న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పొలార్డ్, నరైన్ సత్తా చాటుతారు.. అభిమానులకు వినోదం ఖాయం!!

India vs West Indies Series: Pollard, Narines Experience Will Benefit team says Windies Coach Floyd Reifer

ఫ్లోరిడా: విండీస్ స్టార్‌ ఆల్‌రౌండర్లు కీరన్‌ పొలార్డ్‌, సునీల్‌ నరైన్‌ల అనుభవం జట్టుకు ఉపయోగపడుతుంది. ఇద్దరూ టీమిండియాతో జరిగే టీ20 సిరీస్‌లో సత్తా చాటుతారు అని వెస్టిండీస్‌ కోచ్‌ ఫ్లాయిడ్‌ రీఫర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్లు 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనున్నాయి.

సానియా రెండో ఇన్నింగ్స్‌.. ఇక సాధించేవన్నీ బోనస్‌లేసానియా రెండో ఇన్నింగ్స్‌.. ఇక సాధించేవన్నీ బోనస్‌లే

ఈ పర్యటనలో మొదటి రెండు టీ20లు అమెరికాలోని ప్లోరిడా వేదికగా జరగనున్నాయి. అనంతరం మిగతా సిరిస్ అంతా కరేబియన్ దీవులకు మారనుంది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా తొలి టీ20 శనివారం జరగనుంది. ఈ సందర్భంగా ఫ్లాయిడ్‌ రీఫర్‌ మాట్లాడుతూ... 'జట్టులో చాలా మంది యువకులు ఉన్నారు. జూనియర్, సీనియర్‌ ఆటగాళ్లతో జట్టు మంచి సమతూకంతో ఉంది. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు యువతతో కలిసి ఆడితే ఫలితాలు వస్తాయి' అని రీఫర్‌ అభిప్రాయపడ్డాడు.

'ఫ్లోరిడాలో జరిగే మ్యాచ్‌ల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. కచ్చితంగా ఈ వారం చివరలో అమెరికా అభిమానులకు వినోదం లభించబోతోంది. టీ20 స్టార్స్‌ పొలార్డ్‌, నరైన్‌తో పాటు కెప్టెన్‌ బ్రాత్‌వైట్‌ తిరిగి జట్టులోకి వచ్చారు. వీరి అనుభవం జట్టుకు ఉపయోగపడుతుంది. ఇక స్పిన్నర్‌ ఖారీ పియర్‌, బ్రాంబల్‌ సత్తా చూపాలనుకుంటున్నారు. ఖారీ మంచి ఫీల్డర్ కూడా. బ్రాంబల్‌ గయానా తరపున బాగా రాణించాడు' అని రీఫర్‌ పేర్కొన్నాడు.

యాషెస్‌ సిరీస్.. విరాట్ కోహ్లీని అధిగమించిన స్టీవ్‌ స్మిత్‌యాషెస్‌ సిరీస్.. విరాట్ కోహ్లీని అధిగమించిన స్టీవ్‌ స్మిత్‌

ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో వెస్టిండిస్ తన చెత్త ప్రదర్శనతో నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. దీంతో భారతతో జరగనున్న సిరిస్‌లో సత్తా చాటాలని వెస్టిండిస్ క్రికెటర్లు ఊవిళ్లూరుతున్నారు. ఇక, టీ20ల్లో వెస్టిండిస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. టీ20 సిరిస్ అంటేనే ఆ జట్టు క్రికెటర్లు విజృంభిస్తారు. కీరన్ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్, షిమ్రాన్ హెట్ మెయిర్, సునీల్ నరేన్ వంటి క్రికెటర్లు ఈ సిరిస్‌లో సత్తా చాటే అవకాశం ఉంది.

Story first published: Friday, August 2, 2019, 14:50 [IST]
Other articles published on Aug 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X