న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వన్డేల్లో సత్తా చాటుతాం: తొలి వన్డేకి ముందు జాసన్ హోల్డర్

India vs West Indies, 1st ODI: Visiting Captain Jason Holder prepared to face tough series against hosts

హైదరాబాద్: రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-0తో చేజార్చుకున్నప్పటికీ వన్డేల్లో టీమిండియాకు గట్టి పోటీ ఇస్తామని పర్యాటక వెస్టిండిస్ జట్టు కెప్టెన్ జాసన్ హోల్డర్ అన్నాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య తొలి వన్డే గువహటి వేదికగా ఆదివారం మధ్యాహ్నాం 1.30 గంటలకు ప్రారంభం కానుంది.

1
44266
జాసన్ హోల్డర్ మాట్లాడుతూ

జాసన్ హోల్డర్ మాట్లాడుతూ

తొలి వన్డేకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో జాసన్ హోల్డర్ మాట్లాడుతూ "నాణ్యమైన క్రికెట్‌ ఆడుతున్న భారత్‌కు ఎదురు నిలవడం కష్టంతో కూడుకున్న పనే. ప్రపంచంలోనే టీమ్‌ఇండియా అత్యుత్తమ వన్డే జట్టు అనడంలో సందేహం లేదు. వాళ్ల నుంచి కఠిన పోటీ ఎదురువుతుందని అనుకుంటున్నాం" అని అన్నాడు.

వన్డే సిరీస్‌ ఇంగ్లాండ్‌దే: సొంతగడ్డపై లంకకు మరో పరాభవం

సత్తా చాటుకోవడానికి ఇది వాళ్లకు మంచి అవకాశం

సత్తా చాటుకోవడానికి ఇది వాళ్లకు మంచి అవకాశం

"చాలా మంది కుర్రాళ్లు జట్టులో ఉన్నారు. సత్తా చాటుకోవడానికి ఇది వాళ్లకు మంచి అవకాశం. ప్రస్తుతం వన్డేల్లో 300 పరుగుల స్కోరు సాధారణమైపోయింది. మ్యాచ్‌లో 300కు పైగా స్కోరే చేయడం గురించి డ్రెస్సింగ్‌ రూమ్‌లో మాట్లాడుకున్నాం. బ్యాటింగ్‌కు అనుకూలించే భారత పిచ్‌లపై మా బ్యాట్స్‌మన్‌ రెచ్చిపోవాలని కోరుకుంటున్నా" అని తెలిపాడు.

ఈ సిరీస్‌ సాంతం నిలకడగా రాణించాలి

"ఈ సిరీస్‌ సాంతం నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో తడబాటు ఉండకూడదు" అని జాసన్ హోల్డర్‌ చెప్పాడు. ఆదివారం టీమిండియాతో జరిగే మ్యాచ్ మార్లోన్‌ సామ్యూల్స్‌ 200వ అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌. దీనిపై మాట్లాడుతూ "అతను చాలా ఏళ్లుగా జట్టులో కొనసాగుతున్నాడు. మా వన్డే ఉత్తమ బ్యాట్స్‌మన్లలో అతను ఒకడు. ఇటీవల అతని ప్రదర్శన అద్భుతంగా ఉంది. 200వ మ్యాచ్‌లో అతను రాణిస్తాడని అనుకుంటున్నా" అని అన్నాడు.

పిచ్, వాతావరణం

బర్సపర మైదానంలో ఇదే తొలి వన్డే మ్యాచ్‌. ఏడాది క్రితం జరిగిన టి20 మ్యాచ్‌లో ఆసీస్‌ బౌలర్లు భారత్‌పై చెలరేగారు. ఇప్పుడు పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారినట్లు చెబుతున్నారు. ఈశాన్యంలో శీతాకాలం ఆరంభమైపోవడంతో మంచు ప్రభావం ఖాయం. టాస్‌ గెలిచే జట్టు బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది.

Story first published: Sunday, October 21, 2018, 13:04 [IST]
Other articles published on Oct 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X