న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాజ్‌కోట్ టెస్టు, డే1: పృథ్వీ షా సెంచరీ, క్రీజులో కోహ్లీ.. భారత్ 364/4

India vs West indies 2018 : 1st Test Day 1Highlights
India vs West Indies, 1st Test Day 1 Live Updates: India 364/4 at stumps, Prithvi Shaw 134

హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు టీమిండియా పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించింది. అంతగా అనుభవం లేని వెస్టిండిస్ బౌలర్లను భారత బ్యాట్స్‌మన్ ఓ ఆటాడుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లి సేన.. యువ ఓపెనర్ పృథ్వీ షా (134) సెంచరీతో పాటు పుజారా (86), కోహ్లీ (72 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 364 పరుగులు చేసింది.

గణాంకాలు: ఒక్క సెంచరీతో పృథ్వీషా ఖాతాలో రికార్డుల వెల్లువ గణాంకాలు: ఒక్క సెంచరీతో పృథ్వీషా ఖాతాలో రికార్డుల వెల్లువ

ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్ (17 బ్యాటింగ్), విరాట్ కోహ్లీ(72 బ్యాటింగ్) పరుగులతో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మూడు పరుగుల వద్దే లోకేశ్ రాహుల్ వికెట్‌ను కోల్పోయింది. గాబ్రియల్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికి పోయిన రాహల్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారాతో కలిసి పృథ్వీషా అద్భుత ప్రదర్శన చేశాడు.

 99 బంతుల్లో సెంచరీ సాధించిన పృథ్వీషా

99 బంతుల్లో సెంచరీ సాధించిన పృథ్వీషా

కెరీర్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్నా.. ఆ ఒత్తిడేమీ అతడిలో కనిపించలేదు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచీ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన పృథ్వీషా... కేవలం 99 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. పుజారాతో కలిసి పృథ్వీషా అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 206 పరుగులు జోడించారు.

209 పరుగుల వద్ద పుజారా ఔట్

209 పరుగుల వద్ద పుజారా ఔట్

ప్రమాదకరంగా మారిన ఈ జోడీని జట్టు స్కోరు 209 పరుగుల వద్ద లావిస్ విడదీశాడు. బంతిని హిట్ చేసే క్రమంలో పుజారా డోవ్రిచ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం కొద్దిసేపటికే పృథ్వీ షా కూడా దేవేంద్ర బిషూ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ సమయంలో భారత స్కోరు 232/3.

రహానేతో కలిసి కోహ్లీ మరో సెంచరీ భాగస్వామ్యం

రహానేతో కలిసి కోహ్లీ మరో సెంచరీ భాగస్వామ్యం

ఈ దశలో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. వైస్ కెప్టెన్ రహానే (41)తో కలిసి మరో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ టెస్టుల్లో 20వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీకి 9 పరుగుల దూరంలో పెవిలియన్‌ చేరాడు. రోస్టన్‌ చేజ్‌ వేసిన 83.3వ బంతిని ఆడబోయిన రహానే కీపర్‌ డోవ్రిచ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.

తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 364/4

తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 364/4

భారత్ స్కోరుని 300 దాటించిన ఈ జోడీ జట్టు స్కోరు 337 పరుగుల వద్ద రహానే ఔటవడంతో విడిపోయింది. రహానే ఔటైనా.. క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్‌తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన కోహ్లీ తొలిరోజు 364/4తో తొలిరోజు ఆటని ముగించాడు. విండీస్ బౌలర్లలో షనాన్ గాబ్రియల్, షెర్మన్ లూయిస్, దేవేంద్ర బిషూ, రోస్టన్ చేజ్ చెరో వికెట్ పడగొట్టారు.

1
44264
Story first published: Thursday, October 4, 2018, 18:06 [IST]
Other articles published on Oct 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X