న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాజ్‌కోట్ టెస్టులో విండిస్‌పై అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన భారత్

India vs West indies 2018 : India Wins On Windies By An Innings By 272 Runs | Oneindia Telugu
India vs West Indies Highlights, 1st Test: Dominant India Beat Listless Windies By An Inning And 272 Runs

హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా వెస్టిండిస్‌ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ మరో రెండు రోజులు మిగిలుండగానే ఘన విజయాన్ని సాధించింది. కేవలం రెండన్నర రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టు మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా ఏకంగా ఇన్నింగ్స్ 272 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

శనివారం మూడో రోజు ఆటలో భాగంగా ఫాలోఆన్‌ ఆడిన వెస్టిండీస్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 50.5 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా భారత్‌ తన టెస్టు క్రికెట్‌ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే ఇటీవల అప్ఘన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో లభించిన ఇన్నింగ్స్‌ 262 పరుగుల రికార్డును టీమిండియా అధిగమించింది.

1
44264

వెస్టిండిస్ జట్టు ఘోర ఓటమి

రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండిస్ ఆటగాళ్లలో కీరన్‌ పావెల్‌(83) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టుకు ఘోర ఓటమి తప్పలేదు. భారత్‌ బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ ఐదు వికెట్లతో విండీస్‌ పతనాన్ని శాసించగా, జడేజా మూడు వికెట్లు సాధించాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌కు రెండు వికెట్లు లభించాయి. అనంతరం వెస్టిండిస్ జట్టుని తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌట్ చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 196 పరుగులకే కుప్పకూల్చింది.

శనివారం 94/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో

శనివారం 94/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో

ఆటలో భాగంగా మూడో రోజైన శనివారం 94/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన విండీస్‌ 181 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో విండీస్‌ ఫాలోఆన్‌ ఆడాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన వెస్టిండిస్ జట్టు పేలవ ప్రదర్శన కబనర్చింది. ఓపెనర్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌(10) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, ఆ తర్వాత స్వల్ప విరామాల్లో వరుసగా కీలక వికెట్లను కోల్పోయింది.

ఐదు వికెట్లు తీసిన కుల్దీప్‌ యాదవ్‌

ఐదు వికెట్లు తీసిన కుల్దీప్‌ యాదవ్‌

విండీస్‌ తొలి వికెట్‌ను అశ్విన్‌ తీయగా, ఆపై ఐదు వికెట్లను కుల్దీప్‌ యాదవ్‌ సాధించాడు. విండీస్‌ చివరి నాలుగు వికెట్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, అశ్విన్‌ వికెట్‌ తీశాడు. దీంతో వెస్టిండిస్ జట్టు కనీసం రెండొంద పరుగుల మార్కును చేరుకుండానే ఆలౌటైంది. దీంతో రెండు టెస్టుల ఈ సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అంతకముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 649/9 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.

పృథ్వీ షా, కోహ్లీ, జడేజా సెంచరీలు

పృథ్వీ షా, కోహ్లీ, జడేజా సెంచరీలు

గురువారం ప్రారంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత బ్యాట్స్‌‌మెన్లలో తొలి టెస్టు తొలిరోజు యువ ఆటగాడు పృథ్వీషా (134) పరుగులతో సెంచరీ సాధించగా.... పుజారా (86) పరుగులతో తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రెండో రోజైన శుక్రవారం విరాట్ కోహ్లీ(137) సెంచరీ చేశాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 24వ సెంచరీ.

టెస్టుల్లో 24వ సెంచరీ సాధించిన కోహ్లీ

టెస్టుల్లో 24వ సెంచరీ సాధించిన కోహ్లీ

ఈ ఏడాది టెస్టుల్లో కోహ్లీకి ఇది నాలుగో సెంచరీ. కోహ్లీ సెంచరీ చేయగా, రిషబ్‌ పంత్‌(92) చేజార్చుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా ఆచితూచి ఆడాడు. ఆరో వికెట్‌కు 64 పరుగులు జోడించిననంతరం కోహ్లీ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది.

649/9 వద్ద డిక్లేర్‌ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన భారత్

649/9 వద్ద డిక్లేర్‌ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన భారత్

అనంతరం క్రీజులోకి వచ్చిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కుల్దీప్‌(12), ఉమేశ్‌ యాదవ్‌(22), మహ్మద్‌ షమీ(2 నాటౌట్‌)ల సాయంతో ఆచితూచి ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 132 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. జడేజా సెంచరీ అనంతరం కెప్టెన్‌ కోహ్లీ భారత ఇన్నింగ్స్‌ను 649/9 వద్ద డిక్లేర్‌ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

రాజ్‌కోట్ టెస్టు స్కోరు వివరాలు

రాజ్‌కోట్ టెస్టు స్కోరు వివరాలు

తొలి ఇన్నింగ్స్

టీమిండియా - 649/9 డిక్లేర్

వెస్టిండిస్ - 181 ఆలౌట్

రెండో ఇన్నింగ్స్

ఫాలో ఆన్‌లో వెస్టిండిస్ - 196 ఆలౌట్

Story first published: Saturday, October 6, 2018, 16:30 [IST]
Other articles published on Oct 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X