న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఢిల్లీ టెస్టు: కోట్లాలో కోహ్లీ తొలి టెస్టు సెంచరీ, విజయ్ 155 ఔట్... భారత్ 371/4

By Nageshwara Rao
Hosts win toss, elect to bat first

హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు తొలిరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 371 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ (156), మురళీ విజయ్‌ (155) సెంచరీలతో చెలరేగడంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 283 పరుగులు భారీ భాగస్వామ్యం అందించారు.

ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ 156, రోహిత్ శర్మ 6 పరుగులతో ఉన్నారు. టాస్ గెలిచిన కోహ్లీసేన బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ (23), పుజారా (23) పరుగులకే ఔటయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన రహానే (1) మరోసారి నిరాశపరిచాడు. శ్రీలంక బౌలర్లలో సందకన్‌ 2, గమాగె, పెరీరా తలో వికెట్‌ తీసుకున్నారు.

మూడో వికెట్ కోల్పోయిన భారత్
ఢిల్లీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. మురళీ విజయ్ (155) పరుగుల వద్ద సందకన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

చెరో 150: డబుల్ సెంచరీ దిశగా విజయ్, కోహ్లీ
ఢిల్లీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా టీమిండియా ఆటగాళ్లు మురళీ విజయ్, కెప్టెన్ విరాట్ కోహ్లీల వీర విహారం కొనసాగుతోంది. సెంచరీలు పూర్తి చేసుకుని జోరుమీదున్న వీరిద్దరూ అదే క్రమంలో 150 పరుగులు కూడా పూర్తి చేసుకుని డబుల్ సెంచరీల దిశగా సాగుతున్నారు. ప్రస్తుతం 85 ఓవర్లు ముగిసే సరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. కోహ్లీ 151, మురళీ విజయ్ 154 పరుగులతో క్రీజులో ఉన్నారు.

వినూత్నంగా కోహ్లీ, మురళీ విజయ్ సంబరాలు
ఢిల్లీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఓపెనర్‌ మురళీ విజయ్‌ (132), విరాట్‌ కోహ్లీ (116) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోరు దిశగా భారత్ పయనిస్తోంది. ప్రస్తుతం 70 ఓవర్లకు గాను భారత్ 2 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. ప్రస్తుతం మురళీ విజయ్‌ (132), విరాట్‌ కోహ్లీ (116) క్రీజులో ఉన్నారు. వీరిద్దరి 220 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

Virat Kohli

వరుసగా మూడో టెస్టు సెంచరీ చేసిన కోహ్లీ
ఢిల్లీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. 110 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో కోహ్లీ ఈ సెంచరీని నమోదు చేశాడు. టీ విరామం అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ ఇన్నింగ్స్ 62వ ఓవర్‌లో సింగిల్ తీసి సెంచరీని నమోదు చేశాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 20వ సెంచరీ కాగా, ఈ సీజన్‌లో వరుసగా మూడోది కావడం విశేషం. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 20 సెంచరీలు నమోదు చేసిన జాబితాలో కోహ్లీ ఐదో స్థానంలో నిలిచాడు. మరోవైపు తన సొంతమైదానమైన ఫిరోజ్ షా కోట్లాలో కోహ్లీకి ఇదే తొలి టెస్టు సెంచరీ. ప్రస్తుతం 65 ఓవర్లకు గాను భారత్ 2 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. కోహ్లీ (105), మురళీ విజయ్ (122) పరుగులతో ఉన్నారు.

టీ విరామానికి భారత్ 245/2
ఢిల్లీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో తొలిరోజు టీ విరామానికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మురళీ విజయ్ (101), కోహ్లీ (94) పరుగులతో ఉన్నారు. అంతకముందు ఓపెనర్ మురళీ విజయ్ సెంచరీని నమోదు చేశాడు. 96 పరుగుల వద్ద సందకన్‌ వేసిన 55.2వ బంతిని బౌండరీకి తరలించి విజయ్‌ సెంచరీని సాధించాడు. గాయం కారణంగా చాన్నాళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన మురళీ విజయ్ సత్తా చాటాడు. వీరిద్దరూ 222 బంతుల్లో 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

Murali vijay

మూడో టెస్టు: మురళీ విజయ్ సెంచరీ
ఢిల్లీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియాలో ఓపెనర్ మురళీ విజయ్ సెంచరీని నమోదు చేశాడు. 164 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో మురళీ విజయ్ సెంచరీని సాధించాడు. టెస్టుల్లో మురళీకి ఇది 11వ సెంచరీ కాగా ఈ సిరిస్‌లో వరుసగా రెండోది కావడం విశేషం. మరో ఎండ్‌లో కోహ్లీ (94) సెంచరీకి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం 57 ఓవర్లకు గాను భారత్ 2 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. మురళీ విజయ్ (101), కోహ్లీ (94) పరుగులతో క్రీజులో ఉన్నారు.

