న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హైదరాబాద్ టెస్ట్: ఛేజ్ సెంచరీ, విండీస్‌ 311 ఆలౌట్‌‌, ఉమేశ్‌కు 6 వికెట్లు

India vs Westindies 2018 : West Indies All Out For 311
India Vs West Indies, Day 2, Live Updates: Chase ton guides WI to 311; Umesh claims maiden six-for

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండిస్ జట్టు 101.4 ఓవర్లలో 311 పరుగులకే ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోరు 295/7తో శనివారం ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వెస్టిండిస్ జట్టు ఎంతో సేపు క్రీజులో నిలవలేకపోయింది. కేవలం 16 పరుగులను మాత్రమే జోడించి మిగిలిన మూడు వికెట్లను కోల్పోయింది.

ఉప్పల్‌ స్టేడియంలో వాస్తుదోషం!: ఆ గుడి కట్టాక మారిన ఆతిథ్య జట్టు తలరాత!ఉప్పల్‌ స్టేడియంలో వాస్తుదోషం!: ఆ గుడి కట్టాక మారిన ఆతిథ్య జట్టు తలరాత!

తొలిరోజు భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న విండీస్‌ ఓవర్‌నైట్‌ ఆటగాడు రోస్టన్‌ ఛేజ్‌(106; 189 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రోస్టన్‌ చేజ్‌ (106) ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బిషూ(2), గాబ్రియెల్‌లు వెనువెంటనే పెవిలియన్‌ బాటపట్టారు.

1
44265

రోస్టన్ ఛేజ్ వికెట్ తీయడం ద్వారా

ఈ టెస్టులో రోస్టన్ ఛేజ్ వికెట్ తీయడం ద్వారా ఉమేశ్ యాదవ్ టెస్టుల్లో రెండోసారి ఐదు వికెట్లను తీసుకున్నాడు. చివరి మూడు వికెట్లు ఉమేశ్‌ యాదవ్‌ సాధించడం మరో విశేషం. దీంతో రెండో రోజు మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సేపటికే వెస్టిండిస్ జట్టు ఆలౌటైంది. భారత బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌ 6 వికెట్లు తీయగా.. కుల్దీప్‌ యాదవ్‌ మూడు, అశ్విన్‌ ఒక వికెట్ తీసుకున్నారు.

తన టెస్టు కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు

ఈ టెస్టులో ఉమేశ్‌ యాదవ్‌ తన టెస్టు కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు సాధించడం ద్వారా ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు ఉమేశ్‌ యాదవ్‌ ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు మాత్రమే అత్యుత్తమం కాగా, దాన్ని తాజాగా సవరించాడు.

ఈ వేదికలో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన తొలి పేసర్‌

ఈ వేదికలో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన తొలి పేసర్‌

మరొకవైపు స్వదేశంలో ఒక భారత పేసర్‌ నమోదు చేసిన 13వ అత్యుత్తమ బౌలింగ్‌గా ఇది నిలిచింది. కాగా, ఈ వేదికలో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన తొలి పేసర్‌గా ఉమేశ్‌ నిలిచాడు. గతంలో జహీర్‌ఖాన్‌ (4/69) ప్రదర్శన ఇప్పటివరకూ ఇక్కడ అత్యుత్తమం కాగా, ఇప్పుడు దానిని ఉమేశ్‌ యాదవ్‌ అధిగమించాడు.

Story first published: Saturday, October 13, 2018, 11:01 [IST]
Other articles published on Oct 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X