న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

5వ వన్డేలో సరదా సన్నివేశం!: రోహిత్ వెనక్కిరా? అన్న కోహ్లీ

India vs West Indies Live Score 5th ODI: Virat Kohli-Rohit Sharma Funny moment in thiruvananthapuram

హైదరాబాద్: తిరువనంతపురం వేదికగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య జరిగిన ఐదో వన్డేలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ జట్టు 31.5 ఓవర్లకు 104 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టులో రోహిత్ శర్మ (63 నాటౌట్: 56 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులు) దూకుడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. భారత్‌ 6 పరుగుల వద్దే ఓపెనర్ శిఖర్‌ ధావన్‌(6) వికెట్‌ను కోల్పోయింది. దీంతో ఈసిరిస్‌లో అతడు మరోసారి పేలవ ప్రదర్శన చేశాడు.

ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌లో సరదా సన్నివేశం

ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌లో సరదా సన్నివేశం

మరోవైపు ఆచితూచి ఆడుతున్న రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ 8వ ఓవర్ వేసిన ఫాస్ట్ బౌలర్ థామస్ బౌలింగ్‌లో బంతిని డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి నేరుగా వెళ్లి విండీస్ వికెట్ కీపర్ షై హోప్ చేతుల్లో పడింది. దీంతో రోహిత్ శర్మ ఔట్ అనుకుని పెవిలియన్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.

నోబాల్ అంటూ చెయ్యి లేపిన ఫీల్డ్ అంపైర్

నోబాల్ అంటూ చెయ్యి లేపిన ఫీల్డ్ అంపైర్

అదే సమయంలో రోహిత్ శర్మ వెనుక నుంచి నోబాల్ అంటూ ఫీల్డ్ అంపైర్ చెయ్యి లేపాడు. అంపైర్ నిర్ణయంతో షాక్‌కి గురైన బౌలర్ థామస్ పిచ్‌పైనే కూర్చిండిపోగా రోహిత్ శర్మ మాత్రం కీపర్ బంతిని పట్టగానే ఔటనుకుని నిరాశగా పెవిలియన్‌ బాట పట్టాడు. అదే సమయంలో నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న కెప్టెన్ కోహ్లీ వేగంగా స్పందించాడు.

రోహిత్ ఎక్కడికి వెళ్తున్నావు?

"రోహిత్ ఎక్కడికి వెళ్తున్నావు? ఆ బంతి నోబాల్.. వెనక్కి వచ్చి బ్యాటింగ్ చెయ్" అంటూ గట్టిగా అరుస్తూ సైగ చేశాడు. మళ్లీ వెనక్కి వచ్చిన రోహిత్ శర్మ బ్యాటింగ్‌ని కొనసాగించి రెచ్చిపోయి ఆడుతూ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. అంతేకాదు 14.5 ఓవర్లలోనే టీమిండియాను విజయం వైపు నడిపించాడు.

వన్డేల్లో 200 సిక్సులు బాదిన రోహిత్ శర్మ

వన్డేల్లో 200 సిక్సులు బాదిన రోహిత్ శర్మ

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ వన్డేల్లో 200వ సిక్సర్‌ బాదాడు. కేవలం 187 ఇన్నింగ్సుల్లోనే రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు. అంతేకాదు వెస్టిండీస్‌పై ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు 360 చేసిన రెండో భారత ఆటగాడిగా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో కోహ్లీ 444తో అగ్రస్థానంలో ఉన్నాడు.

Story first published: Thursday, November 1, 2018, 19:03 [IST]
Other articles published on Nov 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X