న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిక్సర్లతో విరుచుకుపడ్డ పొలార్డ్.. టీమిండియా లక్ష్యం 316!!

India vs West Indies, 3rd ODI: Nicholas Pooran, Kieron Pollard set India 316 for series win

కటక్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బారాబతి స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో విండీస్ భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ కీరన్ పొలార్డ్‌ (74) సిక్సర్లతో విరుచుకుపడడంతో.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసింది. దీంతో కోహ్లీ సేన ఎదుట 316 పరుగుల భారీ లక్ష్యం ఉంది. పొలార్డ్‌కు తోడు నికోలస్ పూరన్ (89) చెలరేగాడు. భారత బౌలర్లలో జడేజా, షమీ, ఠాకూర్ తలో వికెట్ తీయగా.. సైనీ రెండు వికెట్లు సాధించాడు.

<strong>సౌరవ్ గంగూలీకి 'ఛాలెంజ్' విసిరిన మిథాలీ రాజ్!!</strong>సౌరవ్ గంగూలీకి 'ఛాలెంజ్' విసిరిన మిథాలీ రాజ్!!

57 పరుగుల భాగస్వామ్యం:

57 పరుగుల భాగస్వామ్యం:

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ ఇన్నింగ్స్ ఆరంభంలో నెమ్మదిగా ఆడింది. ఓపెనర్లు షాయ్‌ హోప్, ఎవిన్‌ లూయిస్‌ ఆచితూచి ఆడారు. భారత బౌలర్లను ఎదుర్కొంటూ 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జడేజా బౌలింగ్‌లో లూయిస్‌ మొదటి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. లూయిస్‌ 50 బంతుల్లో మూడు బౌండరీలతో 21 పరుగులు సాధించాడు. ఆ తర్వాత 70 పరుగుల వద్ద మరో ఓపెనర్ షాయ్ హోప్ (42) ఔట్ అయ్యాడు.

ఆశలు రేకెత్తించిన సైనీ:

ఆశలు రేకెత్తించిన సైనీ:

ఈ క్రమంలో రోస్టన్ చేజ్ (38), షిమ్రన్ హెట్మెయిర్ (37)లు జట్టును ఆదుకున్నారు. చేజ్ స్ట్రైక్ రొటేట్ చేయగా.. హెట్‌మయెర్‌ రెచ్చిపోయాడు. అయితే క్రీజులో కుదురుకున్న ఈ జోడీని నవ్‌దీప్ సైనీ వెంటవెంటనే పెవిలియన్ పంపి భారత శిబిరంలో కాస్త ఆశలు రేకెత్తించాడు. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. క్రీజులో కుదురుకున్న పూరన్, పొలార్డ్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.

 పూరన్ హాఫ్ సెంచరీ:

పూరన్ హాఫ్ సెంచరీ:

అర్ధ సెంచరీ వరకు నిదానంగా ఆడిన పూరన్.. ఆ తర్వాత గేర్ మార్చాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో పూరన్ 44 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసాడు. ఆపై రెచ్చిపోయి 64 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు చేసాడు. అయితే శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడి జడేజాకు చిక్కాడు.

సిక్సర్లతో విరుచుకుపడ్డ పొలార్డ్:

సిక్సర్లతో విరుచుకుపడ్డ పొలార్డ్:

పూరన్ ఔట్ అయ్యేవరకు నెమ్మదిగా ఆడిన పొలార్డ్.. ఆ తర్వాత భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. అతడి దెబ్బకు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఒకానొక దశలో 250 మార్క్ కూడా దాటదనుకున్న విండీస్ స్కోరు 300 దాటింది. 51 బంతులు ఆడిన పొలార్డ్ 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. భారత ఫీల్డర్ల వైఫల్యం కూడా వారికి కలిసొచ్చింది.

Story first published: Sunday, December 22, 2019, 18:09 [IST]
Other articles published on Dec 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X