న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

5వ వన్డేలో ఓ చెత్త రికార్డుని ఖాతాలో వేసుకున్న వెస్టిండిస్

India vs West Indies Live Score 5th ODI: West indies worst record against india in odis

హైదరాబాద్: తిరువనంతపురం వేదికగా భారత్‌తో జరిగిన ఐదో వన్డేలో పర్యాటక వెస్టిండీస్ జట్టు సమిష్టిగా విఫలమైంది. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా తొలి మూడు వన్డేల్లో అద్భుతంగా రాణించిన వెస్టిండిస్ ఆటగాళ్లు.. నాలుగో వన్డే నుంచి ఘోరంగా విఫలమయ్యారు. నాలుగో వన్డేలో 153 పరుగులకే ఆలౌటైన విండిస్ ఐదో వన్డేలో 104 పరుగులకే ఆలౌటైంది.

<strong>5వ వన్డేలో భారత్ విజయం: 3-1తో ఐదు వన్డేల సిరిస్ కైవసం</strong>5వ వన్డేలో భారత్ విజయం: 3-1తో ఐదు వన్డేల సిరిస్ కైవసం

ఈ క్రమంలో వెస్టిండిస్ జట్టు ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. గురువారం కేరళలోని తిరువనంతపురం గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియం వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో 104 పరుగులకే ఆలౌటంది. దీంతో వన్డేల్లో భారత జట్టుపై అత్యల్ప స్కోరుని నమోదు చేసిన జట్టుగా వెస్టిండిస్ నిలిచింది. భారత్‌పై వన్డేల్లో విండీస్‌కు ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం.

1997లో పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో

1997లో పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో

1997లో పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్‌ 121 పరుగులకే ఆలౌటైంది. ఇది ఇప్పటివరకూ భారత్‌పై విండీస్‌కు అత‍్యల్ప స్కోరు కాగా, తాజాగా ఆ చెత్త రికార్డుని వెస్టిండిస్ సవరించింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీయగా, బూమ్రా, ఖలీల్‌ అహ్మద్‌లు తలో రెండు వికెట్లు తీశారు.

తొలి మూడు వన్డేల్లో 926 పరుగులు చేసిన వెస్టిండిస్

తొలి మూడు వన్డేల్లో 926 పరుగులు చేసిన వెస్టిండిస్

భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌లకు చెరో వికెట్‌ లభించింది. ఈ సిరిస్‌లో తొలి మూడు వన్డేల్లో వెస్టిండీస్ 38.58 సగటుతో 926 పరుగులు చేసిన వెస్టిండిస్ జట్టు చివరి రెండు వన్డేల్లో మాత్రం 12.85 సగటుతో 257 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక, వికెట్ల విషయానికి వస్తే తొలి మూడు వన్డేల్లో 24 వికెట్లు కోల్పోగా... ఆఖరి రెండు మ్యాచుల్లో 20 వికెట్లు చేజార్చుకుంది.

వన్డేల్లో భారత్‌పై విండీస్ అతి తక్కువ స్కోర్లు:

104 తిరువనంతపురం, 2018

121 పోర్ట్ ఆఫ్ స్పెయిన్, 1997

123 కోల్‌కతా, 1993

126 పెర్త్, 1991

129 జోహన్నెస్‌బర్గ్, 2009

1
44270
Story first published: Thursday, November 1, 2018, 17:51 [IST]
Other articles published on Nov 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X