న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండో వన్డేలో భారత్ విజయం: డబుల్‌తో చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

By Nageshwara Rao
Rohit Sharma

హైదరాబాద్: మొహాలి వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో తొలి వన్డేలో ఎదురైన ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. 393 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది.

ICC Champions Trophy : Rohit Sharma near dismissal on 50 left wife Ritika breathless | Oneindia news

శ్రీలంక వెటరన్ క్రికెటర్ మాథ్యూస్‌ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా లంకను ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. 122 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో ఏంజెలో మాథ్యూస్ (111 నాటౌట్)గా నిలిచాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ చెప్పుకోదగిన స్కోర్ చేయలేదు. భారత బౌలర్లలో చాహల్ 3, బుమ్రా 2, సుందర్, పాండ్యా, భువనేశ్వర్ తలో వికెట్ తీసుకున్నారు.

తాజా విజయంతో సిరీస్‌ను 1-1తో స‌మం చేయడంతో పాటు తొలి వన్డేలో భారత్ జట్టుకు ఎదురైన ఘోర ఓటమికి బదులు తీర్చుకుంది. ఈ సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే ఈ నెల 17వ తేదీన ఆదివారం వైజాగ్‌లో జరగనుంది. అంతకముందు టాస్‌ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 392 పరుగులు చేసింది.


భారత్ ఇన్నింగ్స్ సాగిందిలా:

శ్రీలంక విజయ లక్ష్యం 393
మొహాలి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 392 పరుగులు చేసింది. దీంతో శ్రీలంకకు 393 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్
బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ (208 నాటౌట్) చెలరేగగా, శ్రేయాస్ అయ్యర్ (88), ధావన్ (68) పరుగులు చేశారు.

రోహిత్ శర్మ డబుల్ సెంచరీ
శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ డబుల్ సెంచరీ సాధించాడు. శ్రీలంక బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 151 బంతుల్లోనే 13 ఫోర్లు, 12 సిక్సర్లతో వన్డేల్లో మూడో డబుల్ సెంచరీ చేశాడు. తద్వారా వన్డే క్రికెట్ చరిత్రలోనే మూడో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.

గతంలో రోహిత్‌శర్మ ఆస్ట్రేలియా, శ్రీలంకపై డబుల్ సెంచరీలు చేశాడు. ఇదే శ్రీలంకపై కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో 264 పరుగులు చేశాడు. వన్డేల్లో ఇప్పటికీ ఇదే అత్యధిక స్కోరుగా ఉంది. కాగా, ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ 50 ఓవర్ల పాటు క్రీజులో ఉండి 153 బంతుల్లో 13 ఫోర్లు, 12 సిక్సులతో 208 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

మూడో వికెట్ కోల్పోయి భారత్
శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ముడో వికెట్ కోల్పోయింది. పెరీరా బౌలింగ్‌లో ధోని (7) పరుగుల వద్ద ఎల్బీగా వెనుదిరిగాడు. ధోని ఔటైన తర్వాత క్రీజులోకి హార్దిక్ పాండ్యా వచ్చాడు. ప్రస్తుతం 48 ఓవర్లకు గాను భారత్ 3 వికెట్లు కోల్పోయి 360 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ (183), పాండ్యా (1) పరుగుతో ఉన్నారు.

రెండో వికెట్ కోల్పోయిన భారత్
శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా రెండో వికెట్ చేజార్చుకుంది. పెరీరా బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్ (88) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. అయ్యర్ ఔటైన తర్వాత క్రీజులోకి ధోని వచ్చాడు. ప్రస్తుతం 46 ఓవర్లకు గాను భారత్ 2 వికెట్లు నష్టపోయి 329 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (161), ధోని పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.

రెండో వన్డేలో రోహిత్‌ శర్మ 150
శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్‌ శర్మ లంక బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. సెంచరీ అనంతరం రోహిత్‌ శర్మ మరింత దూకుడుగా ఆడుతున్నాడు. లక్మల్‌ బౌలింగ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 44 ఓవర్‌లో నాలుగు సిక్సులు బాదిన రోహిత్ శర్మ ప్రదీప్ వేసిన 45వ ఓవర్‌లో మరో రెండు సిక్సులు బాదాడు. దీంతో 133 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేశాడు. ప్రస్తుతం భారత్‌ 45 ఓవర్లకు వికెట్‌ కోల్పోయి 321 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (153), శ్రేయాస్‌ అయ్యర్‌ (88) పరుగులతో క్రీజులో ఉన్నారు.

