న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎవరిది పైచేయి అవుతుందో: ప్రపంచకప్‌ల్లో భారత్-శ్రీలంక ప్రస్థానం ఇలా!

India vs Sri Lanka: How the teams have fared against each other at World Cups?

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా శనివారం టీమిండియా-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. లీడ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా ఇప్పటికే సెమీస్‌కు చేరడంతో కోహ్లీసేనకు ఇది నామమాత్రపు మ్యాచే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అయితే, ఈ మ్యాచ్‌లో గెలిస్తే పాయింట్లు పెరిగే అవకాశం ఉంది. కాగా, ప్రపంచకప్‌లో ఇరు జట్లూ ఇప్పటివరకు ఎనిమిదిసార్లు పోటీపడగా లంక నాలుగు విజయాలు సాధించింది. టీమిండియా మూడుసార్లు గెలిచింది. ఒక మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయింది. టీమిండియా ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఆరింట విజయం సాధించి 13 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

మరోవైపు శ్రీలంక విషయానికి వస్తే ఆడిన 8 మ్యాచ్‌ల్లో మూడింట గెలిచి మూడింట ఓడింది. రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. దీంతో 8 పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో శనివారం తొమ్మిదోసారి పోటీపడుతున్నాయి. దీంతో శనివారం నాటి మ్యాచ్‌లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి మరి.

1979లో తొలిసారి

1979లో తొలిసారి

భారత్-శ్రీలంక జట్లు తొలిసారి 1979 ప్రపంచకప్‌లో తలపడ్డాయి. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక నిర్ణీత 60 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్‌ 191 పరుగులకే కుప్పకూలింది. దీంతో ప్రపంచకప్‌లో శ్రీలంక టీమిండియా తొలి విజయాన్ని నమోదు చేసింది.

1992లో వర్షం కారణంగా రద్దు

1992లో వర్షం కారణంగా రద్దు

భారత్-శ్రీలంక జట్లు మళ్లీ రెండోసారి 1992 ప్రపంచకప్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన లంక ఫీల్డింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్‌ ప్రారంభమైన రెండు బంతులకే ఏకధాటిగా వర్షం పడడంతో అంఫైర్లు మ్యాచ్‌ రద్దు చేశారు.

1996 ఈడెన్‌లో ఉద్రిక్తత

1996 ఈడెన్‌లో ఉద్రిక్తత

సొంతగడ్డపై జరిగిన ఈ ప్రపంచకప్‌‌లో టీమిండియా సెమీస్‌ నుంచి అనూహ్యంగా నిష్క్రమించింది. ఈడెన్‌ గార్డెన్స్ వేదికగా రెండు జట్లూ మూడోసారి తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక ఎనిమిది వికెట్లకు 251 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సచిన్‌(65) ధాటిగా ఆరంభించడంతో టీమిండియా సునాయాసంగా గెలుస్తుందని అంతా భావించారు. అయితే, సచిన్ టెండూల్కర్ ఔటైన తర్వాత వరుసగా టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయింది. దీంతో ఓటమిని తట్టుకోలోనే భారత అభిమానులు స్టేడియంలోకి నీళ్ల బాటిళ్లు విసిరి ఆందోళన చేయడంతో పాటు స్టాండ్స్‌లోని కుర్చీలకు సైతం నిప్పంటించారు. దీంతో మ్యాచ్ ఎంతకీ జరగ్గపోవడంతో మ్యాచ్ రిఫరీ శ్రీలంకను విజేతగా ప్రకటించాడు.

1999లోలంకపై తొలి విజయం

1999లోలంకపై తొలి విజయం

1999 ప్రపంచకప్‌లో శ్రీలంకపై భారత్‌ తొలిసారి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ(183), రాహుల్ ద్రవిడ్‌(145) సెంచరీలతో చెలరేగడంతో టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 373 పరుగులు చేసింది. అనంతరం 374 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దోగిన శ్రీలంక స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. దీంతో 157 పరుగుల తేడాతో విజయం సాధించింది.

2003లో అతిపెద్ద విజయం

2003లో అతిపెద్ద విజయం

2003 ప్రపంచకప్‌లో భారత్‌ 183 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో సచిన్‌ టెండూల్కర్(97) రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 292 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంకను భారత బౌలర్లు 109 పరుగులకే ఆలౌట్ చేశారు.

2007లో విజయం సాధించిన శ్రీలంక

2007లో విజయం సాధించిన శ్రీలంక

1999, 2003 ప్రపంచకప్‌లలో చిత్తుగా ఓడిన శ్రీలంక 2007 ప్రపంచకప్‌లో దానికి బదులు తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 254 పరుగులు చేసింది. అనంతరం టీమిండియాను 185 పరుగులకే ఆలౌట్ చేయడంతో శ్రీలంక 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

2011లో లంకపై భారత్ విజయం

2011లో లంకపై భారత్ విజయం

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్లో తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో జయవర్ధనే 103 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాని గంభీర్‌(97), ధోనీ(91) హాఫ్ సెంచరీలతో రాణించడంతో టీమిండియా విజయం సాధించింది.

2015 ప్రపంచకప్‌లో ఇలా!

2015 ప్రపంచకప్‌లో ఇలా!

ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చిన 2015 ప్రపంచకప్‌లో ఇరు జట్లూ వేర్వేరు గ్రూపుల్లో ఉండడంతో తలపడలేదు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌ రౌండ్‌రాబిన్‌ పద్ధతిలో జరుగుతుండటంతో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడుతున్నాయి. టీమిండియా ఇప్పటికే సెమీస్‌కు చేరడంతో కోహ్లీసేనకు ఇది నామమాత్రపు మ్యాచే. అయితే, ఈ మ్యాచ్‌లో గెలిస్తే పాయింట్లు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు లీగ్ స్టేజిలో ఆడనున్న ఆఖరి మ్యాచ్‌లోనైనా విజయం సాధించి టోర్నీని ఘనంగా ముగించాలని లంకేయులు భావిస్తున్నారు.

Story first published: Saturday, July 6, 2019, 15:23 [IST]
Other articles published on Jul 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X