న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హైదరాబాద్ టెస్ట్, డే 2: విండిస్ 311 ఆలౌట్, టీమిండియా 308/4

India vs West Indies, 2nd Test, Day 2 in Hyderabad: India End at 308/4

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో వెస్టిండిస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రహానే, రిషబ్ పంత్‌లు హాఫ్‌ సెంచరీలతో రాణించడంతో రెండో ఆట ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగులు వెనకబడి ఉంది. ప్రస్తుతం క్రీజులో రహానే (75 బ్యాటింగ్), రిషబ్ పంత్(85 నాటౌట్) పరుగులతో ఉన్నారు.

<strong>కింగ్ ఆసియాగా విరాట్ కోహ్లీ: హైదరాబాద్ టెస్ట్‌లో మరో రికార్డు బద్దలు</strong>కింగ్ ఆసియాగా విరాట్ కోహ్లీ: హైదరాబాద్ టెస్ట్‌లో మరో రికార్డు బద్దలు

వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 146 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వెస్టిండిస్ బౌలర్లలో జాసన్ హోల్డర్ రెండు, గాబ్రియేల్, వారికన్ చెర్ వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ (4), పుజారా (10) విఫలమైనా యువ ఓపెనర్ పృథ్వీ షా మరోమారు వీరవిహారం చేశాడు. తొలి టెస్టు మాదిరే దూకుడును కొనసాగించాడు.

1
44265

హాఫ్ సెంచరీకి చేరువలో కోహ్లీ ఔట్

దీంతో 53 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 70 పరుగులు చేసి వారికన్ బౌలింగ్‌లో హెట్‌మయెర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (45: 78 బంతుల్లో 5 ఫోర్లు) హాఫ్ సెంచరీకి చేరువలో కెప్టెన్ జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో అతడికే నేరుగా క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. రహానెతో కలిసి నాలుగో వికెట్‌కి 60 పరుగుల కీలక భాగస్వామ్యంతో జట్టుని మెరుగైన స్కోరు దిశగా నడిపించాడు.

కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆసియా క్రికెటర్‌గా

కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆసియా క్రికెటర్‌గా

ఈ క్రమంలో కోహ్లీ ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆసియా క్రికెటర్‌గా కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. 65.96 యావరేజ్‌తో 4222 పరుగులు చేసిన కోహ్లీ, పాక్ మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్‌ను అధిగమించాడు. అంతకముందు ఆసియాలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్‌ పేరిట ఉంది.

56 టెస్టుల్లో 51.39 యావరేజితో 4214 పరుగులు

56 టెస్టుల్లో 51.39 యావరేజితో 4214 పరుగులు

పాక్ తరుపున కెప్టెన్‌గా మిస్బావుల్ హక్‌ 56 టెస్టుల్లో 51.39 యావరేజితో 4214 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు ఉన్నాయి. కెరీర్‌లో 56 మ్యాచ్‌లకి కెప్టెన్సీ వహించి హక్ ఆ రికార్డు నెలకొల్పగా.. కోహ్లీ కేవలం 42 మ్యాచ్‌ల్లోనే ఆ మార్క్‌ని అందుకోవడం విశేషం. కెప్టెన్ కోహ్లీ 42 మ్యాచ్‌ల్లో 4233 పరుగులు చేశాడు. అంతేకాదు పాక్ మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్‌ యావరేజితో పోలిస్తే కోహ్లీ యావరేజ్ ఎక్కువగా ఉండటం విశేషం.

ఏ బ్యాట్స్‌మన్‌తో పోల్చినా కోహ్లీదే ఎక్కువ

కోహ్లీ ఈ పరుగులను 65.12 యావరేజితో నమోదు చేశాడు. ఇందులో 17 సెంచరీలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏ బ్యాట్స్‌మన్‌తో పోల్చినా కోహ్లీదే ఎక్కువగా ఉండటం విశేషం. కెప్టెన్‌గా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 8659 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. సఫారీ జట్టు తరుపున మొత్తం 109 మ్యాచ్‌లాడిన గ్రేమ్ స్మిత్ 47.84 యావరేజితో ఈ పరుగులు సాధించాడు.

8వ స్థానంలో విరాట్ కోహ్లీ

ఇందులో 25 సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత వరుసగా అలెన్ బోర్డర్ (ఆస్ట్రేలియా) 6,623 పరుగులు, రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) 6,542.. క్లైవ్ లాయిడ్ (వెస్టిండీస్ ) 5,233.. స్టీఫెన్ ఫ్లెమింగ్ (న్యూజిలాండ్) 4,844 రన్స్‌తో టాప్-5లో ఉండగా.. కోహ్లీ 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండిస్ జట్టు 101.4 ఓవర్లలో 311 పరుగులకే ఆలౌటైంది.

311 పరుగులకే వెస్టిండిస్ ఆలౌట్

ఓవర్ నైట్ స్కోరు 295/7తో శనివారం ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వెస్టిండిస్ జట్టు ఎంతో సేపు క్రీజులో నిలవలేకపోయింది. కేవలం 16 పరుగులను మాత్రమే జోడించి మిగిలిన మూడు వికెట్లను కోల్పోయింది. తొలిరోజు భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న విండీస్‌ ఓవర్‌నైట్‌ ఆటగాడు రోస్టన్‌ ఛేజ్‌(106; 189 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రోస్టన్‌ చేజ్‌ (106) ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

6 వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్

6 వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బిషూ(2), గాబ్రియెల్‌లు వెనువెంటనే పెవిలియన్‌ బాటపట్టారు. ఈ టెస్టులో రోస్టన్ ఛేజ్ వికెట్ తీయడం ద్వారా ఉమేశ్ యాదవ్ టెస్టుల్లో రెండోసారి ఐదు వికెట్లను తీసుకున్నాడు. చివరి మూడు వికెట్లు ఉమేశ్‌ యాదవ్‌ సాధించడం మరో విశేషం. దీంతో రెండో రోజు మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సేపటికే వెస్టిండిస్ జట్టు ఆలౌటైంది. కెప్టెన్ జాసన్ హోల్డర్ 52 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. భారత బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌ 88 పరుగులిచ్చి 6 వికెట్లు తీయగా.. కుల్దీప్‌ యాదవ్‌ మూడు, అశ్విన్‌ ఒక వికెట్ తీసుకున్నారు.

Story first published: Saturday, October 13, 2018, 17:55 [IST]
Other articles published on Oct 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X