న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మూడో టీ20: మార్పులతో బరిలోకి టీమిండియా.. తుది జట్టు ఇదేనా?!!

India vs West Indies 3rd T20I, Predicted XI

ముంబై: తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించగా.. రెండో టీ20లో విండీస్‌ గెలిచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీంతో బుధవారం టీమిండియా మరో కీలక సమరానికి సిద్ధమైంది. సిరీస్‌ దక్కాలంటే తప్పక గెలవాల్సిన టీ20లో హిట్టర్లతో నిండిన విండీస్‌తో తలపడనుంది. మూడో టీ20 శక్తి మేర పోరాడి సిరీస్‌ చేజిక్కుంచుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. మరి వాంఖడేలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుందో ఓసారి పరిశీలిస్తే.

పాక్‌ క్రికెటర్‌పై నెటిజన్ల ఆగ్రహం.. ఇక జట్టులోకి తీసుకోకూడదంటూ కామెంట్లు!!పాక్‌ క్రికెటర్‌పై నెటిజన్ల ఆగ్రహం.. ఇక జట్టులోకి తీసుకోకూడదంటూ కామెంట్లు!!

 కోహ్లీ మరోసారి రెచ్చిపోతే:

కోహ్లీ మరోసారి రెచ్చిపోతే:

'హిట్‌మ్యాన్' ఓపెనర్ రోహిత్ శర్మ రెండు మ్యాచ్‌లలో 8, 15 పరుగులు చేసి విఫలమైనా.. జట్టును ముందుండి నడిపించగలడు. తనదైన రోజున రెచ్చిపోగలడు. మరో ఓపెనర్ లోకేశ్ రాహుల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. టీ20 ఫార్మాట్‌లో క్లాస్ ప్లేయర్‌గా గుర్తింపు ఉన్న రాహుల్.. ఆరంభంలో బాగా ఆడితే టీమిండియా భారీ పరుగులు చేసే అవకాశం ఉంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి రెచ్చిపోతే తిరుగుండదు.

శాంసన్‌కు మరోసారి నిరాశే?:

శాంసన్‌కు మరోసారి నిరాశే?:

రెండు మ్యాచ్‌లలో పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాని శ్రేయాస్ అయ్యర్ నాలుగో స్థానంలో కీలక ఆటగాడు. వరుసగా విఫలమవుతున్న కీపర్ రిషబ్ పంత్‌కు కోహ్లీ మద్దతుగా ఉన్నాడు. దీంతో సంజు శాంసన్‌కు మరోసారి నిరాశే ఎదురుకావొచ్చు. సంజు ఏ స్థానంలోనైనా ఆడగలడు. కాబట్టి అతడిని శ్రేయస్‌ స్థానంలో ఆడించొచ్చు. అయితే నాలుగో స్థానానికి శ్రేయస్‌ పరిష్కారమని భావిస్తున్న తరుణంలో కోహ్లీ ఈ సాహసం చేసే అవకాశం దాదాపు ఉండదు.

దీపక్‌ స్థానంలో షమీ?:

దీపక్‌ స్థానంలో షమీ?:

రెండో టీ20లో అర్ధ శతకం అందుకున్న ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబె నుంచి జట్టు అదే ప్రదర్శన కోరుకుంటోంది. మరో ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా జట్టులో ఉంటాడు. భువనేశ్వర్ కుమార్ త్వరగా లయ అందుకోవాలి. భారీగా పరుగులు ఇస్తున్న దీపక్‌ చాహర్‌ స్థానంలో మొహమ్మద్ షమీని తీసుకునే అవకాశం ఉంది. వాషింగ్టన్‌ సుందర్‌ పవర్‌ప్లేలో పరుగులను నియంత్రిస్తున్నా.. వికెట్లు తీయకపోవడం ఆందోళనకరం. సుందర్‌ బదులు కుల్‌దీప్‌ను పరీక్షించినా ఆశ్చర్యం లేదు. యుజువేంద్ర చహల్ కీలక స్పిన్నర్ అన్న విషయం తెలిసిందే.

భారత జట్టు (అంచనా):

భారత జట్టు (అంచనా):

రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్‌, శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, దీపక్‌ చాహర్‌/మొహమ్మద్ షమీ, వాషింగ్టన్‌ సుందర్‌/ కుల్‌దీప్‌ యాదవ్, యుజువేంద్ర చహల్.

Story first published: Tuesday, December 10, 2019, 16:24 [IST]
Other articles published on Dec 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X