న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ సెంచరీ: 5-0తో సిరిస్ క్లీన్ స్వీప్, ధోని ప్రపంచ రికార్డు

By Nageshwara Rao

హైదరాబాద్: ఐదో వన్డేలో ఆతిథ్య శ్రీలంకపై భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 239 పరుగుల విజయ లక్ష్యాన్ని 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టీమిండియా సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. భారత జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ 116 బంతుల్లో 110 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు.

మరోవైపు ధోని ఒక పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు. అంతకముందు బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ శర్మ 16, రహానే 5, పాండే 36, జాదవ్ 63 పరుగులు చేశారు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 49.4 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసి ఆలౌటైంది.

ఈ సిరీస్‌లో అంతగా ప్రభావం చూపని పేసర్‌ భువనేశ్వర్‌ ఐదో వన్డేలో ఐదు వికెట్లతో చెలరేగాడు. తన బౌలింగ్ కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. మరోవైపు జస్‌ప్రీత్‌ బుమ్రా రెండు వికెట్లు తీసి ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు (15) తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.

వన్డేల్లో ప్రపంచ రికార్డుని నెలకొల్పిన ధోని

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వన్డే చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో 100 స్టంపౌట్స్ చేసిన ఏకైక వికెట్‌ కీపర్‌గా నిలిచాడు. శ్రీలంకతో ఆదివారం కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక క్రికెటర్ ధనంజయని స్టంపౌట్ చేయడం ద్వారా ధోని ఈ రికార్డు అందుకున్నాడు. ఈ సిరీస్‌లోనే 99 స్టంపౌట్స్‌తో శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార సంగక్కరని సమం చేసిన ధోని, తాజాగా స్టంపింగ్‌తో అతడి రికార్డుని అధిగమించాడు.

లంక ఇన్నింగ్స్ లో భాగంగా 45 ఓవర్ చివరి బంతికి దనంజయను ధోని స్టంపింగ్ చేశాడు. చాహల్ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి షాట్ కోసం ధనంజయ ప్రయత్నించాడు. అనూహ్యంగా టర్న్ తీసుకున్న బంతి నేరుగా ధోని చేతుల్లోకి వెళ్లింది. క్షణాల వ్యవధిలోనే ధోని వికెట్లను గీరాటేయడంతో అతని ఖాతాలో వంద స్టంపౌట్స్ చేరాయి.


శ్రీలంక ఇన్నింగ్స్ సాగిందిలా:

వరుసగా మూడు వికెట్లు కోల్పోయిన శ్రీలంక
తిరిమన్నె అవుటైన తర్వాత శ్రీలంక వరుసగా వికెట్లను చేజార్చుకుంది. 185 పరుగుల వద్ద తిరుమన్నె అవుటయ్యాక 194 పరుగుల వద్ద మాథ్యూస్ (55), 205 పరుగుల వద్ద హసరంగ (9), 212 పరుగుల వద్ద దనంజయ (4) పెవిలియన్ చేరారు. ప్రస్తుతం 46 ఓవర్లు ముగిసే సరికి లంక ఏడు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. భువనేశ్వర్ 3, బుమ్రా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు.

తిరిమన్నె అవుట్: నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక
భారత్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. 63 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన తిరిమన్నె మాథ్యూస్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఇద్దరూ కలిసి 122 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కెప్టెన్ కోహ్లీ మార్చిమార్చి బౌలర్లను ప్రయోగించినా ఫలితం లేకుండా పోయింది. చివరికి భువనేశ్వర్ అద్భుత బంతికి తిరిమన్నెని 67 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేర్చాడు. ప్రస్తుతం 40 ఓవర్లు ముగిసే సరికి లంక నాలుగు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. మాథ్యూస్ (54), సిరివర్దన పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.

