న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కింగ్ ఆసియాగా విరాట్ కోహ్లీ: హైదరాబాద్ టెస్ట్‌లో మరో రికార్డు బద్దలు

India vs West Indies: Captain Kohli breaks another record; is now the king of Asia

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూనే ఉన్నాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా వెస్టిండిస్‌తో హైదరాబాద్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ కోహ్లీ ఖాతాలో మరో అరుదైన మైలురాయి వచ్చి చేరింది.

<strong>ఇంజమామ్‌ రికార్డుకు అడుగుదూరంలో నిలిచిన కోహ్లీ</strong>ఇంజమామ్‌ రికార్డుకు అడుగుదూరంలో నిలిచిన కోహ్లీ

ఈ మ్యాచ్‌లో 78 బంతుల్లో 5 ఫోర్లతో 45 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ జట్టు స్కోరు 162 వద్ద విండిస్ బౌలర్ హోల్డర్‌కు వికెట్ల ముందు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆసియా క్రికెటర్‌గా కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు.

1
44265
మిస్బావుల్ హక్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ

మిస్బావుల్ హక్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ

65.96 యావరేజ్‌తో 4222 పరుగులు చేసిన కోహ్లీ, పాక్ మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్‌ను అధిగమించాడు. అంతకముందు ఆసియాలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్‌ పేరిట ఉంది. పాక్ తరుపున కెప్టెన్‌గా మిస్బావుల్ హక్‌ 56 టెస్టుల్లో 51.39 యావరేజితో 4214 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు ఉన్నాయి.

42 మ్యాచ్‌లకే అందుకోవడం విశేషం

42 మ్యాచ్‌లకే అందుకోవడం విశేషం

అయితే, కోహ్లీ మాత్రం ఈ రికార్డుని 42 మ్యాచ్‌లకే అందుకోవడం విశేషం. కెప్టెన్ కోహ్లీ 42 మ్యాచ్‌ల్లో 4233 పరుగులు చేశాడు. అంతేకాదు పాక్ మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్‌ యావరేజితో పోలిస్తే కోహ్లీ యావరేజ్ ఎక్కువగా ఉండటం విశేషం. కోహ్లీ ఈ పరుగులను 65.12 యావరేజితో నమోదు చేశాడు. ఇందులో 17 సెంచరీలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏ బ్యాట్స్‌మన్‌తో పోల్చినా కోహ్లీదే ఎక్కువగా ఉండటం విశేషం.

కెప్టెన్‌గా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో

కెప్టెన్‌గా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో

కెప్టెన్‌గా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 8659 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. సఫారీ జట్టు తరుపున మొత్తం 109 మ్యాచ్‌లాడిన గ్రేమ్ స్మిత్ 47.84 యావరేజితో ఈ పరుగులు సాధించాడు. ఇందులో 25 సెంచరీలు ఉన్నాయి. కాగా, కోహ్లీ ఇప్పటికే టెస్టుల్లో 24 సెంచరీలు నమోదు చేశాడు.

ఇంజిమామ్‌ ఉల్ హక్‌ రికార్డుకి అడుగు దూరంలో

ఇంజిమామ్‌ ఉల్ హక్‌ రికార్డుకి అడుగు దూరంలో

దీంతో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజిమామ్‌ ఉల్ హక్‌ రికార్డుకి అడుగు దూరంలో నిలిచాడు. పాకిస్థాన్ జట్టుకి దాదాపు 15 ఏళ్లు ప్రాతినిథ్యం వహించిన ఇంజిమామ్ ఉల్ హక్ కెరీర్‌లో 120 టెస్టులాడి 25 సెంచరీలు సాధించగా.. విరాట్ కోహ్లీ కేవలం 72 టెస్టుల్లోనే 24 సెంచరీలతో అతడ్ని సమీపించాడు. హైదరాబాద్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న తొలి ఇన్నింగ్స్‌లో 45 పరుగులకే పెవిలియన్‌కు చేరిన కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధిస్తే ఇంజిమామ్ రికార్డుని సమం చేస్తాడు.

51 సెంచరీలతో అగ్రస్థానంలో సచిన్ టెండూల్కర్

51 సెంచరీలతో అగ్రస్థానంలో సచిన్ టెండూల్కర్

టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాట్స్‌మెన్ జాబితాలో భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 51 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. 24 సెంచరీతో కోహ్లి ప్రస్తుతం 21వ స్థానంలో ఉన్నాడు. ఇక, రాహుల్ ద్రవిడ్‌ (36), సునీల్‌ గవాస్కర్‌ (34)లు కోహ్లీ కన్నా ముందు ఉన్నారు. ఇక సెహ్వాగ్‌ 23 సెంచరీలతో కోహ్లి తర్వాతి స్థానంలో నిలిచాడు. 72 టెస్టుల్లో కోహ్లి 24 సెంచరీలు సాధించగా 103 టెస్టుల్లో సెహ్వాగ్‌ 23 సెంచరీలు పూర్తి చేశాడు.

Story first published: Saturday, October 13, 2018, 17:37 [IST]
Other articles published on Oct 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X