న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వన్డే సిరీస్‌కూ ధావన్ దూరం.. శాంసన్‌కు చోటు?!!

India vs West Indies: Shikhar Dhawan to miss out West Indies ODI series also

ఢిల్లీ: టీమిండియా రెగ్యులర్ ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ మోకాలి గాయం కారణంగా ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరం అయిన విషయం తెలిసిందే. అయితే టీ20 సిరీస్‌ అనంతరం వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు కూడా ధావన్‌ అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు.

మూడో టీ20: మార్పులతో బరిలోకి టీమిండియా.. తుది జట్టు ఇదేనా?!!మూడో టీ20: మార్పులతో బరిలోకి టీమిండియా.. తుది జట్టు ఇదేనా?!!

మోకాలికి గాయం:

మోకాలికి గాయం:

ధావన్‌ సయ్యద్ ముస్తాక్‌ అలీ టోర్నీలో ఆడుతుండగానే వెస్టిండీ టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. ముస్తాక్‌ అలీ టోర్నీలో భాగంగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ధావన్‌ మోకాలికి గాయం అయింది. దీంతో విండీస్‌తో టీ20 సిరీస్‌కు బీసీసీఐ సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టారు. ధావన్‌ స్థానంలో కేరళ వికెట్‌కీపర్‌ సంజూ శాంసన్‌ను ఎంపిక చేశారు. అయితే ఇప్పటి వరకు జరిగిన రెండు టీ20ల్లో అతనికి ఆడే అవకాశమే రాలేదు. తుది జట్టులో వికెట్‌కీపర్‌ రిషబ్ పంత్‌ను ఆడించడంతో రిజర్వు బెంచ్‌కే పరిమితయ్యాడు.

వన్డే సిరీస్‌కూ దూరం:

వన్డే సిరీస్‌కూ దూరం:

డిసెంబర్ 15న బెంగళూరులో మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ వన్డే నాటికి ధావన్‌ అందుబాటులో ఉంటాడనుకున్నప్పటికీ అతని గాయం ఇంకా తగ్గలేదని బెంగుళూరుకు చెందిన 'మిర్రర్‌' అనే వార్తా సంస్థ ఓ కథనంలో వెల్లడించింది. ధావన్‌ స్థానంలో జట్టులోకి ఎవరిని తీసుకునేది బీసీసీఐ త్వరలో నిర్ణయించనుందట. ధావన్ గాయంను బీసీసీఐ వైద్య బృందం సమీక్షించి.. గాయం పూర్తిగా నయం కావడానికి మరికొంత సమయం పడుతుందని తెలిపిందట.

శాంసన్‌కు చోటు:

శాంసన్‌కు చోటు:

వచ్చే ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ జట్టులో ధావన్ కీలక ఆటగాడు. కాబట్టి.. ఐపీఎల్ సీజన్‌-13కు ముందు బీసీసీఐ అతనిపై ఒత్తిడి పెంచే సాహసం చేయలేదు. ధావన్‌ స్థానంలో మరోసారి సంజు శాంసన్‌నే జట్టులోకి తీసుకోవచ్చని సమాచారం. శుభ్‌మన్‌ గిల్‌, మయాంక్‌ అగర్వాల్‌లలో ఒకరికి అవకాశం కూడా రావొచ్చని తెలుస్తోంది. అయితే కేఎల్ రాహుల్ మరోసారి రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది.

బెంగళూరులో తొలి వన్డే:

బెంగళూరులో తొలి వన్డే:

విండీస్‌తో మూడు మ్యాచ్‌లో సిరిస్‌లో భాగంగా తొలి వన్డే డిసెంబర్‌ 15న బెంగళూరులో జరుగనుంది. 18న విశాఖపట్నం, 22న కటక్‌లో జరగనుంది. ప్రస్తుతం జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ 1-1తో సమం అయిన విషయం తెలిసిందే. తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించగా.. రెండో టీ20లో విండీస్‌ విజయాన్ని అందుకుంది. బుధవారం ఇరు జట్ల మధ్య మూడో టీ20 జరగనుంది.

Story first published: Tuesday, December 10, 2019, 17:23 [IST]
Other articles published on Dec 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X