న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబైలో 70 నాటౌట్: తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌ అంటూ విరాట్ కోహ్లీ ఇలా!

India vs West Indies: ‘It was one of the best innings I have ever played’- Virat Kohli

హైదరాబాద్: ముంబై వేదికగా బుధవారం వెస్టిండిస్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 67 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ 29 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 70 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఈ ఇన్నింగ్స్ తన కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌ అని కోహ్లీ పేర్కొన్నాడు. మ్యాచ్‌ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ "ఇది నాకు ఎంతో ప్రత్యేకమైన రోజు. ఇది నాకు ఒక స్పెషల్‌ గిఫ్ట్‌.. స్పెషల్‌ మ్యాచ్‌. నా అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఇదొకటి. తొలుత బ్యాటింగ్‌ చేసి విజయం సాధించడం ఎంతో బాగుంది. అన్ని ఫార్మాట్లలో రాణించగలనని తెలుసు" అని అన్నాడు.

వాంఖడేలో పరుగుల వరద.. నమోదైన రికార్డులు ఇవే!!వాంఖడేలో పరుగుల వరద.. నమోదైన రికార్డులు ఇవే!!

మన ఆలోచన విధానంపై

మన ఆలోచన విధానంపై

"మన ఆలోచన విధానంపై ఇది ఆధారపడి ఉంటుంది. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఈ మ్యాచ్‌ ఎంతో ప్రేరణగా నిలుస్తుంది. టీ20ల్లో విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇలా రాణించడం ఎంతో గొప్పగా ఉంది. మైదానంలో సరైన ప్లాన్‌ను అమలు చేయడం ఎంతో కీలకం. రోహిత్, రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు" అని కోహ్లీ కొనియాడాడు.

బ్యాటింగ్‌ అనగానే కొద్దిగా ఆలోచించాం

బ్యాటింగ్‌ అనగానే కొద్దిగా ఆలోచించాం

"తొలుత బ్యాటింగ్‌ అనగానే కొద్దిగా ఆలోచించాం. కానీ పిచ్‌ మాకు సహకరించింది. పిచ్‌, మైదానాన్ని బట్టి ఎలా ఆడాలో మనం నిర్ణయించుకోవాలి. వచ్చే ఏడాది ప్రపంచకప్‌ ఆస్ట్రేలియాలో జరగనుంది. అక్కడ పెద్ద బౌండరీలు ఉంటాయని మనం గుర్తించాలి" అని విరాట్ కోహ్లీ వెల్లడించాడు.

 టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు భారత జట్టులో రోహిత్‌ శర్మ (34 బంతుల్లో 71), కేఎల్‌ రాహుల్ (56 బంతుల్లో 91) రాణించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండిస్ 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులకే పరిమితమైంది.

2-1తో సిరిస్ కైవసం

దీంతో టీమిండియా మూడు టీ20ల సిరిస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. అంతకముందు హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించగా... తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో టీ20లో వెస్టిండిస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే చెన్నై వేదికగా ఆదివారం జరగనుంది.

Story first published: Thursday, December 12, 2019, 12:37 [IST]
Other articles published on Dec 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X