న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ vs విండిస్; కపిల్‌ రికార్డుని ఇషాంత్ బద్దలు కొట్టేనా?

India vs West Indies 2019 : Ishant Sharma One Wicket Away From Surpassing Kapil Dev In Elite List
India vs West Indies: Ishant Sharma one wicket away from surpassing Kapil Dev in elite list

హైదరాబాద్: టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ మరో అరుదైన రికార్డుకి చేరువయ్యాడు. ఆంటిగ్వా వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇషాంత్ శర్మ అద్భుత ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా రెండో టెస్టు శుక్రవారం నుంచి జమైకాలోని కింగ్‌స్టన్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.

<strong>సానియా మిర్జా పేరు సడన్‌గా పీటీ ఉషగా: విశాఖ బీచ్‌రోడ్‌లో ఫోటో వైరల్</strong>సానియా మిర్జా పేరు సడన్‌గా పీటీ ఉషగా: విశాఖ బీచ్‌రోడ్‌లో ఫోటో వైరల్

ఇషాంత్ శర్మ మరో వికెట్‌ తీస్తే

ఇషాంత్ శర్మ మరో వికెట్‌ తీస్తే

ఈ టెస్టులో టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ మరో వికెట్‌ తీస్తే మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్‌ రికార్డును అధిగమిస్తాడు. ఉపఖండం బయట టెస్టుల్లో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా నిలుస్తాడు. ఉపఖండం బయట ఇషాంత్ శర్మ ఇప్పటివరకు 45 వికెట్లతో కపిల్ దేవ్ సరసన నిలిచాడు.

50 వికెట్లతో అగ్రస్థానంలో కుంబ్లే

50 వికెట్లతో అగ్రస్థానంలో కుంబ్లే

ఈ జాబితాలో భారత క్రికెట్ జట్టు తరుపున టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్‌ కుంబ్లే 50 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆంటిగ్వా వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇషాంత్ శర్మ ఎనిమిది వికెట్లతో అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన ఇషాంత్‌, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీశాడు.

318 పరుగుల తేడాతో విజయం

318 పరుగుల తేడాతో విజయం

తొలి టెస్టులో టీమిండియా 318 పరుగుల తేడాతో విజయం సాధించడంలో ఇషాంత్ శర్మ కీలకపాత్ర పోషించాడు. నెలరోజుల సుదీర్ఘ వెస్టిండిస్ పర్యటనలో కోహ్లీసేనకు ఇదే ఆఖరి మ్యాచ్ కావడం విశేషం. ఈ టెస్టుతో టీమిండియా వెస్టిండిస్ పర్యటన ముగుస్తుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత జరిగిన టీ20 సిరిస్‌ను 3-0తో టీమిండియా కైవసం చేసుకుంది.

ధోని రికార్డుని బద్దలు కొట్టనున్న కోహ్లీ

ధోని రికార్డుని బద్దలు కొట్టనున్న కోహ్లీ

ఆ తర్వాత జరిగిన వన్డే సిరిస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. ఇప్పుడు రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌పై టీమిండియా కన్నేసింది. రెండో టెస్టులో కూడా టీమిండియా గెలిస్తే కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అరుదైన ఘనతను సాధిస్తాడు. కెప్టెన్‌గా ధోనికి ఇది 28వ విజయం అవుతుంది. ఈ క్రమంలో ఇప్పటివరకూ ధోని పేరిట ఉన్న 27 మ్యాచ్‌ల రికార్డును కోహ్లీ బద్దలు కొడతాడు.

Story first published: Thursday, August 29, 2019, 12:31 [IST]
Other articles published on Aug 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X