న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాజ్‌కోట్ టెస్టు: అలెన్ డొనాల్డ్‌ రికార్డుని బద్దలు కొట్టిన అశ్విన్‌

India vs West Indies: Ashwin goes past Allan Donald on most Test wickets tally

హైదరాబాద్: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనత సాధించాడు. రాజ్‌కోట్ వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన తొలి టెస్టులో అశ్విన్ మెరుగైన ప్రదర్శన చేశాడు. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ అలెన్ డొనాల్డ్‌ను రికార్డుని అశ్విన్ అధిగమించాడు.

<strong>పదేళ్ల క్రితం పృథ్వీ షా నన్ను కలిశాడు: ప్రశంసల వర్షం కురిపించిన సచిన్</strong>పదేళ్ల క్రితం పృథ్వీ షా నన్ను కలిశాడు: ప్రశంసల వర్షం కురిపించిన సచిన్

టెస్టు మ్యాచ్ ఆరంభానికి ముందు అశ్విన్ ఖాతాలో 327 వికెట్లు ఉన్నాయి. వెస్టిండిస్‌తో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు(షాయ్ హోప్(10), రోస్టన్ ఛేజ్(53), లూయిస్(డకౌట్), గాబ్రియేల్(1)) వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కార్లోస్ బ్రాత్ వైట్(10) వికెట్ తీశాడు.

<strong>గంగూలీ-ధోని రికార్డు బద్దలు: కెప్టెన్‌గా కోహ్లీ ఖాతాలో మరో రికార్డు</strong>గంగూలీ-ధోని రికార్డు బద్దలు: కెప్టెన్‌గా కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

దీంతో 63మ్యాచ్‌ల్లో అశ్విన్ వికెట్ల సంఖ్య 332* చేరింది. దీంతో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో అశ్విన్ 24వ స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికాకు చెందిన అలెన్ బోర్డర్ కూడా తన కెరీర్‌లో 72 టెస్టు మ్యాచ్‌ల్లో 330 వికెట్లు తీశాడు. అందులో 20 ఐదు వికెట్ల ప్రదర్శన.. 3 పది వికెట్ల ప్రదర్శన ఉండటం విశేషం.

1
44264
టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు:

టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు:

అనిల్ కుంబ్లే-619 వికెట్లు

కపిల్ దేవ్-434 వికెట్లు

హర్భజన్‌సింగ్-417 వికెట్లు

రవిచంద్రన్ అశ్విన్-332* వికెట్లు

అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు:

అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు:

ముత్తయ్య మురళీధరన్ - 800 వికెట్లు

షేన్ వార్న్ - 708 వికెట్లు

అనిల్ కుంబ్లే - 619 వికెట్లు

రంగనా హెరాత్ - 430 వికెట్లు

హర్భజన్ సింగ్ - 417 వికెట్లు

డానియేల్ వెటోరి - 362 వికెట్లు

రవిచంద్రన్ అశ్విన్-332* వికెట్లు

ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో భారత్ విజయం

ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో భారత్ విజయం

కాగా, రాజ్ కోట్ టెస్టులో టీమిండియా ఏకంగా ఇన్నింగ్స్ 272 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కేవలం రెండన్నర రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టు మ్యాచ్‌లో ముగించడం విశేషం. శనివారం మూడో రోజు ఆటలో భాగంగా ఫాలోఆన్‌ ఆడిన వెస్టిండీస్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 50.5 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌటైంది.

టెస్టు క్రికెట్‌ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయం

టెస్టు క్రికెట్‌ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయం

ఫలితంగా భారత్‌ తన టెస్టు క్రికెట్‌ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే ఇటీవల అప్ఘన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో లభించిన ఇన్నింగ్స్‌ 262 పరుగుల రికార్డును టీమిండియా అధిగమించింది. రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండిస్ ఆటగాళ్లలో కీరన్‌ పావెల్‌(83) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టుకు ఘోర ఓటమి తప్పలేదు.

రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్

రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్

భారత్‌ బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ ఐదు వికెట్లతో విండీస్‌ పతనాన్ని శాసించగా, జడేజా మూడు వికెట్లు సాధించాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌కు రెండు వికెట్లు లభించాయి. అనంతరం వెస్టిండిస్ జట్టుని తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌట్ చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 196 పరుగులకే కుప్పకూల్చింది. ఈ టెస్టులో విరాట్ కోహ్లి (139), పృథ్వీ షా (134), రవీంద్ర జడేజా (100 నాటౌట్) సెంచరీలు సాధించారు.

Story first published: Saturday, October 6, 2018, 17:25 [IST]
Other articles published on Oct 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X