రోహిత్ శర్మ సెంచరీ

శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ నమోదు చేశాడు. 112 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో సెంచరీ సాధించాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 35వ హాఫ్ సెంచరీ. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు చక్కటి శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 115 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ప్రస్తుతం 42 ఓవర్లకు గాను ఒక వికెట్ నష్టానికి 268 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ (111), అయ్యర్ (80) పరుగులతో ఉన్నారు.

శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీ
శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ధావన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయ‌స్ అయ్య‌ర్ (61) కూడా హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ప్రస్తుతం 39 ఓవర్లకు గాను ఒక వికెట్ నష్టానికి 236 పరుగులు చేసింది.

సెంచరీకి చేరువలో రోహిత్ శర్మ
శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఆటగాళ్లు నిలకడగా ఆడుతున్నారు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (92) సెంచరీకి చేరువలో ఉన్నాడు. మరో ఎండ్‌లో యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ (38) హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. 35 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 204 పరుగులు చేసింది.

రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ
శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్‌శర్మ (50) హాఫ్ సెంచరీ సాధించాడు. పతిరన వేసిన 23.5వ బంతికి సింగిల్‌ తీసి వన్డేల్లో 35వ హాఫ్ సెంచరీని రోహిత్ శర్మ నమోదు చేశాడు. మరో ఎండ్‌లో యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ (8) పరుగులతో క్రీజులో ఉన్నాడు. 24 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ ఒక వికెట్ నష్టానికి 127 పరుగులు చేసింది.

తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ అనంతరం పతిరానా బౌలింగ్‌లో లాహిరు తిరుమన్నేకి క్యాచ్ ఇచ్చి శిఖర్ ధావన్ (68) పెవిలియన్‌కు చేరాడు. ధావన్ ఔటైన తర్వాత క్రీజులోకి శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం 25 ఓవర్లకు గాను భారత్ ఒక వికెట్ నష్టానికి 133 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ (52), శ్రేయాస్ అయ్యర్ (11) పరుగులతో ఉన్నారు.

శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ
శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ హాఫ్ సెంచరీ సాధించాడు. 47 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 23వ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అఖిల ధనంజయ వేసిన 15వ ఓవర్‌ మూడో బంతికి రెండు పరుగులు తీసి హాఫ్ సెంచరీ సాధించాడు.

Dhawan

అంతకుముందు నువాన్‌ ప్రదీప్‌ వేసిన 13 ఓవర్లో మూడు ఫోర్లతో 15 పరుగులు రాబట్టాడు. దీంతో భారత్‌ 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. మరో ఎండ్‌లో రోహిత్‌ శర్మ(23) నిలకడగా ఆడుతున్నాడు. తొలి వన్డేలో ధావన్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే.

10 ఓవర్లకు భారత్ 33/0
మొహాలి వేదికగా లంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతానికి 10 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ వికెట్ కోల్పోకుండా 33 పరుగులు చేసింది. రోహిత్‌శర్మ (15), శిఖర్‌ ధావన్‌ (17) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వన్డేలో ఘోరంగా ఓటమి పాలుకావడంతో రెండో వన్డేలో భారత్ ఆచితూచి ఆడుతోంది.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక

భారత్-శ్రీలంక జట్ల మధ్య మొహాలి వేదికగా రెండో వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్‌‌లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. కుల్దీప్ స్థానంలో యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ వన్డే అరంగేట్రం చేశాడు.

అతడికి భారత జట్టు కోచ్ రవిశాస్త్రి టీమిండియా టోపీ ఇచ్చి జట్టులోకి ఆహ్వానించాడు. శ్రీలంక మాత్రం ధర్మశాలలో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది. తొలి వన్డేలో భారత్ ఓడటంతో రెండో వన్డేలో ఎలాగైనా గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. మరోవైపు తొలి వన్డేలో ఘన విజయం సాధించిన లంక అదే ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది.

మొహాలీలో జరిగిన గత నాలుగు మ్యాచ్‌ల్లో రెండోసారి బ్యాటింగ్‌ చేసిన జట్లే గెలవడంతో శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది.

జట్ల వివరాలు:
టీమిండియా: రోహిత్‌(కెప్టెన్‌), ధవన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, మనీష్ పాండే, దినేశ్‌ కార్తీక్‌, ధోనీ, పాండ్యా, భువనేశ్వర్‌, వాషింగ్టన్ సుందర్‌‌, బుమ్రా, చాహల్‌.

శ్రీలంక: తరంగ, గుణతిలక, తిరిమన్నె, మాథ్యూస్‌, గుణరత్నె, డిక్‌వెలా, తిసార పెరీరా(కెప్టెన్‌), సచిత్ పతిరానా, లక్మల్‌, ప్రదీప్‌, ధనంజయ.

Story first published: Wednesday, December 13, 2017, 19:48 [IST]
Other articles published on Dec 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X