న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబైలో 4వ వన్డే: 21వ సెంచరీ చేసిన రోహిత్ శర్మ

India Vs West Indies 2018, 4th ODI : Rohit Sharma Hits 21st Century
India vs West Indies, 4th ODI in Mumbai: Rohit Sharma hits ton, hosts take control

హైదరాబాద్: ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో వెస్టిండిస్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 98 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 21వ సెంచరీ కావడం విశేషం.

<strong>పేలవరీతిలో ధావన్ ఔట్: తొడగొట్టిన బౌలర్, ట్విట్టర్‌లో విమర్శలు</strong>పేలవరీతిలో ధావన్ ఔట్: తొడగొట్టిన బౌలర్, ట్విట్టర్‌లో విమర్శలు

ఈ సిరీస్‌లో అతడికిది రెండో శతకం కావడం గమనార్హం. గువాహటిలో జరిగిన తొలి వన్డేలో అతడు 150 పరుగులతో అజేయంగా నిలిచాడు. రోహిత్ శర్మ ఇలాగే చెలరేగి ఆడితే మరో డబుల్ సెంచరీ అతడి ఖాతాలో పడటం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

1
44269

పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా రోహిత్ శర్మ బ్యాటింగ్

ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కరీబియన్ బౌలర్ల వైవిధ్యమైన బౌలింగ్‌ను ధాటిగా ఎదుర్కొని జట్టుకు భారీ స్కోరు అందిస్తున్నాడు. ఆరంభంలో ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

16 పరుగులే చేసి వెనుదిరిగిన విరాట్ కోహ్లీ

16 పరుగులే చేసి వెనుదిరిగిన విరాట్ కోహ్లీ

12వ ఓవర్లో ధావన్ ఔటవడంతో విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. గత మూడు మ్యాచ్‌ల్లో సెంచరీలతో చెలరేగిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో 16 పరుగులే చేసి వెనుదిరిగాడు. కీమర్ రోచ్ బౌలింగ్‌లో అనవసర షాట్ ఆడి ఔటయ్యాడు. రోచ్‌ వేసిన 16.4వ బంతిని ఆడబోయి వికెట్ కీప‌ర్ షెయ్‌ హోప్‌ చేతికి చిక్కాడు.

అంబటి రాయుడు హాఫ్ సెంచరీ

దీంతో రోహిత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. మరోవైపు అంబటి రాయుడు సైతం వన్డేల్లో 10వ హాఫ్ సెంచరీని సాధించాడు. అంబటి రాయుడుతో కలిసి 188కు పైగా పరుగులు భాగస్వామ్యం నెలకొల్పాడు. ప్రస్తుతం 42 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి భారత్ 289 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ (148), అంబటి రాయుడు(77) పరుగులతో ఉన్నారు.

2018లో వన్డేల్లో కోహ్లీకి ఇదే అత్యల్ప స్కోరు

2018లో వన్డేల్లో కోహ్లీకి ఇదే అత్యల్ప స్కోరు

2018లో వన్డేల్లో కోహ్లీకి ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. పుణె వన్డేలో సెంచరీ సాధించడంతో వన్డేల్లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన తొలి భారత క్రికెటర్‌ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. వన్డే క్రికెట్‌ చరిత్రలో శ్రీలంక మాజీ క్రికెట‌ర్‌ కుమార సంగక్కర మాత్రమే వరుసగా నాలుగు వన్డేల్లో సెంచరీ అందుకున్నాడు.

Story first published: Monday, October 29, 2018, 16:50 [IST]
Other articles published on Oct 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X