న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరో అరుదైన ఘనత: గంగూలీ రికార్డుని సమం చేయనున్న ధోని

By Nageshwara Rao

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌లో మరో అరుదైన మైలురాయిని అందుకోనున్నాడు. తాజాగా ధోని.... మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని సమం చేయనున్నాడు. శ్రీలంకతో మొహాలి వేదికగా బుధవారం (డిసెంబర్ 13)న జరగనున్న రెండో వన్డేలో ధోని ఈ ఘనత సాధించనున్నాడు. 2004లో బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ధోనికి డిసెంబర్ 23తో 13 ఏళ్లు పూర్తి చేసుకోనున్నాడు.

Ganguly Reveals How He Compelled Selectors To Pick Up Kumble

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

 311వ వన్డే ఆడబోతున్న ధోని

311వ వన్డే ఆడబోతున్న ధోని

అంతేకాదు ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డే ధోనికి 310వ వన్డే. ఇక, మొహాలీలో బుధవారం ఆడనున్న వన్డే 311వది కావడం విశేషం. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత్ తరుపున తన కెరీర్‌లో 311 వన్డేలు ఆడాడు. ఇప్పుడు ఆ రికార్డుని ధోని సమం చేయనున్నాడు. ఆ తర్వాత విశాఖపట్నం వేదికగా జరిగే మూడో వన్డేలో ఆ రికార్డుని ధోని అధిగమిస్తాడు.

 నాలుగో స్ధానంలో నిలవనున్న ధోని

నాలుగో స్ధానంలో నిలవనున్న ధోని

తద్వారా భారత్ తరుపున అధ్యధిక వన్డేలాడిన వారి జాబితాలో ధోని నాలుగో స్ధానంలో నిలుస్తాడు. ధోని కంటే ముందు సచిన్ టెండూల్కర్ (463), రాహుల్‌ ద్రవిడ్‌ (344), మహ్మద్‌ అజహరుద్దీన్‌ (334)లు ఉన్నారు. దీంతో పాటు వన్డేల్లో 36 ఏళ్ల ధోని మరో 109 పరుగులు చేస్తే పదివేల క్లబ్‌లో చేరతాడు. ఇప్పటివరకు వన్డేల్లో ధోని 310 వన్డేల్లో 51.8 యావరేజితో 9,891 పరుగులు చేశాడు.

 వయసు పెరుగుతున్నప్పటికీ

వయసు పెరుగుతున్నప్పటికీ

ఇప్పటివరకు 10 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలు చేసిన ధోని

ఇందులో 10 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే వయసు పెరుగుతున్నప్పటికీ తనలో క్రికెట్‌ ఆడే సత్తా తగ్గలేదని ధోని నిరూపిస్తూనే ఉన్నాడు. ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో 29 పరుగులకే 7 వికెట్లు నష్టపోయి కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సంగతి తెలిసిందే. భారత జట్టు 50 పరుగులకే ఆలౌట్‌ కాకుండా హాఫ్ సెంచరీతో రాణించి 112 పరుగులకు చేర్చాడు.

 మొహాలీ వేదికగా బుధవారం రెండో వన్డే

మొహాలీ వేదికగా బుధవారం రెండో వన్డే

తొలి వన్డేలో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 బంతుల్లో 65 పరుగులు నమోదు చేశాడు. కాగా, మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే మొహాలీ వేదికగా బుధవారం జరగనుంది. తొలి వన్డేలో శ్రీలంక విజయం సాధించడంతో మూడు వన్డేల సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య జరగనున్న చివరి వన్డేకి విశాఖపట్నం ఆతిథ్యమివ్వనుంది.

Story first published: Wednesday, December 13, 2017, 10:31 [IST]
Other articles published on Dec 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X