న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హైదరాబాద్ టెస్ట్: పృథ్వీ షా ఖాతాలో మరో అరుదైన రికార్డు

India vs West Indies, 2nd Test: Prithvi Shaw steals the show again with scintillating 70

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో వెస్టిండిస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా మరో అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో పృథ్వీ షా హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా టెస్టుల్లో తొలి రెండు ఇన్నింగ్స్‌లో యాభై, అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన ఎనిమిదో భారత ఆటగాడిగా షా గుర్తింపు పొందాడు.

<strong>శిఖరాన్ని అధిరోహించి... అకస్మాత్తుగా అగాథంలోకి పడిపోయా: యువీ</strong>శిఖరాన్ని అధిరోహించి... అకస్మాత్తుగా అగాథంలోకి పడిపోయా: యువీ

ఈ జాబితాలో ఇప్పటి వరకూ భారత్‌ తరఫున దిల్వార్‌ హుస్సేన్‌, క్రిపాల్‌ సింగ్‌, సునీల్‌ గావస‍్కర్‌, సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌, సురేశ్‌ రైనా, రోహిత్‌ శర్మలు ఉండగా ఇప‍్పుడు వారి సరసన పృథ్వీ షా చేరాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పృథ్వీ షా 39 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో లంచ్ విరామానికి ముందు హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు.

1
44265
హెట్‌మెయిర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌‌కు

హెట్‌మెయిర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌‌కు

అయితే, ఈ మ్యాచ్‌లో 70 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విండిస్ బౌలర్ వారికన్‌ వేసిన బంతిని పృథ్వీ షా... హెట్‌మెయిర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత 19.6 ఓవర్‌లో గాబ్రియల్ వేసిన బంతిని పుజారా(10; 50 బంతుల్లో, 2 ఫోర్లు) హామిల్టన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

 రాజ్ కోట్ టెస్టులో పృథ్వీ షా సెంచరీ

రాజ్ కోట్ టెస్టులో పృథ్వీ షా సెంచరీ

ఇదిలా ఉంటే, రాజ్ కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టుతో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన పృథ్వీ షా(134) సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్‌ 272 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. విండిస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన పృథ్వీ షా అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే.

99 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో పృథ్వీషా సెంచరీ

99 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో పృథ్వీషా సెంచరీ

ఈ మ్యాచ్‌లో 99 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో పృథ్వీషా సెంచరీ సాధించాడు. తద్వారా అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆరంగేట్రంలోనే సెంచరీ చేసిన 15వ భారత ఆటగాడిగా పృథ్వీ షా అరుదైన ఘనత సాధించాడు. తద్వారా గంగూలీ, సెహ్వాగ్‌ తదితర దిగ్గజాల సరసన చేరాడు. అరంగేట్ర టెస్టులో సెంచరీ సాధించిన పిన్న వయస్కుడైన భారత క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు.

వంద బంతుల్లోపు సెంచరీ చేసిన మూడో బ్యాట్స్‌మన్

వంద బంతుల్లోపు సెంచరీ చేసిన మూడో బ్యాట్స్‌మన్

పృథ్వీ షా 18 ఏళ్ల 329 రోజుల వయసులోనే ఈ ఘనత సాధించాడు. తొలి టెస్టులో వంద బంతుల్లోపు సెంచరీ చేసిన మూడో బ్యాట్స్‌మన్. గతంలో శిఖర్ ధావన్ (85), డ్వేన్ స్మిత్ (93) ఈ ఘనత సాధించారు. దీంతోపాటు అతి చిన్న వయసులోనే సెంచరీ చేసిన భారత రెండో ఆటగాడిగా పృథ్వీషా నిలిచాడు. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ అరంగేట్ర మ్యాచుల్లోనూ సెంచరీలు చేసిన పృథ్వీ షా... తన అరంగేట్ర టెస్టు క్రికెట్‌లోనూ సెంచరీ సాధించాడు.

Story first published: Saturday, October 13, 2018, 13:33 [IST]
Other articles published on Oct 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X