న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విశాఖ వన్డేలో కుల్దీప్‌ హ్యాట్రిక్‌.. టీమిండియా తరఫున 'ఒకే ఒక్కడు'!!

India vs West Indies 2nd ODI : Kuldeep Yadav, The First Indian With Two ODI Hat-Tricks || Oneindia
India vs West Indies 2nd ODI: Spinner Kuldeep Yadav first Indian bowler to claim two hat-tricks

విశాఖపట్నం: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం సాగర తీరం విశాఖలోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ మైదానంలో విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదటగా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ (138 బంతుల్లో 159; 17 ఫోర్లు, 5 సిక్సర్లు), లోకేశ్‌ రాహుల్‌ (104 బంతుల్లో 102; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) బ్యాటింగ్‌లో చెలరేగగా.. ఆపై కుల్దీప్‌ యాదవ్‌ (3/52), మొహమ్మద్ షమీ (3/39) ధాటికి విండీస్‌ 280 పరుగులకు ఆలౌటైంది. 107 పరుగులతో జయభేరి మోగించిన టీమిండియా 1-1తో సిరీస్‌ను సమం చేసింది.

<strong>నేడు ఐపీఎల్‌ 2020 వేలం.. హాట్‌కేకుల్లా ఆసీస్‌, విండీస్‌ ఆటగాళ్లు!!</strong>నేడు ఐపీఎల్‌ 2020 వేలం.. హాట్‌కేకుల్లా ఆసీస్‌, విండీస్‌ ఆటగాళ్లు!!

కుల్దీప్‌ హ్యాట్రిక్‌

కుల్దీప్‌ హ్యాట్రిక్‌

కుల్దీప్‌ యాదవ్‌ రెండో వన్డేలో హ్యాట్రిక్‌ తీసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. 33వ ఓవర్లో బౌలింగ్ వచ్చిన కుల్దీప్ తొలి మూడు బంతులకు 7 పరుగులివ్వగా.. తదుపరి 3 బంతులకు హ్యాట్రిక్‌ తీసాడు. నాల్గో బంతికి షై హోప్ (78)ను, ఐదవ బంతికి జేసన్ హోల్డర్ (11)ను, ఆరో బంతికి జోసెఫ్ (0)ను ఔట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. 2017లో కోల్‌కతాలో ఆసీస్‌తో జరిగిన వన్డేలో కుల్దీప్‌ హ్యాట్రిక్‌ సాధించాడు.

భారత్‌ నుంచి 'ఒకే ఒక్కడు'

భారత్‌ నుంచి 'ఒకే ఒక్కడు'

హ్యాట్రిక్‌ తీసిన కుల్దీప్‌ ఒక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో రెండుసార్లు హ్యాట్రిక్‌ సాధించిన తొలి భారత బౌలర్‌గా నయా రికార్డును లిఖించాడు. భారత్‌ తరఫున చేతన్‌ శర్మ (1987లో న్యూజిలాండ్‌పై), కపిల్‌ దేవ్‌ (1991లో శ్రీలంకపై), మహ్మద్‌ షమీ (2019లో అఫ్గానిస్తాన్‌పై)లు వన్డేల్లో హ్యాట్రిక్‌ సాధించారు. వీరంతా ఒకేసారి హ్యాట్రిక్‌లు సాధిస్తే.. కుల్దీప్‌ మాత్రం రెండుసార్లు హ్యాట్రిక్‌లు సాధించడం విశేషం.

మూడు హ్యాట్రిక్‌లు తీసిన మలింగ

మూడు హ్యాట్రిక్‌లు తీసిన మలింగ

రెండు సందర్భాల్లో హ్యాట్రిక్‌ తీసిన ఆటగాడిగా వసీం అక్రమ్‌ (పాకిస్థాన్‌), సక్లయిన్‌ ముస్తాక్‌ (పాకిస్థాన్‌), చమిందా వాస్‌ (శ్రీలంక), ట్రెంట్‌ బౌల్ట్‌ (న్యూజిలాండ్‌)తో కలిసి కుల్దీప్‌ రెండో స్థానంలో నిలిచాడు. ఇక క్రికెట్‌ చరిత్రలోనే అత్యధికంగా మూడుసార్లు హ్యాట్రిక్‌ తీసిన బౌలర్‌గా శ్రీలంక వెటరన్‌ పేసర్‌ లసిత్‌ మలింగ మొదటి స్థానంలో ఉన్నాడు.

షమీ హ్యాట్రిక్‌ మిస్

షమీ హ్యాట్రిక్‌ మిస్

విశాఖ వన్డేలో షమీకి హ్యాట్రిక్‌ తీసే అవకాశం మిస్‌ అయ్యింది. 30 ఓవర్‌ రెండో బంతికి నికోలస్ పూరన్‌ను ఔట్‌ చేసిన షమీ.. మూడో బంతికి కెప్టెన్ కీరన్ పొలార్డ్‌ను గోల్డెన్‌ డక్‌గా ఔట్‌ చేశాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన జాసన్ హోల్డర్‌ నాలుగో బంతిని అడ్డుకోవడంతో హ్యాట్రిక్‌ మిస్ అయింది.

Story first published: Thursday, December 19, 2019, 9:15 [IST]
Other articles published on Dec 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X