50 ఓవర్లకు భారత్‌ 217/2
ఢిల్లీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా నిలకడగా ఆడుతోంది. 50 ఓవర్లు ముగిసే సరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. ఓపెనర్‌ మురళీ విజయ్‌ (85), కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (82) పరుగులతో క్రీజులో ఉన్నారు. అందివచ్చని బంతులను బౌండరీలకు తరలిస్తూ నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరూ 180 బంతుల్లో 139 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

సెంచరీల వైపు దూసుకెళ్తోన్న విజయ్, కోహ్లీ
ఢిల్లీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా నిలకడగా ఆడుతోంది. భారత ఓపెనర్‌ మురళీ విజయ్‌ (76), టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (74) దూకుడుగా ఆడుతూ సెంచరీలకు చేరువయ్యారు. 45 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 2 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.

Hosts win toss, elect to bat first

హాఫ్ సెంచరీ సెంచరీతో చెలరేగిన కోహ్లీ
ఢిల్లీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా నిలకడగా ఆడుతోంది. కెప్టెన్ కోహ్లీ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. 56 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో విరాట్ కోహ్లీ 56 పరుగులు నమోదు చేశాడు. లంక బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటున్నారు. గమాగే వేసిన 37వ ఓవర్‌లో తొలి రెండు బంతులను బౌండరీకి తరలించి కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. 37 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 2 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ప్రస్తుతం మురళీ విజయ్‌ (61), కోహ్లీ (56) పరుగులతో ఉన్నారు.

5000 పరుగులు నమోదు చేసిన కోహ్లీ

ఫిరోజ్ షా కోట్లా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు, తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లీ 5000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఢిల్లీ టెస్టులో తొలిరోజు 25 పరుగులు పూర్తి చేయగానే కోహ్లీ ఈ ఘనత సాధించాడు. విరాట్‌ కోహ్లీకి ఇది 63వ టెస్టు. ఇన్నింగ్స్‌లో లక్మల్‌ వేసిన 30.3వ బంతిని బౌండరీకి తరలించి కోహ్లీ 5000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా భారత్ తరఫున అత్యంత వేగంగా ఐదు వేల పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. 105 ఇన్నింగ్స్‌ల్లోనే విరాట్ కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు.

లంచ్ విరామానికి భారత్ 116/2

ఢిల్లీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు, తొలి ఇన్నింగ్స్‌లో లంచ్ విరామానికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. విజయ్ 51, కోహ్లీ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు ధావన్ (23), పుజారా (23) పరుగులు చేసి ఔటయ్యారు. శ్రీలంక బౌలర్లలో గమాగె, పెరీరా తలో వికెట్ తీశారు.

మురళీ విజయ్ హాఫ్ సెంచరీ
మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఫిరోజ్ షా కోట్ల మైదానంలో శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టులో భారత ఓపెనర్ విజయ్ అద్భుత హాఫ్ సెంచరీతో అలరించాడు. 67 బంతుల్లో ఏడు ఫోర్లతో కెరీర్‌లో 16వ హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. చాలా రోజుల విరామం తర్వాత జట్టులోకొచ్చిన మురళీ విజయ్ నాగ్‌పూర్ టెస్టులో సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.

Pujara

రెండో వికెట్ కోల్పోయిన భారత్
ఢిల్లీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. గమాగె బౌలింగ్‌లో పుజారా (23) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. అంతకముందు జట్టు స్కోరు 42 పరుగుల వద్ద ధావన్ వికెట్ కోల్పోయిన నేపథ్యంలో అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారా నిలకడగా ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే గమాగె వేసిన బంతిని ఫైనలెగ్ వైపు ఆడబోయిన పుజారా.. సమరవిక్రమ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. మరో ఎండ్‌లో
మురళీ విజయ్ నిలకడగా ఆడుతున్నాడు. 22 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. విజయ్ 35, కోహ్లీ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

20 ఓవర్లకు భారత్‌ 78/1
మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఫిరోజ్ షా కోట్ల మైదానంలో శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్‌ మురళీ విజయ్‌ (30) నిలకడగా ఆడుతున్నాడు. పుజారా (23) ఆచితూచి ఆడుతున్నాడు. ప్రస్తుతం 20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 78 పరుగులు చేసింది.

