న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇండియా vs వెస్టిండీస్ ఫ్లాష్‌బ్యాక్‌: నారి కాంట్రాక్టర్‌కు గాయం.. కెరీర్ సమాప్తం

India vs West Indies flashbacks: When Nari Contractor’s life got saved but career ended

వచ్చే నెలలో వెస్టిండీస్‌ పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. ఆగస్టు 22 నుండి సెప్టెంబర్ 3 వరకు రెండు టెస్టుల సిరీస్‌లో వెస్టిండీస్‌తో భారత్ తలపడనుంది. టెస్టుల్లో ఈ రెండు దేశాల మధ్య గతంలో వెస్టిండీస్‌ ఆధిపత్యం చెలాయించినా.. ఇటీవలి కాలంలో కరేబియన్‌ జట్టుపై భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది. 2002లో చివరిసారిగా టీమిండియాపై విండీస్ టెస్ట్ సిరీస్ గెలిచింది. అప్పటి నుండి ఆడిన ఏడు సిరీస్‌లను భారత్ గెలుచుకుంది.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

ఆ మ్యాచ్ ఆడాలనుకోలేదు:

ఆ మ్యాచ్ ఆడాలనుకోలేదు:

1962లో వెస్టిండీస్‌ వేదికగా జరిగిన సిరీస్‌లో భారత కెప్టెన్ నారి కాంట్రాక్టర్‌కు ప్రాణాంతకమైన గాయం అయింది. 1962లో జరిగిన ఆ సిరీస్‌లో మొదటి రెండు టెస్టుల్లో ఓడిపోయిన తరువాత స్థానిక జట్టుతో నాలుగు రోజుల మ్యాచ్‌ ఆడటానికి టీమిండియా బార్బడోస్‌కు వెళ్ళింది. అప్పటికే రెండు మ్యాచులలో పేలవ ప్రదర్శన చేసిన కాంట్రాక్టర్‌.. బార్బడోస్ మ్యాచ్‌లో ఆడాలని అనుకోలేదు. కానీ జట్టులో గాయాల సమస్య కారణంగా మ్యాచ్ ఆడాడు.

 బంతిని తప్పుగా అంచనా వేసి:

బంతిని తప్పుగా అంచనా వేసి:

బార్బడోస్ మొదటి ఇన్నింగ్స్‌లో 394 పరుగులు చేసింది. అనంతరం దిలీప్ సర్దేసాయ్‌తో కలిసి కాంట్రాక్టర్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. బార్బడోస్ బౌలర్ గ్రిఫిత్ వేసిన బంతిని కాంట్రాక్టర్ తప్పుగా అంచనా వేయడంతో అతని కుడి చెవి పైభాగంలో బలంగా తాకింది. మొదట గాయం తీవ్రత ఏమీ లేదని భావించారు. అనంతరం కాంట్రాక్టర్ మైదానాన్ని వీడాడు. రాత్రి వరకు కాంట్రాక్టర్ పరిస్థితి క్షీణించింది. గాయం దగ్గర రక్తస్రావం అయి వాపు వచ్చింది.

కెరీర్ సమాప్తం:

కెరీర్ సమాప్తం:

న్యూరో సర్జన్ ట్రినిడాడ్‌లో ఉన్నందున పక్కనే ఉన్న సాధారణ డాక్టర్ ప్రధమ చికిత్స చేసాడు. మరుసటి రోజు ఉదయం న్యూరో సర్జన్ వచ్చి రక్తం గడ్డకట్టిందని గుర్తించాడు. శస్త్రచికిత్స కోసం వెంటనే కాంట్రాక్టర్‌ను ఆపరేషన్ థియేటర్‌కు తరలించారు. ఆ రాత్రి మొత్తం భారత జట్టు ఆసుపత్రిలో ఉండి కెప్టెన్ కోలుకోవాలని ప్రార్ధించారు. ఆపరేషన్ సక్సెస్ అవడంతో కాంట్రాక్టర్‌ బతికిపోయాడు. ఇక కెప్టెన్సీ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీకి వెళ్ళింది. గాయం అనంతరం కాంట్రాక్టర్ 1963-64లో మైదానంలోకి దిగి దేశీయ క్రికెట్‌లో సెంచరీలు చేసినప్పటికీ మళ్లీ జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు. గాయం కాంట్రాక్టర్ కెరీర్‌ను నాశనం చేసింది.

Story first published: Wednesday, July 24, 2019, 17:03 [IST]
Other articles published on Jul 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X