న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రనౌట్లే మా కొంపముంచాయి: హోల్డర్

India Vs West Indies 2018, 4th ODI : Holder Says We allowed India to score too Many Runs
India vs West Indies, 4th ODI: We allowed India to score too many runs: Jason Holder

హైదరాబాద్: భారత్‌తో జరిగిన నాలుగో వన్డేలో వెస్టిండీస్ ఓటమికి కారణం రనౌట్సేనని ఆ జట్టు కెప్టెన్ జేసన్ హోల్డర్ ఆవేదన వ్యక్తం చేశాడు. భారత్‌తో ముంబైలోని బ్రబౌర్న్ వేదికగా సోమవారం రాత్రి ముగిసిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ భారత్ జట్టు బ్యాటింగ్ చేసింది. టీమిండియా నిర్దేశించిన భారీ టార్గెట్‌ను చేధించలేని వెస్టిండీస్ చేతులెత్తేసింది.

ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ శర్మ (162: 137 బంతుల్లో 20ఫోర్లు, 4సిక్సులు), మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు (100: 81 బంతుల్లో 8ఫోర్లు, 4సిక్సులు) సెంచరీలు సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు చేసింది.

1
44269
36.2 ఓవర్లలో 153 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్

36.2 ఓవర్లలో 153 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ జట్టు 36.2 ఓవర్లలో 153 పరుగులకే పేలవరీతిలో కుప్పకూలిపోయింది. ఛేదన ఆరంభంలోనే ఓపెనర్ కీరన్ పొవెల్ (4), షై హోప్ (0) రనౌట్ రూపంలో వెనుదిరగడం జట్టుని దారుణంగా దెబ్బతీసిందని హోల్డర్ చెప్పుకొచ్చాడు.

377/5 భారీ స్కోరును చేసిన టీమిండియా

377/5 భారీ స్కోరును చేసిన టీమిండియా

‘వన్డే, టీ20ల్లో రనౌట్స్‌ జట్టుపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. ఛేదన ఆరంభంలోనే వరుసగా ఇద్దరు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రనౌటవడంతో జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో మిగిలిన ఆటగాళ్లు కూడా సరిగా బ్యాటింగ్ చేయలేకపోయారు. కనీసం ఇద్దరు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మెరుగ్గా ఆడగలిగిందంటే..? ఛేదనలో భారత్‌కి పోటీనిచ్చేవాళ్లం.'

వరుస రనౌట్లు కారణంగా..

వరుస రనౌట్లు కారణంగా..

'బౌలింగ్ సమయంలోనూ మా బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చేశారు. మరోవైపు ఛేదనలో వరుస రనౌట్లు కారణంగా.. ఆఖరి వరకూ కనీసం ఒక్కటి కూడా మెరుగైన భాగస్వామ్యాన్ని నమోదు చేయలేకపోయాం' అని హోల్డర్ వెల్లడించాడు.

ఆఖరి వన్డేను గురువారం భారత్

ఆఖరి వన్డేను గురువారం భారత్

సిరీస్‌లో భాగంగా ఆఖరి వన్డేను గురువారం భారత్, వెస్టిండీస్ మధ్య తిరువనంతపురం వేదికగా జరగనుంది. ప్రస్తుతం జరిగిన నాలుగు మ్యాచ్‌లలో రెండింటిలో భారత్ గెలుపొందింది. ఒక దాన్లో ఓడిపోయింది. మరొక మ్యాచ్‌ను ఇరు జట్లు టైగా ముగించాయి.

Story first published: Tuesday, October 30, 2018, 13:31 [IST]
Other articles published on Oct 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X