న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వెస్టిండీస్‌తో సిరీస్: మ్యాచ్ వేదికలలో మార్పు.. ఉప్ప‌ల్‌లో తొలి టీ20!!

India vs West Indies: 1st T20I Shifted From Mumbai To Hyderabad

హైదరాబాద్: బంగ్లాదేశ్ పర్యటనను టీమిండియా ఘనంగా ముగించింది. టీ20 సిరీస్‌లో గట్టి పోటీ ఇచ్చిన బంగ్లా.. టెస్ట్ సిరీస్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. భారత పేసర్ల ముందు నిలవలేక రెండు టెస్టులలో ఇన్నింగ్స్ పరాజయాలను చవిచూసింది. అదే ఊపులో కోహ్లీసేన స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు సిరీస్‌లకు సిద్దమయింది. ఈ పర్యటనలో వెస్టిండీస్‌-భారత జట్లు 3 టీ20లు, 3 వన్డేలు ఆడనున్నాయి.

<strong>'ప్రజలు ఏదైనా రాయొచ్చు కానీ.. ధోనీ, కోహ్లీ నన్ను గౌరవిస్తారు'</strong>'ప్రజలు ఏదైనా రాయొచ్చు కానీ.. ధోనీ, కోహ్లీ నన్ను గౌరవిస్తారు'

ఉప్ప‌ల్‌లో తొలి టీ20

ఉప్ప‌ల్‌లో తొలి టీ20

మొదటగా టీ20 సిరీస్ జరగనుంది. అయితే ముందస్తు షెడ్యూల్ ప్రకారం కాకుండా.. తొలి టీ20, మూడో టీ20 మ్యాచ్ వేదిక‌లలో బీసీసీఐ మార్పులు చేసింది. డిసెంబ‌ర్ 6వ‌ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో జ‌ర‌గాల్సిన తొలి టీ20 మ్యాచ్ హైదరాబాద్ నగరం ఉప్ప‌ల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగుతుంది. అలాగే మూడో టీ20 (డిసెంబ‌ర్ 11న)కి ముంబై ఆతిథ్యం ఇవ్వనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. డిసెంబ‌ర్ 8న తిరువంతపురంలో రెండో టీ20 జరగనుంది.

ధావన్ స్థానంలో శాంసన్:

ధావన్ స్థానంలో శాంసన్:

విండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు స్టార్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ దూరమయ్యాడు. ముస్తాక్‌ అలీ టీ20 టోర్నమెంట్‌లో భాగంగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ధావన్‌ ఎడమ మోకాలికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ధావన్‌ కోలుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని బీసీసీఐ తెలిపింది. దీంతో ధావన్‌ స్థానంలో కేరళ వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ పేర్కొంది.

2015లో జింబాబ్వేపై టీ20:

2015లో జింబాబ్వేపై టీ20:

2015లో జింబాబ్వేపై ఒక టీ20 ఆడిన సంజూ శాంసన్‌ ఆ మ్యాచ్‌లో 19 పరుగులు చేశాడు. అప్పటి నుంచి మళ్లీ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు. బంగ్లాతో జరిగిన టీ20 సిరీస్‌కు ఎంపికైనా.. అదనపు ఆటగాడిగా ఉన్నాడు తప్ప తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. వెస్టిండీస్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు భారత జట్లను ఈనెల 21న సెలక్టర్లు ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

Complete schedule of India vs West Indies 2019

Complete schedule of India vs West Indies 2019

# 1st T20I: December 6 in Hyderabad

# 2nd T20I: December 8 in Thiruvananthapuram

# 3rd T20I: December 11 in Mumbai

# 1st ODI: December 15 in Chennai

# 2nd ODI: December 18 in Visakhapatnam

# 3rd ODI: December 22 in Cuttack

 India's squad for 3 T20Is:

India's squad for 3 T20Is:

Virat Kohli (C), Rohit Sharma (VC), KL Rahul, Shreyas Iyer, Manish Pandey, Rishabh Pant (WK), Shivam Dube, Washington Sundar, Ravindra Jadeja, Yuzvendra Chahal, Kuldeep Yadav, Deepak Chahar, Mohammed Shami, Bhuvneshwar Kumar, Sanju Samson.

Story first published: Wednesday, November 27, 2019, 18:57 [IST]
Other articles published on Nov 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X