న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'బాహుబలి'కి ప్రత్యేక శిక్షకుడు.. పూర్తి ఫిట్‌నెస్‌పై దృష్ఠి

India vs West Indies: Rahkeem Cornwall will undergo training to lose weight says Ricky Skerritt

హైదరాబాద్: తాజాగా భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో 'యూనివర్సల్‌ బాస్‌' క్రిస్‌ గేల్‌కు విండీస్ సెలెక్టర్లు అవకాశం ఇవ్వలేదు. అయితే ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అదరగొడుతున్న విండీస్ 'బాహుబలి' రకీం కార్న్‌వాల్‌కు మాత్రం సెలెక్టర్లు జట్టులో చోటు కల్పించారు. ఆంటిగ్వాకు చెందిన కార్న్‌వాల్‌ను సరదాగా 'మౌంటైన్‌ మ్యాన్‌'గా పిలుస్తారు. అయితే ఇలా పిలవడానికి అసలు కారణం మాత్రం అతడి భారీకాయం. కార్న్‌వాల్‌ ఆరు అడుగుల ఆరు అంగుళాల ఎత్తు, 140 కిలోల బరువు ఉండడం విశేషం.

<strong>తొలి సెంచరీని ఆగస్టు 14నే.. సచిన్‌కు ఈ రోజు ఎంతో ప్రత్యేకం</strong>తొలి సెంచరీని ఆగస్టు 14నే.. సచిన్‌కు ఈ రోజు ఎంతో ప్రత్యేకం

కార్న్‌వాల్‌ క్రికెట్‌లో రాణించలేడని అందరూ భావించారు. కానీ.. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో నిలకడ ప్రదర్శన చేస్తూ అంతర్జాతీయ మ్యాచులకు ఎంపిక అయ్యాడు. కార్న్‌వాల్‌ జట్టులో చోటు మాత్రం దక్కించుకున్నా.. అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగాలంటే మాత్రం కచ్చితంగా బరువు తగ్గాల్సిందే. బరువు తగ్గేందుకు అతడు కూడా సిద్దమయ్యాడు.

కార్న్‌వాల్‌ బరువు తగ్గేందుకు సిద్ధమయ్యాడని, తర్వలోనే శిక్షణలో పాల్గొంటాడని విండీస్ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు రిక్కీ స్కెరిట్‌ తెలిపాడు. 'విండీస్ క్రికెట్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ట్రైయినర్‌ని నియమించాం. పోషకాహార నిపుణుడైన ఈ ట్రైయినర్‌ సరైన ప్రణాళికతో కార్న్‌వాల్‌ బరువుని తగ్గిస్తాడు. కార్న్‌వాల్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించేందుకు అతను సహకరిస్తాడు. కార్న్‌వాల్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన స్పిన్నర్. ఆ ప్రదర్శనతోనే అంతర్జాతీయ మ్యాచులకు ఎంపిక అయ్యాడు' అని స్కెరిట్‌ తెలిపాడు.

<strong>'హెడ్ కోచ్‌ ఎంపికలో కపిల్ కమిటీపై ఎలాంటి ఒత్తిడి లేదు'</strong>'హెడ్ కోచ్‌ ఎంపికలో కపిల్ కమిటీపై ఎలాంటి ఒత్తిడి లేదు'

కార్న్‌వాల్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 55 మ్యాచుల్లో 2224 పరుగులతో పాటు 260 వికెట్లు పడగొట్టాడు. 2017లో భారత్‌తో జరిగిన అనధికార టెస్టులో ఐదు వికెట్లు తీసాడు. విరాట్‌ కోహ్లీ, ఛతేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానే వంటి టాప్ ఆటగాళ్లను పెవిలియన్‌ చేర్చాడు. విండీస్-ఏతో జరిగిన వన్డేలో కార్న్‌వాల్‌ను దీపక్‌ చాహర్‌ ఆటపట్టించాడు. కార్న్‌వాల్‌ మైదానంలోకి వస్తుండగా ఫీల్డర్‌ దీపక్‌ చాహర్‌ సైతం అతడి నడకను అనుసరించి ఎదురుగా వెళ్లాడు. అతను దగ్గరకు వస్తున్న సమయంలో పక్కకు వెళ్లిపోయాడు. అయినా కార్న్‌వాల్‌ ఎలాంటి కామెంట్ చేయకుండా వెళ్ళిపోయాడు.

Story first published: Wednesday, August 14, 2019, 16:01 [IST]
Other articles published on Aug 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X