న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ్యాచ్‌కే హైలైట్‌.. విండీస్‌ ప్లేయర్ ఫీల్డింగ్‌ విన్యాసం (వీడియో)!!

India vs West Indies 3rd T20 : Evin Lewis Unbelievable Effort To Deny A Six For Rohit Sharma
India vs West Indies 3rd T20I: Evin Lewis’ unbelievable effort denies Rohit Sharma of six against Kharry Pierre in Mumbai

ముంబై: బుధవారం వాంఖెడే మైదానంలో జరిగిన చివరి టీ20లో భారత్‌ 67 పరుగుల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్‌ (56 బంతుల్లో 91; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), రోహిత్‌ శర్మ (34 బంతుల్లో 71; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు)లకు తోడు కెప్టెన్ విరాట్ కోహ్లీ (29 బంతుల్లో 70 నాటౌట్‌; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) రెచ్చిపోవడంతో భారత్ టీ20 ప్రపంచ చాంపియన్‌ వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించింది.

'పృథ్వీషా' డబుల్‌ సెంచరీ.. వినయ్‌ కుమార్‌ ఖాతాలో 400 వికెట్లు!!'పృథ్వీషా' డబుల్‌ సెంచరీ.. వినయ్‌ కుమార్‌ ఖాతాలో 400 వికెట్లు!!

 మ్యాచ్‌కే హైలైట్‌:

మ్యాచ్‌కే హైలైట్‌:

ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్‌ సిక్సర్ల మోత మోగించి అభిమానులను అలరించారు. అయితే బ్యాట్స్‌మన్‌లు కొట్టిన సిక్సర్ల కంటే.. విండీస్‌ ఫీల్డర్‌ ఎవిన్‌ లెవిస్‌ చేసిన ఓ ఫీల్డింగ్‌ విన్యాసం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. అప్పటికే భారత్‌ ఓపెనర్‌ 'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మ సిక్సర్ల మోత ప్రారంభించాడు. ఐదవ ఓవర్ వేస్తున్న పెర్రీ బౌలింగ్‌లో తొలి బంతికే రోహిత్ ఓ సిక్స్ బాదాడు. రెండో బంతిని కూడా లెగ్ సైడ్ బలంగా బాదాడు.

లెవిస్‌ ఫీల్డింగ్‌ విన్యాసం:

లెవిస్‌ ఫీల్డింగ్‌ విన్యాసం:

బౌండరీ లైన్‌ దగ్గర ఉన్న ఫీల్డర్‌ ఎవిన్‌ లెవిస్‌ సిక్సర్‌ వెళ్లే బంతిని అద్భుతంగా పట్టుకున్నాడు. అయితే తన బ్యాలెన్స్‌ అదుపు చేసుకోలేక బంతిని మైదానంలో విసిరి బౌండరీ అవతలికి జంప్‌ చేశాడు. అంతేకాదు ఆ పక్కనే ఉండే మరో బౌండరీ అవతలికి జంప్ చేసి తిరిగి వచ్చి బంతిని కీపర్ వైపు విసిరాడు. ఈలోగా రోహిత్ రెండు పరుగులు తీసాడు. లెవిస్ నాలుగు పరుగులు సేవ్ చేసాడు. సహచర ఆటగాళ్లు లెవిస్‌ను అభినందించారు. ఈ స్టన్నింగ్స్‌ ఫీట్‌ మ్యాచ్‌కే హైలైట్‌ నిలిచింది.

వాట్‌ ఏ ఫీల్డింగ్‌:

వాట్‌ ఏ ఫీల్డింగ్‌:

ప్రస్తుతం ఎవిన్‌ లెవిస్‌ ఫీల్డింగ్‌ విన్యాసం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ లైకులు కొడుతున్నారు. అంతేకాదు లెవిస్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'వాహ్‌.. వాట్‌ ఏ ఫీల్డింగ్‌' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'లెవిస్‌ ఫీల్డింగ్‌ సూపర్' అని మరో అభిమాని కామెంట్ పెట్టాడు. అయితే క్యాచ్ పట్టే సమయంలో లెవిస్‌కు గాయం కావడంతో బ్యాటింగ్‌కు రాలేదు.

పొలార్డ్‌ ఒంటరి పోరాటం:

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 240 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసి ఓటమిపాలయింది. కెప్టెన్ పొలార్డ్‌ (39 బంతుల్లో 68; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో దీపక్‌ చాహర్, భువనేశ్వర్, మొహమ్మద్ షమీ, కుల్దీప్‌ యాదవ్ తలా 2 వికెట్లు తీశారు. రాహుల్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌', కోహ్లీకి 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌' అవార్డులు దక్కాయి.

Story first published: Thursday, December 12, 2019, 10:37 [IST]
Other articles published on Dec 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X