
ఒత్తిడిలో ధావన్:
ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ పర్యటనలో పూర్తిగా విఫలమయ్యాడు. టీ20 సిరీస్‌లో 1, 23, 3 పరుగులు చేసిన ధావన్.. రెండో వన్డేలో కేవలం 2 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇప్పటికైనా ధావన్ ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఉంది. మరో ఓపెనర్ రోహిత్ శర్మ కూడా ఆశించినంత ఆడట్లేదు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ కలిసొచ్చే అంశం. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతున్న రిషబ్ పంత్ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని శ్రేయస్ అయ్యర్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. సునీల్ గావస్కర్ కూడా నాలుగో స్థానంలో అయ్యర్ ఆడించాలని సూచించాడు. ఈ నేపథ్యంలో ఆఖరి వన్డే లైనప్ ఎలా ఉంటున్నది ఆసక్తికరంగా మారింది. ఆరో స్థానంలో వచ్చే జాదవ్‌కూ ఈ మ్యాచ్ కీలకమే.

జోరులో భువనేశ్వర్:
బౌలింగ్‌లో కూడా భారత్ బలంగా ఉంది. పేస్ త్రయం భువనేశ్వర్ కుమార్, మొహ్మద్ షమీ, ఖలీల్ అహ్మద్‌లతో భారత బౌలింగ్ పటిష్టంగా ఉంది. స్పిన్నర్లు జడేజా, కుల్దీప్‌లు కూడా రాణిస్తున్నారు. భువనేశ్వర్ గత మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన మ్యాచ్‌ను శాసించాడు. భువీ అదే జోరును కొనసాగిస్తే.. విండీస్‌కు కష్టాలు తప్పవు. నవదీప్ సైనీకి అవకాశం దక్కకపోవచ్చు. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టులో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు.

గేల్‌కు చివరిదా:
చివరి మ్యాచ్‌లోనైనా విండీస్ బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించాల్సిన అవసరముంది. వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అవుతానని ప్రకటించిన గేల్‌కు ఇదే చివరి మ్యాచ్. వరసగా విఫలమవుతున్న అతను ఆఖరి మ్యాచ్‌లో ఎలా ఆడతాడో చూడాలి. లూయిస్ ఫామ్ వెస్టిండీస్‌కు ఊరట. షై హోప్, షిమ్రాన్ హెట్‌మయర్, నికోలస్ పూరన్ వంటి బ్యాట్స్‌మెన్ సత్తా మేర ఆడాలని విండీస్ ఆశిస్తోంది. ఇక లోయరార్డర్‌లో కెప్టెన్ హోల్డర్, బ్రాత్‌వైట్ బ్యాట్ ఝళిపిప్తే.. గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు. రోచ్, కాట్రెల్, థామస్‌ల పేస్ త్రయం బాగానే రాణిస్తోంది.

పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు అంతగా సహకరించని ట్రినిడాడ్ పిచ్‌పైనే ఈ మ్యాచ్ జరగనుంది. వాతావరణం బాగా ఉక్కపోతగా ఉన్నా.. జల్లులతో కూడిన వాన కురిసే అవకాశం ఉంది. ఇక్క జరిగిన గత ఆరు వన్డేల్లో ఐదుసార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టే విజయం సాధించింది. కానీ.. వర్షం వచ్చే అవకాశమున్నందున్న టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగే ఎంచుకోవచ్చు.
తుది జట్లు (అంచనా):
భారత్: ధావన్, రోహిత్, కోహ్లీ (కెప్టెన్), అయ్యర్, పంత్, జాదవ్, జడేజా, భువనేశ్వర్, కుల్దీప్, షమీ, ఖలీల్.
వెస్టిండీస్: గేల్, లూయిస్/క్యాంప్‌బెల్, హోప్, హెట్‌మైర్, పూరన్, చేజ్, హోల్డర్, బ్రాత్‌వైట్, రోచ్, కాట్రెల్, థామస్.


Click it and Unblock the Notifications












