న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్‌, కోహ్లీ విధ్వంసం సృష్టించాలనే బరిలోకి దిగారు: రాహుల్

India vs West Indies 3rd T20: Learning lesson for us before T20 World Cup says KL Rahul

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసం సృష్టించాలనే ఉద్దేశంతో బరిలోకి దిగారు అని ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ తెలిపాడు. టీ20 ప్రపంచకప్‌ ముందు మాకు ప్రతి మ్యాచ్‌ ఎంతో కీలకం. వాటి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు అని అన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌ నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రాహుల్‌ (91, 56 బంతుల్లో; 9×4, 4×6) తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రాహుల్‌ను 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్' అవార్డు వరించింది.

<strong>అంపైరింగ్‌లో అలీమ్‌ దార్‌ అరుదైన ఘనత.. స్టీవ్‌ బక్నర్‌ రికార్డు బద్దలు!!</strong>అంపైరింగ్‌లో అలీమ్‌ దార్‌ అరుదైన ఘనత.. స్టీవ్‌ బక్నర్‌ రికార్డు బద్దలు!!

విధ్వంసం సృష్టించాలనే:

విధ్వంసం సృష్టించాలనే:

ప్రెజెంటేషన్‌ సమయంలో రాహుల్‌ మాట్లాడుతూ... 'సిరీస్‌ను గెలిచినందుకు ఎంతో సంతోషంగా ఉంది. పక్కా ప్రణాళికతో బరిలోకి దిగాం. అంతా సవ్యంగా సాగింది. భారీ భాగస్వామ్యాలు నెలకొల్పాలని అనుకున్నాం. రోహిత్‌, కోహ్లీ విధ్వంసం సృష్టించాలనే ఉద్దేశంతో బరిలోకి దిగారు. రోహిత్ ఆరంభిస్తే.. కోహ్లీ ముగించాడు. వారిని నా వంతు సహాయం చేశా. సెంచరీ గురించి ఆలోచించలేదు. జట్టు ప్రయోజనాలే ముఖ్యం' అని అన్నాడు.

ప్రతి మ్యాచ్‌ ఎంతో కీలకం:

ప్రతి మ్యాచ్‌ ఎంతో కీలకం:

'వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ ఉంది. ఇక ప్రతి మ్యాచ్‌ ఎంతో కీలకమైనది. వాటి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. మొదటగా బ్యాటింగ్‌ చేసి విజయాలు సాధించిన రికార్డులు తక్కువగా ఉన్నాయి. ఈ రోజు మంచి అవకాశం లభించింది. ఈ మ్యాచ్‌తో మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. తొలుత బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా ఆడాలో అర్థమైంది' అని రాహుల్‌ తెలిపాడు.

నా వంతు నేను కృషి చేస్తా:

నా వంతు నేను కృషి చేస్తా:

'క్రీజులో కుదురుకున్నాక ఏ ఫార్మాట్‌లోనైనా బ్యాటును ఝుళిపించవచ్చు. సరైన షాట్ సెలక్షన్ కూడా అవసరం. క్రీజులో ఎక్కువ సమయం గడిపితే పరుగులు చేయోచ్చు. జట్టు విజయం సాధించడంలో నా వంతు నేను కృషి చేస్తాను. ఈ రోజు అదే చేశా' అని రాహుల్‌ చెప్పుకొచ్చాడు. రాహుల్‌సెంచరీ చేస్తదనుకున్నా.. కాట్రెల్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌కు చేరాడు.

భారత్ విజయం:

మూడో టీ20లో వెస్టిండీస్‌పై భారత్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 240 పరుగుల భారీ స్కోరు చేసింది. రోహిత్‌ (71), కోహ్లీ (70) రాణించాడు. లక్ష్య ఛేదనలో వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసింది. కెప్టెన్ పొలార్డ్‌ (39 బంతుల్లో 68; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో దీపక్‌ చాహర్, భువనేశ్వర్, మొహమ్మద్ షమీ, కుల్దీప్‌ యాదవ్ తలా 2 వికెట్లు తీశారు.

Story first published: Thursday, December 12, 2019, 15:12 [IST]
Other articles published on Dec 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X