న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కటక్‌లో తొలి టీ20: సీనియర్లకు విశ్రాంతి, కెప్టెన్‌గా రోహిత్ శర్మ

By Nageshwara Rao
India vs Sri Lanka 1st T20I team news, playing XIs and pitch conditions

హైదరాబాద్: భారత్-శ్రీలంక జట్ల మధ్య వన్డే సిరిస్ ముగిసింది. ఇప్పుడు ఇరు జట్ల టీ20 సమరానికి సిద్ధమయ్యాయి. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య బుధవారం కటక్‌లోని బారబతి స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.

<strong>తొలి టీ20 కోసం ఒరిస్సాకు చేరుకున్న భారత్-శ్రీలంక జట్లు</strong>తొలి టీ20 కోసం ఒరిస్సాకు చేరుకున్న భారత్-శ్రీలంక జట్లు

సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్, రహానె, భువనేశ్వర్ కుమార్ తదితరులకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో యువ క్రికెటర్లతో నిండిన టీ20 జట్టుకు రోహిత్ శర్మ నేతృత్వం వహించనున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనను దృష్టిలో పెట్టుకుని సీనియర్ క్రికెటర్లకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు.

1-0తో టెస్టు సిరిస్‌ని... 2-1 తేడాతో వన్డే సిరీస్‌ని చేజార్చుకున్న శ్రీలంక జట్టు కనీసం ఈ టీ20 సిరిస్‌నైనా గెలిచి పరువు నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇదిలా ఉంటే జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ.. గత కొద్దినెలలుగా రిజర్వ్ బెంచ్‌కే పరిమితమవుతున్న కేఎల్ రాహుల్ ఓపెనర్ ధావన్‌ స్థానంలో తుది జట్టులోకి రావొచ్చు.

India vs Sri Lanka 1st T20I team news, playing XIs and pitch conditions

దీంతో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశం ఉంది. ఇటీవల ముగిసిన వన్డే సిరిస్‌లో రెండు హాఫ్ సెంచరీలతో అద్భుత ప్రదర్శన చేసిన శ్రేయాస్ అయ్యర్‌ను మూడో స్ధానంలో దింపే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాతి స్ధానాల్లో మనీశ్ పాండే, కార్తీక్ వచ్చే అవకాశం ఉంది.

ఇక, భారత బౌలింగ్ విషయానికి వస్తే కొన్ని మార్పులు చోటు చేసుకోనున్నాయి. టీ20 సిరిస్‌లో చోటు దక్కించుకున్న హైదరాబాదీ మహ్మద్ షిరాజ్, ఐపీఎల్‌లో యార్కర్లతో మెప్పించిన బసిల్ థంపీ, జయదేవ్ ఉనద్కత్‌లలో ఎవరు బుమ్రాతో కలిసి కొత్త బంతిని పంచుకుంటారో తెలియాల్సి ఉంది.

మరో వైపు అటు బ్యాట్‌తోనూ ఇటు బౌలింగ్‌లో సత్తా చాటుతున్న వాషింగ్టన్ సుందర్‌కు చోటు కల్పిస్తారో లేదో తెలియాల్సి ఉంది. ఇక, స్పిన్నర్లుగా కుల్దీప్, చాహల్‌ స్థానాలకి ఢోకా లేదు. ప్రస్తుతం జట్టులో తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో యువ క్రికెటర్లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి మరి.

పిచ్ పరిస్థితి:
2015లో ఇదే స్టేడియంలో ఓ టీ20 మ్యాచ్ జరిగింది. ఈ స్టేడియంలో తక్కువ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది.

జట్ల అంచనా:
ఇండియా:
రోహిత్ శర్మ (c), కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, దినేశ్ కార్తీక్, ధోని, హార్ధిక్ పాండ్యా, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, జయదేవ్

శ్రీలంక:
తిసారా పెరీరా(c), నిరోషాన్ డిక్వెల్లా, ఉపుల్ తరంగ, కుశాల్ జనిత్ పెరీరా, ఏంజెలో మాథ్యూస్, అసేలా గుణరత్న, దాసున్ షనక, పతిరన, నువాన్ ప్రదీప్, విశ్వా ఫెర్నాడో, చమీరా

Story first published: Tuesday, December 19, 2017, 18:00 [IST]
Other articles published on Dec 19, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X