న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఏనుగుకు ఉన్నంత జ్ఞాపకశక్తి: అశ్విన్ తెలివితేటలకు అభిమానులు ఫిదా (వీడియో)

By Nageshwara Rao
India vs Sri Lanka: 'Elephant Memory' Ashwin Recalls His 100th, 200th Test Victims

హైదరాబాద్: టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఏనుగుకు ఉన్నంత జ్ఞాపకశక్తి ఉందని ఈ వీడియో చూస్తే మీరే ఒప్పంకుంటారు. నాగ్‌పూర్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెంటో టెస్టులో అశ్విన్ ప్రపంచ రికార్డుని నెలకొల్పిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్‌గా సోమవారం చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

300 వికెట్లు: టెస్టు క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన రవిచంద్రన్ అశ్విన్300 వికెట్లు: టెస్టు క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన రవిచంద్రన్ అశ్విన్

Ravichandran Ashwin takes fastest 300 test wickets, beats Lillee's record | Oneindia News

ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌. శ్రీధర్‌... అశ్విన్‌ను సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. 'నీ 100వ, 200వ, 300వ వికెట్‌ బాధితులెవరని ప్రశ్నించగా... అశ్విన్‌ ముంబైలో100వ వికెట్‌ డారెన్‌ సామీ, కాన్పూర్‌లో 200వ వికెట్‌ విలియమ్సన్‌, నాగ్‌పూర్‌లో 300వ వికెట్‌ గమాగె అని వెంట వెంటనే సమాధానమిచ్చాడు.

ఆ తర్వాత తన భవిష్యత్తుపై ప్రశ్నించగా... 'నేను ఇప్పటికి 50 టెస్టులు మాత్రమే ఆడాను. ఇప్పుడు సాధించిన వికెట్ల సంఖ్యను భవిష్యత్తులో రెట్టింపు చేస్తాననే నమ్మకం ఉంది' అని అశ్విన్‌ ధీమా వ్యక్తం చేశాడు. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను ఎక్కువసార్లు ఔట్ చేయడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని అశ్విన్ తెలిపాడు.

'గత రెండేళ్లుగా క్యారమ్‌ బంతులు వేయడంలేదు. అందుకే ఆ బంతి వేసి ఈ మైలు రాయి అందుకున్నాను' అని అశ్విన్ తెలిపాడు. శ్రీలంకతో టెస్టు సిరిస్‌కు ముందు లభించిన విశ్రాంతి ఎంతో కలిసొచ్చిందని అశ్విన్ చెప్పుకొచ్చాడు. కాగా, నాగ్‌పూర్ టెస్టు ప్రారంభానికి ముందు 300 వికెట్ల మైలురాయికి 8 వికెట్ల దూరంలో ఉన్న అశ్విన్... తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి ఈ రికార్డును సృష్టించాడు.

ప్రపంచ రికార్డు నెలకొల్పిన అశ్విన్: సోషల్ మీడియాలో ప్రశంసల వర్షంప్రపంచ రికార్డు నెలకొల్పిన అశ్విన్: సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం

గతంలో ఈ రికార్డు అస్ట్రేలియా పేస్ దిగ్గజం డెన్నిస్ లిల్లీ పేరిట ఉంది. డెన్నిస్ ఈ ఘనతను 56 మ్యాచుల్లో సాధించగా.. అశ్విన్ కేవలం 54 మ్యాచ్‌ల్లోనే సాధించడం విశేషం. కాగా, ఇప్పటివరకు టెస్టుల్లో 26సార్లు 5 వికెట్లు, 7సార్లు పది వికెట్లు తీసుకున్నాడు. అత్యంత వేగంగా టెస్టుల్లో 300 వికెట్లు తీసిన అశ్విన్‌పై బీసీసీఐ సహా పలువురు క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.

అశ్విన్‌ తీసిన ప్రధాన వికెట్లు:
1st Test wicket: Darren Bravo (West Indies)
50th Test wicket: Nick Compton (England)
100th Test wicket: Darren Sammy (West Indies)
150th Test wicket: Imran Tahir (South Africa)
200th Test wicket: Kane Williamson (New Zealand)
250th Test wicket: Mushfiqur Rahim (Bangladesh)
300th Test Wicket: Lahiru Gamage (Sri Lanka)

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, November 28, 2017, 12:31 [IST]
Other articles published on Nov 28, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X