న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విశాఖ వన్డే.. రోహిత్‌-రాహుల్‌లు నాలుగోసారి!!

India vs West Indies 2nd ODI, Live Score: Rohit & Rahul put on Indias 4th 100 plus 1st wicket stand

విశాఖపట్నం: వెస్టిండీస్‌తో విశాఖలో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. పటిష్ఠ విండీస్‌ బౌలింగ్‌ను ధాటిగా ఎదుర్కొంటూ మంచి శుభారంభం అందించారు. మొదటి నుంచి కాస్త వేగంగా ఆడుతున్న రాహుల్‌ 46 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతనికిది ఐదోవది. అనంతరం 'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మ గేర్ మార్చి 67 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసాడు. వన్డేల్లో రోహిత్‌ 43వ హాఫ్‌సెంచరీ కావడం విశేషం.

విశాఖ వన్డే: రాహుల్ హాఫ్ సెంచరీ.. స్కోర్ 112/0విశాఖ వన్డే: రాహుల్ హాఫ్ సెంచరీ.. స్కోర్ 112/0

రోహిత్‌-రాహుల్‌ రన్‌రేట్‌ తగ్గకుండా ఉండేందుకు దూకుడుగా ఆడుతున్నారు. ఇప్పటికే ఈ జోడి 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వన్డేల్లో రోహిత్‌-రాహుల్‌లు వంద పరుగులకు పైగా ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని సాధించడం ఇది నాలుగోసారి. ఈ జోడి మాంచెస్టర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ 136 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో 180 పరుగులు చేసింది. ఇక శ్రీలంకతో లీడ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 189 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది.

రోహిత్ హాఫ్ సెంచరీ చేయడంతో ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక వన్డే పరుగుల్ని సాధించాడు. ఇక్కడ విరాట్ కోహ్లీని రోహిత్‌ వెనక్కి నెట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీ కూడా ఆడుతుండటంతో.. రోహిత్‌ను అధిగమించే అవకాశం ఉంది. 2019లో అత్యధిక వన్డే పరుగులు రికార్డు రోహిత్‌-కోహ్లీల మధ్య దోబుచులాడుతున్న విషయం తెలిసిందే.

రోహిత్‌-రాహుల్‌ ధాటిగా ఆడుతుండంతో.. పరుగులు చేయకుండా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంతో పాటు వికెట్‌ పడగొట్టాలని విండీస్ బౌలర్లు వ్యూహాలు రచిస్తున్నారు. డ్రింక్స్‌ బ్రేక్‌ అనంతరం రెండు ఓవర్లలో భారత్‌ కేవలం రెండే పరుగులు చేసిందని. జేసన్‌ హోల్డర్‌, అల్జారీ జోసెఫ్‌ కట్టుదిట్టంగా బంతులేశారు. అయితే రోహిత్ చెలరేగడంతో వారు కూడా తేలిపోయారు. ప్రస్తుతం 30 ఓవర్లు ఆడిన భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 170 పరుగులు చేసింది. రోహిత్‌ (79), రాహుల్‌ (87) క్రీజులో ఉన్నారు.

Story first published: Wednesday, December 18, 2019, 15:56 [IST]
Other articles published on Dec 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X