న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒక్క మ్యాచ్‌తో ఇన్ని రికార్డులా..: మొహాలీ మాయ చేయనుందా?

 10 Reasons to Watch the Second ODI at Mohali

హైదరాబాద్: భారత్-శ్రీలంకల మధ్య డిసెంబరు 12వ తేదీన జరిగిన వన్డేలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అంతకుముందు టెస్ట్ సిరీస్ గెలిచిన విజయోత్సాహంలో మునిగిపోయిన టీమిండియా పరాజయం వచ్చే వరకు తేరుకోలేకపోయింది. బుధవారం శ్రీలంకతో వన్డే మ్యాచ్ తలపడనున్న నేపథ్యంలో మొహాలీ స్టేడియం వేదికైంది.

ఆదివారం జరిగిన తొలి వన్డేలో విజయంతో ఉన్న శ్రీలంక ఎంతైతే ఉత్సాహంతో ఉందో.. అదే స్థాయిలో ఆఖరి మ్యాచ్‌లా కాకూడదేనే పట్టుదలతో భారత్ ఉంది. అలా అనుకోవడానికి అవకాశాలు లేకపోలేదు. ఇప్పటివరకు మొహాలీలో భారత్ ఆడిన మ్యాచ్‌లు 14. వీటిలో భారత్ 9 మ్యాచ్‌లను గెలిచింది.

కాగా ఈ మ్యాచ్‌లో గెలిచిన స్కోరును బట్టి టీమిండియా ఆటగాళ్ల ఖాతాల్లో పలు రికార్డులు వచ్చి చేరనున్నాయి.

మచ్చుకు మరికొన్ని..:

* ధోని ఇంకా 109 పరుగులు చేస్తే వన్డేల్లో 10,000 పరుగుల క్లబ్‌లో చేరతాడు.

* వన్డేల్లో 4000 పరుగుల క్లబ్‌లో చేరడానికి శిఖర్‌ ధావన్‌ ఇంకా 130 పరుగుల దూరంలో ఉన్నాడు.

* వన్డేల్లో 3000 పరుగులు పూర్తి చేయడానికి రహానేకు కావాల్సిన పరుగులు ఇంకా 178.

* ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును సమం చేయడానికి భారత్‌కు ఇంకో శతకం అవసరం. 1998లో భారత్‌ 18 వన్డే సెంచరీలను నమోదు చేసింది. ప్రస్తుతం ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో టీమిండియా 17 శతకాలు చేసింది. మరో సెంచరీ చేస్తే ఆ రికార్డు సమం కానుంది.

* ఈ ఏడాదిలో వన్డేల్లో అత్యధిక వికెట్లు(36 వికెట్లు) తీసిన మూడో ఆటగాడిగా లియామ్‌ ప్లంకెట్‌(ఇంగ్లండ్‌)తో పాటు బుమ్రా కొనసాగుతున్నాడు. ఆ రికార్డును అధిగమించడానికి బుమ్రాకు ఈ వన్డే ద్వారా మరో అవకాశం రానుంది.

* వన్డేల్లో ఈ ఏడాది 30 వికెట్లు తీసి 500 పరుగులు చేసిన రికార్డుకు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మరో రెండు వికెట్ల దూరంలో ఉన్నాడు. ఈ రికార్డు సాధిస్తే పాండ్యా భారత్‌ నుంచి కపిల్‌దేవ్‌ తర్వాత రెండో ఆటగాడిగా నిలుస్తాడు

* 2017లో అంతర్జాతీయ క్రికెట్‌లో 50 వికెట్లు తీసిన రికార్డుకు చేరువకావడానికి బుమ్రాకు మరో రెండు వికెట్లు అవసరం. ఈ రికార్డు సాధిస్తే అశ్విన్‌(64), జడేజా(62) తర్వాత భారత్‌ నుంచి మూడో ఆటగాడిగా బుమ్రా నిలువనున్నాడు.

* శ్రీలంక ఆటగాళ్లలో లంక బౌలర్‌ లక్మల్‌ ఇంకో మూడు వికెట్లు తీస్తే.. 200 అంతర్జాతీయ వికెట్లు తీసిన రికార్డుకు చేరువవుతాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, December 13, 2017, 15:36 [IST]
Other articles published on Dec 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X