న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గందరగోళం: పాండ్యా రావడంతో ఈజీ క్యాచ్‌ని మిస్ చేసిన కుల్దీప్!

ICC Cricket World Cup 2019 : India Vs Sri Lanka, Kuldeep Yadav-Hardik Pandya Drop Easy Catch !
India vs Sri Lanka Live Score, CWC 2019: Confusion between Kuldeep Yadav and Hardik Pandya as Kusal Perera Catch

హైదరాబాద్: లీడ్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక బ్యాట్స్‌మన్ కుశాల్ పెరీరాకు లైఫ్ లభించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్ తొలి బంతిని కుశాల్ పెరీరా ఫ్రంట్ పుట్ వేసి మరీ మిడాఫ్ మీదుగా భారీ షాడ్ ఆడాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఆ సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తోన్న కుల్దీప్ యాదవ్ పరుగెత్తుకుంటూ వచ్చి ఆ బంతిని క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో హార్దిక్ పాండ్యా కూడా బంతిని అందుకునేందుకు పరిగెత్తుకుంటూ రాగా సమన్వయలోపం కారణంగా కుల్దీప్ క్యాచ్ మిస్ చేశాడు. దీంతో శ్రీలంకకు రెండు పరుగులు లభించాయి.

ప్రస్తుతం 5 ఓవర్లుక గాను శ్రీలంక వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. క్రీజులో కుశాల్ పెరీరా(17), ఆవిష్కా ఫెర్నాండో పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఒక మార్పుతో బరిలోకి దిగింది. టీమిండియా ఇప్పటికే సెమీస్‌కు చేరడంతో కోహ్లీసేనకు ఇది నామమాత్రపు మ్యాచే.

అయితే, ఈ మ్యాచ్‌లో గెలిస్తే పాయింట్లు పెరిగే అవకాశం ఉంది. టీమిండియా ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఆరింట విజయం సాధించి 13 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు భారత్, శ్రీలంక జట్లు ఇప్పటివరకు 158 మ్యాచ్‌లు ఆడాయి. 90 మ్యాచ్‌ల్లో భారత్‌.. 56 మ్యాచ్‌ల్లో శ్రీలంక గెలిచాయి.

1
43687

ఒక మ్యాచ్‌ 'టై' అయింది. ఇక 11 మ్యాచ్‌లు రద్దయ్యాయి. మరోవైపు ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల మధ్య 8 మ్యాచ్‌లు జరిగాయి. 3 మ్యాచ్‌ల్లో భారత్‌.. 4 మ్యాచ్‌ల్లో శ్రీలంక నెగ్గాయి. మరో మ్యాచ్‌ రద్దయింది.

Story first published: Saturday, July 6, 2019, 16:00 [IST]
Other articles published on Jul 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X