న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ మరో 26 పరుగులు చేస్తే యువరాజ్‌ రికార్డు బద్దలు

India vs West Indies, 3rd ODI: Rohit Sharma looks to surpass Yuvraj Singh Runs Record

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్: ఇటీవలే ముగిసిన ప్రపంచకప్‌లో పరుగుల సునామీ సృష్టించిన టీమిండియా వైస్‌కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్‌ శర్మ భారత మాజీ ఆటగాడు 'సిక్సర్ల వీరుడు' యువరాజ్‌ సింగ్‌ రికార్డుపై కన్నేశాడు. భారత్ తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా యువరాజ్‌ ప్రస్తుతం ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఎనిమిదవ స్థానంలో ఉన్న రోహిత్‌ శర్మ మరో 26 పరుగులు చేస్తే యువరాజ్‌ను అధిగమించనున్నాడు.

<strong>ద్రవిడ్‌కు విరుద్ధ ప్రయోజనాలు లేవు.. ఎన్‌సీఏ డైరెక్టర్‌గా మార్గం సుగమం</strong>ద్రవిడ్‌కు విరుద్ధ ప్రయోజనాలు లేవు.. ఎన్‌సీఏ డైరెక్టర్‌గా మార్గం సుగమం

26 పరుగులు చేస్తే:

26 పరుగులు చేస్తే:

యువరాజ్ 304 వన్డేల్లో 8701 పరుగులు చేసి ఏడవ స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 217 మ్యాచుల్లో 8676 పరుగులు చేశాడు. ఈ రోజు భారత్‌, వెస్టిండీస్ మధ్య జరిగే మూడో వన్డేలో రోహిత్ 26 పరుగులు చేస్తే యువరాజ్‌ను వెనక్కినెట్టనున్నాడు. భారత్‌ తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మాజీ దిగ్గజం సచిన్‌ టెందుల్కర్‌ (18426) మొదటి స్థానంలో ఉన్నాడు. సచిన్ భారత్‌ తరపునే కాకుండా ప్రపంచంలోనే అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు.

త్వరలోనే 10000 పరుగుల మైలురాయి:

త్వరలోనే 10000 పరుగుల మైలురాయి:

అత్యధిక పరుగుల జాబితాలో కెప్టెన్ విరాట్ కోహ్లీ (11406) తాజాగా మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీని వెనక్కి నెట్టి రెండవ స్థానంకు చేరుకున్నాడు. సౌరభ్‌ గంగూలీ (11363), రాహుల్‌ ద్రవిడ్‌ (10889), ఎంఎస్ ధోనీ (10773), మహ్మద్‌ అజారుద్దీన్‌ (9378), యువరాజ్‌ సింగ్ (8701), రోహిత్‌ శర్మ (8676)లు వరుసగా ఉన్నారు. రోహిత్ ప్రస్తుత ఫామ్ చూస్తే.. త్వరలోనే 10000 పరుగుల మైలురాయిని చేరుకోనున్నాడు. రోహిత్ 10000 పరుగులు చేస్తే.. మాజీ కెప్టెన్ మహ్మద్‌ అజారుద్దీన్‌ కూడా అధిగమిస్తాడు.

సంగక్కర రికార్డు బద్దలు:

సంగక్కర రికార్డు బద్దలు:

ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 93 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సులతో సెంచరీ సాధించాడు. దీంతో ఒక ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. నాలుగు సెంచరీలతో ఈ జాబితాలో ఉన్న శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర రికార్డును రోహిత్ బద్దలుకొట్టాడు. 2015 ప్రపంచకప్‌‌లో సంగక్కర నాలుగు సెంచరీలు సాధించాడు.

వెస్టిండీస్‌తో మూడో వన్డే.. సిరీస్‌పై భారత్‌ గురి

రెండో వన్డేలో విఫలం:

రెండో వన్డేలో విఫలం:

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో బుధవారం విండీస్‌తో భారత్‌ చివరి వన్డేలో తలపడనుంది. తొలి వన్డే వర్షార్పరణం కాగా.. రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. రెండో వన్డేలో రోహిత్ 34 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసాడు. ఈ మ్యాచ్‌లో సత్తాచాటి టెస్టు తుది జట్టులో స్థానం దక్కించుకోవాలని రోహిత్ భావిస్తున్నాడు. టీ20 సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే.

Story first published: Wednesday, August 14, 2019, 10:38 [IST]
Other articles published on Aug 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X