న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒంటి చేత్తో భువీ సూపర్ క్యాచ్.. మ్యాచ్‌ మలుపు (వీడియో)

India Vs West Indies: Bhuvneshwar Kumar turns match with stunning catch

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: బ్యాట్‌తో కెప్టెన్ విరాట్ కోహ్లీ (120; 125 బంతుల్లో 14×4, 1×6), బంతితో పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ (4/31) చెలరేగడంతో వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్‌ 1-0తో బోణీ కొట్టింది. మొదటి వన్డే వర్షంతో రద్దయిన విషయం తెలిసిందే. చివరిదైన మూడో వన్డే ఈ నెల 14న జరగనుంది.

<strong>విండీస్ దిగ్గజం లారా రికార్డులు బద్దలు కొట్టిన క్రిస్ గేల్‌</strong>విండీస్ దిగ్గజం లారా రికార్డులు బద్దలు కొట్టిన క్రిస్ గేల్‌

రెండో వన్డే మ్యాచ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ అద్భుత బౌలింగ్‌తో పాటు ఓ సూపర్ క్యాచ్‌ పట్టాడు. ఇన్నింగ్స్ 35వ ఓవర్‌లో భువీ బౌలింగ్‌కు వచ్చాడు. ఆ ఓవర్ ఐదో బంతిని విండీస్‌ బ్యాట్స్‌మన్‌ ఛేజ్‌ షాట్ ఆడగా.. బంతి బౌలర్ పక్కనుంచి వెళుతుంది. బంతి తనవైపు వస్తుండటాన్ని గమనించిన భువీ.. వెంటనే స్పందించి ఎడమ వైపు డైవ్‌ చేస్తూ ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. దీంతో ఛేజ్‌(18) రిటర్న్‌ క్యాచ్‌తో భువీకి దొరికిపోయాడు. ఛేజ్ నిష్క్రమణతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చింది.

35వ ఓవర్‌ రెండో బంతికి నికోలస్‌ పూరన్‌ 42; 52బంతుల్లో 4×4, 1×6)ని ఔట్‌ చేశాడు. ప్రమాదకరంగా మారుతున్న వీరిద్దరినీ భువీ ఒకే ఓవర్‌లో వెనక్కి పంపి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. అనంతరం 37వ ఓవర్‌లో కీమర్ రోచ్‌ను (0) డకౌట్‌ చేశాడు. అంతకుముందు ఓపెనర్ క్రిస్‌ గేల్‌ (11; 24బంతుల్లో 1×4) ని 10వ ఓవర్‌లో ఎల్బీగా పెవిలియన్ చేర్చి భారత్‌కు శుభారంభం అందించాడు. మ్యాచ్‌లో మొత్తం 8 ఓవర్లు వేసిన భువీ.. 31 పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లు తీసాడు.

ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం విండీస్ లక్ష్యాన్ని 46 ఓవర్లలో 270కి సవరించారు. టార్గెట్ ఛేజింగ్‌కు దిగిన విండీస్ భారత బౌలర్ల ధాటికి 42 ఓవర్లలో 210 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్‌ లూయిస్‌ (65; 80బంతుల్లో 8×4, 1×6), నికోలస్ పూరన్‌ (42; 52బంతుల్లో 4×4, 1×6)లు రాణించారు. భువనేశ్వర్‌ కుమార్‌ (4/31) చెలరేగాడు. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (120; 125 బంతుల్లో 14×4, 1×6) సెంచరీ చేసాడు.

<strong>వన్డేల్లో అత్యధిక పరుగులు.. గంగూలీని అధిగమించిన కోహ్లీ</strong>వన్డేల్లో అత్యధిక పరుగులు.. గంగూలీని అధిగమించిన కోహ్లీ

Story first published: Monday, August 12, 2019, 11:49 [IST]
Other articles published on Aug 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X