 ప్రపంచకప్‌.. కీపర్‌ రేసులో కేఎల్‌ రాహుల్‌!

ఆదిలోనే షాక్

ఆదిలోనే షాక్

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు విండీస్ బౌలర్ షెల్డాన్‌ కాట్రెల్‌ ఆదిలోనే షాక్ ఇచ్చాడు. ఏడో ఓవర్ మూడో బంతికి ఓపెనర్ కేఎల్ రాహుల్ (6) పెవిలియన్ చేరాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమయిన రాహుల్.. షిమ్రాన్‌ హెట్‌మెయిర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (4) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. ఓ బౌండరీ బాది జోరుమీద కనిపించిన కోహ్లీ బోల్డ్ అయ్యాడు. ఏడో ఓవర్ చివరి బంతి కోహ్లీ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్లను గిరాటేసింది. దీంతో కీలక రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాలో పడింది.

పంత్‌ ధనాధన్‌

పంత్‌ ధనాధన్‌

అయితే మరో ఓపెనర్ రోహిత్ శర్మ యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఆరు ఫోర్లతో మంచి జోరుమీదున్న రోహిత్‌.. పోలార్డ్ చేతికి చిక్కాడు. జోసెఫ్ బౌలింగ్‌లో రోహిత్ (36) పెవిలియన్ బాట పట్టాడు. రోహిత్‌ ఔటైన తర్వాత ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించే బాధ్యతను అయ్యర్‌ తీసుకున్నాడు. ఆరంభంలో నిదానంగా ఆడిన అతడు కుదురుకున్నాక జోరు పెంచాడు. మరోవైపు రిషబ్‌ పంత్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో అలరించాడు.

హఫ్‌ సెంచరీలు

హఫ్‌ సెంచరీలు

ఈ క్రమంలోనే నిలకడగా ఆడుతున్న శ్రేయాస్‌ హఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అతనికిది ఐదో హాఫ్‌సెంచరీ కావడం విశేషం. అయ్యర్‌ సహకారంతో బౌండరీలతో రెచ్చిపోయిన పంత్ కూడా హఫ్‌ సెంచరీ చేసాడు. వన్డే కెరీర్‌లో పంత్‌కిదే తొలి అర్ధ శతకం. వరుస వైఫల్యాలపై విమర్శలు ఎదుర్కొంటున్న పంత్‌.. ఓ మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో అయ్యర్ (70)పెవిలియన్ చేరాడు. 38 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ 4 వికెట్లకు 199 పరుగులు చేసింది. క్రీజులో పంత్ (63), కేదార్ జాదవ్ (3) ఉన్నారు. విండీస్ బౌలర్లలో కాట్రెల్, జోసఫ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.

Story first published: Sunday, December 15, 2019, 16:54 [IST]
Other articles published on Dec 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X