న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇండియా vs వెస్టిండీస్: రెండో టెస్టుకు జట్టు ఇదే.. అశ్విన్‌కు చోటెక్కడిది?

India vs West Indies, 2nd Test: Probable XI of India: Can Ashwin win back place in the eleven?

కింగ్‌స్టన్: రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సబీనా పార్క్ వేదికగా శుక్రవారం నుంచి భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఆంటిగ్వాలో జరిగిన మొదటి టెస్టును 319 పరుగుల భారీ తేడాతో గెలిచిన భారత్ రెండో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఆతిధ్య విండీస్ ఈ మ్యాచ్ అయినా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది.

రికార్డు రాజు 'మిగెల్‌ కమిన్స్‌'కు నిరాశ.. విండీస్ జట్టులోకి కీమో పాల్రికార్డు రాజు 'మిగెల్‌ కమిన్స్‌'కు నిరాశ.. విండీస్ జట్టులోకి కీమో పాల్

విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి:

విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి:

అయితే రెండో టెస్టుకు విన్నింగ్ కాంబినేషన్‌తో భారత్ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా మరో అవకాశం లభించవచ్చు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పుజారా పరుగులు చేయలేకపోయినా.. టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా జట్టులో ఉంటాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ గురించి చెప్పనవసరం లేదు. ఇక రోహిత్ శర్మను కాదని తీసుకున్న అంజిక్య రహానే విజయాన్ని సాధించి పెట్టాడు. హనుమ విహారి కూడా తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. వీరందరూ రెండో టెస్టులో కొనసాగడం ఖాయం.

మరిన్ని అవకాశాలు:

మరిన్ని అవకాశాలు:

వికెట్ కీపర్ పంత్ విఫలమయినా.. ధోనీ వారసుడిగా అతనికి మరిన్ని అవకాశాలు ఇచ్చే సూచలు ఉన్నాయి. సీనియర్ కీపర్ సాహాకు మళ్లీ నిరాశే ఎదురవ్వొచ్చు. ఇక సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తొలి టెస్టులో లేకపోవడం చాలా ప్రశ్నలను లేవనెత్తింది. కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీలు విమర్శల వర్షం కురిపించారు. అశ్విన్ స్థానంలో జట్టులోకి వచ్చిన రవీంద్ర జడేజా సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో అర్ధ సెంచరీ చేయడం.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీయడంతో జడేజా కొనసాగే అవకాశం ఉంది.

అనూహ్య నిర్ణయం తీసుకుంటే తప్ప:

అనూహ్య నిర్ణయం తీసుకుంటే తప్ప:

ఇక పేస్ త్రయం జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, ఇషాంత్ శర్మలు అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో విండీస్ బ్యాట్స్‌మన్‌ను బెంబేలెత్తించాడు. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత స్పెల్‌తో ( 5/7) విండీస్ ఇన్నింగ్స్‌ను కకాలవికాలం చేసాడు. దీంతో ఈ త్రయం కొనసాగనున్నారు. ఇక అశ్విన్‌కు చోటు దక్కే అవకాశమే లేదు. ఒకవేళ విమర్శల నేపథ్యంలో కాప్టెన్ కోహ్లీ ఏదైనా అనూహ్య నిర్ణయం తీసుకుంటే తప్ప అశ్విన్‌ జట్టులోకి రాలేడు.

జట్టు (అంచనా):

మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, చెటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, హనుమ విహారి, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ.

Story first published: Thursday, August 29, 2019, 13:30 [IST]
Other articles published on Aug 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X