న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

5వ వన్డే: టాస్ గెలిచిన విండిస్, కెప్టెన్ కోహ్లీ రికార్డు మిస్

India Vs West Indies, 5th ODI: Windies win the toss and elect to bat

హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య ఆఖరి వన్డే తిరువనంతపురు వేదకగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండిస్ జట్టు కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ తుది జట్టులో కెప్టెన్ కోహ్లి ఎలాంటి మార్పులు చేయలేదు. నాలుగో వన్డేలో ఆడిన జట్టునే ఈ వన్డేకీ కొనసాగించాడు.

ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ ఓడిపోవడంతో ఓ అరుదైన రికార్డుని మిస్సయ్యాడు. మరోవైపు వెస్టిండిస్ జట్టు ఓ మార్పు చోటు చేసుకుంది. న‌ర్స్ స్థానంలో దేవెంద్ర బిషూ తుది జట్టులోకి రాగా, హెమ్రాజ్‌ స్థానంలో ఒషేన్‌ థామస్‌ను జట్టులోకి తీసుకున్నారు.

టాస్ గెలిచిన వెస్టిండిస్ కెప్టెన్

ఈ సిరీస్‌లో నాలుగు టాస్‌లనూ కోహ్లీయే గెలిచిన సంగతి తెలిసిందే. ఐదో వన్డేలోనూ టాస్ గెలిస్తే సొంతగడ్డపై జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించేవాడు. దీంతో పాటు ఓ సిరీస్‌లో వరుసగా ఐదు టాస్‌లు గెలిచిన నాలుగో భారత కెప్టెన్ అయ్యేవాడు.

 టాస్ ఓటమితో కోహ్లీ రికార్డు మిస్

టాస్ ఓటమితో కోహ్లీ రికార్డు మిస్

గతంలో అజహరుద్దీన్, మహేంద్ర సింగ్ ధోనీ, రాహుల్ ద్రవిడ్‌లు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇక, వెస్టిండిస్‌ జట్టుపై ఇలా వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో టాస్‌లు గెలిచిన కెప్టెన్లలో హ్యాన్సీ క్రోనే(దక్షిణాఫ్రికా), స్టీవ్ వా(ఆస్ట్రేలియా) ఉన్నారు. ఐదు వన్డేల ఈ సిరీస్‌లో ఇప్పటికే నాలుగు వన్డేలు ముగియగా.. భారత్ జట్టు 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది.

తొలి మూడు వన్డేల్లో విండిస్ గట్టి పోటీ

తొలి మూడు వన్డేల్లో విండిస్ గట్టి పోటీ

తొలి మూడు వన్డేల్లోనూ కోహ్లీసేనకు గట్టిపోటీనిచ్చిన వెస్టిండిస్ ముంబై వేదికగా జరిగిన నాలుగో వన్డేలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండిస్ జట్టు 224 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆఖరి వన్డేలో కూడా విజయం సాధించి సిరీస్‌ని 3-1తో చేజిక్కించుకోవాలని కోహ్లీసేన ఉవ్విళ్లూరుతోంది.

చివరి వన్డేలో గెలవాలనే తపనతో విండిస్

చివరి వన్డేలో గెలవాలనే తపనతో విండిస్

మరోవైపు చివరి వన్డేలో గెలిచి సిరీస్‌ని 2-2తో సమం చేయాలని పర్యాటక వెస్టిండీస్ జట్టు కూడా ఆశిస్తోంది. ఈ సిరిస్ విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డే టైగా ముగిసిన సంగతి తెలిసిందే. తిరువనంతపురంలో వాతావరణం మ్యాచ్‌కు కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాతావరణం మేఘావృతం కావడంతో ఏ క్షణమైనా వర్షం పడే అవకాశం ఉంది.

జట్ల వివరాలు:
భారత్ జట్టు:

రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, అంబటి రాయుడు, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, జస్‌ప్రీత్ బుమ్రా

వెస్టిండిస్ జట్టు:
జాసన్‌ హోల్డర్(కెప్టెన్‌), కీరన్‌ పావెల్‌, సాయ్‌ హోప్‌, మార్లోన్‌ శామ్యూల్స్‌, హెట్‌మెయిర్‌, రోవ్‌మాన్‌ పావెల్‌, ఫాబియన్‌ అలెన్‌, బిషూ, కీమో పాల్‌, రోచ్‌, థామస్‌

1
44270
Story first published: Thursday, November 1, 2018, 13:56 [IST]
Other articles published on Nov 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X