తిరిమన్నె హాఫ్ సెంచరీ
భారత్‌తో జరుగుతున్న ఐదో వన్డేలో తిరిమన్నె హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మాథ్యూస్‌తో కలిసి నిలకడగా ఆడుతున్న తిరమన్నె 83 బంతుల్లో మూడు ఫోర్లు, సిక్సర్‌ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇద్దరూ కలిసి 142 బంతుల్లో 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం 33 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. మాథ్యూస్ (43), తిరిమన్నె (54) పరుగులతో క్రీజులో ఉన్నారు.

25 ఓవర్లకు శ్రీలంక స్కోరు
ఐదో వన్డేలో శ్రీలంక నిలకడగా ఆడుతోంది. 63 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన మాథ్యూస్‌తో కలిసి తిరిమన్నె ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి 94 బంతుల్లో 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 25 ఓవర్లు ముగిసే సరికి లంక మూడు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. తిరిమన్నె (37), మాథ్యూస్ (31) పరుగులతో క్రీజులో ఉన్నారు.

శ్రీలంకలో బుమ్రా అరుదైన ఘనత

శ్రీలంకతో జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. 34 బంతుల్లో 9 ఫోర్లతో 48 పరుగులు చేసిన కెప్టెన్ ఉపుల్ తరంగను బుమ్రా అవుట్ చేశాడు. బుమ్రా వేసిన 9.2వ బంతిని అంచనా వేయడంలో విఫలమైన తరంగ కీపర్‌ ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఈ సిరీస్‌లో బుమ్రాకు ఇది 14వ వికెట్‌. శ్రీలంకలో ఒక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన క్రిస్‌ వోక్స్‌ సరసన బుమ్రా చేరాడు. మరో వికెట్‌ తీస్తే అతడిని అధిగమిస్తాడు.

Bumrah

కష్టాల్లో శ్రీలంక: ఉపుల్ తరంగ అవుట్
భారత్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో శ్రీలంక కష్టాల్లో కూరుకుపోతోంది. 34 బంతుల్లో 9 ఫోర్లతో 48 పరుగులు చేసిన కెప్టెన్ ఉపుల్ తరంగను బుమ్రా అవుట్ చేశాడు. దీంతో 63 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి శ్రీలంక కష్టాల్లో పడింది. తరంగ అవుటైన తర్వాత మాథ్యూస్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక మూడు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. తిరిమన్నే (3), మాథ్యూస్ (1) క్రీజులో ఉన్నారు.

రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక
భారత్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 40 పరుగుల వద్ద శ్రీలంక రెండో వికెట్ కోల్పోవడం విశేషం. మునవీరా (4) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భువనేశ్వర్ బౌలింగ్‌లో కెప్టెన్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మునవీర అవుటైన తర్వాత తిరుమన్నే క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక రెండు వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. కెప్టెన్ ఉపుల్ తరంగ (44), తిరిమన్నె (1) పరుగులతో క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్ కోల్పోయిన లంక

కొలంబో వేదికగా భారత్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. రెండు మ్యాచ్‌ల నిషేధానికి గురైన శ్రీలంక కెప్టెన్ ఉపుల్ తరంగ ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ నిరోషన్ డిక్‌వెల్లాతో కలిసి బ్యాటింగ్ ప్రారంభించాడు. మూడో ఓవర్ చివరి బంతికి పేసర్ భువనేశ్వర్ బౌలింగ్‌లో డిక్‌వెల్లా (2) అతడికే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. డిక్‌వెల్లా అవుటైన తర్వాత మునవీర క్రీజులోకి వచ్చాడు. నాలుగు ఓవర్ల ముగిసే సరికి శ్రీలంక వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. ఉపుల్ తరంగ 19, మునవీర పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.

టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్

కొలంబో వేదికగా భారత్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు శ్రీలంక రెగ్యులర్ కెప్టెన్ త‌రంగా తిరిగి జట్టులోకి వచ్చాడు. స్లో ఓవర్ రేట్ కారణంగా తరంగాపై రెండు వన్డేలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

అంతకముందు వర్షం కారణంగా టాస్ ఆల‌స్యమైంది. వర్షం కురవడంతో ఆ జట్టు కెప్టెన్ ఉపుల్‌ తరంగ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. టాస్ వేస్తున్న స‌మ‌యంలోనూ తుంప‌ర్లు ప‌డుతూనే ఉన్నాయి. ఆఖరి వన్డే గెలిచి క్లీన్‌స్వీప్‌ చేయాలని భావిస్తోంది. కాగా, ఈ మ్యాచ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ ఆడడం లేదు.

India vs Sri Lanka: Drizzle delays toss in Colombo, Virat Kohli eyes 5-0 sweep

తల్లి అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆమెను చూసేందుకు ధావన్ ఇప్పటికే భారత్ చేరుకున్నాడు. దీంతో అతడి స్థానంలో రహానేకు చోటు కల్పించారు. ఈ మ్యాచ్‌కు భారత జట్టు నాలుగు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. కేఎల్ రాహుల్‌, హార్దిక్ పాండ్యా, అక్ష‌ర్ ప‌టేల్‌, ధావ‌న్‌ల స్థానాల్లో ర‌హానే, జాద‌వ్‌, భువ‌నేశ్వ‌ర్‌ కుమార్‌, చాహ‌ల్ తుది జట్టులోకి వ‌చ్చారు.

శ్రీలంక జట్టులో ఒక మార్పు మాత్రమే జరిగింది. కుశాల్ మెండిస్ స్థానంలో ఉపుల్ తరంగ జట్టులోకి వచ్చాడు. ఐదు వన్డేల సిరిస్‌లో ఇప్పటికే 4-0తో ఆధిక్యంలో నిలిచిన కోహ్లీసేన క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. మరోవైపు ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని శ్రీలంక భావిస్తోంది.

ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్ ఖాతాలో మరో రికార్డు:

ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన విజయం సాధిస్తే ఓ అరుదైన ఘనత సాధిస్తుంది. ఈ దశాబ్దపు కాలంలో రెండు జట్లను రెండుసార్లు 5-0తో వైట్ వాష్ చేసిన అరుదైన రికార్డుని భారత్ సొంతం చేసుకుంటుంది. 2014లో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 5-0తో చేజిక్కించుకుంది. స్వదేశంలో జరిగిన ఆ వన్డే సిరీస్‌లో భారత్ క్వీన్ స్వీప్ చేసింది.

ఇప్పుడు అదే జట్టుతో వారి దేశంలో క్లీన్ స్వీప్ చేసే అవకాశం భారత్‌కు దక్కింది. గత పదేళ్ల కాలంలో ఇంగ్లండ్‌ను భారత్ జట్టు 5-0తో ఓడించింది. 2008-09 సీజన్‌లో తొలిసారి ఇంగ్లండ్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. 2012-13 సీజన్‌లో మరొకసారి వైట్ వాష్ చేసింది. ఆ తర్వాత మళ్లీ రెండోసారి 5-0 తో క్లీన్ చేసే అవకాశం భారత్ ముందు నిలిచింది.

అడ్డంకిగా మారిన వరుణుడు

శ్రీలంక, భారత్‌ జట్ల మధ్య కొలంబో వేదికగా జరగాల్సిన ఐదో వన్డేకు వరుణుడు అడ్డంకిగా మారాడు. సిరీస్‌లో చివరిదైన ఐదో వన్డే జరుగుతున్న ప్రేమదాస స్టేడియంలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వ‌ర్షంతో గ్రౌండ్ అంతా క‌వ‌ర్లు క‌ప్పి ఉంచారు.

ప్రస్తుతం చినుకులు పడకున్నా మైదానం సిద్ధం చేసేందుకు ఇంకా సమయం పడుతుంది. దీంతో టాస్‌ను ఆలస్యంగా వేయనున్నారు. 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుందని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. మరోవైపు రాత్రి కూడా వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ కూడా తెలిపింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X