Dhawan

ధావన్ (23) ఔట్: తొలి వికెట్ కోల్పోయిన భారత్
ఢిల్లీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (23) పరుగుల వద్ద ఔటయ్యాడు. స్పిన్నర్‌ దిల్రువాన్‌ పెరీరా బౌలింగ్‌లో ఫీల్డర్‌ లక్మల్‌‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇది దిల్రువాన్‌ టెస్టు కెరీర్‌లో 100వ వికెట్‌ కావడం గమనార్హం. మరో ఓపెనర్‌ మురళీ విజయ్‌ (18) నిలకడగా ఆడుతున్నాడు. ధావన్ అవుటైన తర్వాత పుజారా క్రీజులోకి వచ్చాడు. 10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది.

వరుస బౌండరీలతో మొదలు పెట్టిన మురళీ విజయ్
ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్‌ మురళీ విజయ్‌ (12) వరుసగా రెండు బౌండరీలతో ఖాతా తెరిచాడు. కాగా, మూడో టెస్టుకి కేఎల్ రాహుల్ స్ధానంలో శిఖర్‌ ధావన్‌‌కు చోటు కల్పించారు. ప్రస్తుతం 5 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. విజయ్ 12, ధావన్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.

India vs Sri Lanka, 3rd Test Day 1 at New Delhi: Hosts win toss, elect to bat first

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంకల మధ్య చివరిదైన మూడో టెస్టు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో శనివారం (డిసెంబర్ 2)న ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

భారత్ Vs శ్రీలంక మూడో టెస్టు స్కోరు కార్డు

నాగ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టులో శ్రీలంకపై ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరిస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. దీంతో చివరి టెస్టులో విజయం సాధించి టెస్టు సిరిస్‌ను 2-0తో కైవసం చేసుకోవాలనే కోహ్లీసేన ఊవిళ్లూరుతోంది.

మరోవైపు శ్రీలంక కూడా చివరి టెస్టుని గెలిచి పరువు నిలుపుకోవాలనే ఉద్దేశంతో ఉంది. ఢిల్లీ టెస్టులో కోహ్లీసేన విజయం సాధిస్తే అరుదైన రికార్డుని సొంతం చేసుకుంటుంది. ఈ విజయంతో టీమిండియా వరుసగా తొమ్మిదో టెస్టు సిరీస్‌ సొంతం చేసుకున్నట్టు అవుతోంది.

ఇప్పటి వరకు టెస్టుల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు మాత్రమే వరుసగా తొమ్మిది టెస్టు సిరీస్‌ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ఆ రికార్డుని కోహ్లీసేన సమం చేస్తుంది. 2005-2008 మధ్య ఆస్ట్రేలియా వరుసగా తొమ్మిది టెస్టు సిరీస్‌ల్లో విజయం సాధించిగా... 1884-1892 మధ్య కాలంలో ఇంగ్లాండ్ కూడా వరుసగా తొమ్మిది టెస్టు సిరిస్‌ల్లో విజయం సాధించింది.

జట్ల వివరాలు:
భారత జట్టు:
విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, మొహమ్మద్ షమీ, మురళీ విజయ్, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, పుజారా, అజింక్య రహానే, శంకర్, కుల్దీప్ యాదవ్.

శ్రీలంక:
దినేష్ చండిమాల్ (కెప్టెన్), డిముత్ కరుణరత్నే, సడేరా సమరావిక్రమ, లాహిరు తిరమన్నే, నిరోషాన్ డిక్వెల్లా, ఏంజెలో మాథ్యూస్, దిల్రువాన్ పెరెరా, జెఫెరీ వెండర్సే, రోషన్ సిల్వా, దషన్ షనాక, సురంగ లక్మల్, లాహిరు గమాగె, లక్ష్మణ సందకన్, ధనంజయ డి సిల్వా.

Story first published: Saturday, December 2, 2017, 17:05 [IST]
Other articles published on Dec 2, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X