న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: దక్షిణాఫ్రికాకు భారీ షాక్.. గాయం కారణంగా తప్పుకున్నకేశవ్‌ మహారాజ్!!

IND vs SA,2nd Test : Keshav Maharaj Ruled Out Of 3rd Test !
India vs South Africa: Keshav Maharaj Ruled Out Of Third Test, George Linde To Replaced

పుణె: మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పుణె వేదికగా భారత్‌తో జరిగిన రెండో టెస్టులో ఘోర పరాజయం చవిచూసిన దక్షిణాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్‌, భారత సంతతి ఆటగాడు కేశవ్‌ మహారాజ్ భుజం గాయం కారణంగా మూడో టెస్టు నుంచి తప్పుకున్నాడు. కేశవ్‌ స్థానంలో జార్జ్‌ లిండేను తుది జట్టులోకి తీసుకోనున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు పేర్కొంది.

బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ.. కార్యదర్శిగా అమిత్‌ షా కుమారుడుబీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ.. కార్యదర్శిగా అమిత్‌ షా కుమారుడు

రెండో టెస్టు రెండో రోజు ఆటలో ఫీల్డింగ్‌ చేస్తుండగా కేశవ్‌ మహారాజ్ కుడి భుజానికి గాయమైంది. నొప్పితోనే బ్యాటింగ్‌ కొనసాగించి కెరీర్‌లో తొలి అర్ధ శతకం చేసాడు. ఇక నాలుగో రోజు ఆట ఆరంభానికి ముందు అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కొద్ది రోజులు (రెండు నుంచి మూడు వారాలు) విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో అతడు మూడో టెస్టుకు దూరమయ్యాడు.

'ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌లో కేశవ్‌ మహారాజ్ కుడి భుజం కండరానికి గాయమైందని తేలింది. అతడు తిరిగి కోలుకోవటానికి మూడు వారాల సమయం పడుతుంది' అని దక్షిణాఫ్రికా జట్టు వైద్యుడు పేర్కొన్నాడు. కేశవ్‌ స్థానంలో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ జార్జ్‌ లిండేను రాంచీ టెస్టుకు ఎంపిక చేశారు. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన దక్షిణాఫ్రికాకు కేశవ్‌కు గాయం కావడం చేదువార్తే. కేశవ్‌ బంతితో కన్నా బ్యాట్‌తోనే స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో కష్టాల్లో పడిన జట్టును అర్ధ శతకం (72)తో ఆదుకున్నాడు. సఫారీ బ్యాట్స్‌మెన్‌లో అతడిదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.

రెండో ఇన్నింగ్స్‌లో సఫారీ జట్టు 189 పరుగులకే కుప్పకూలింది. దీంతో దక్షిణాఫ్రికాపై కోహ్లీసేన ఇన్నింగ్స్‌ 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ మూడు టెస్టుల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. డబుల్ సెంచరీ చేసిన విరాట్‌ కోహ్లీకి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది. సిరీస్‌లో ఆఖరిదైన మూడో టెస్టు అక్టోబర్‌ 19న రాంచిలో ప్రారంభమవుతుంది.

Story first published: Monday, October 14, 2019, 9:36 [IST]
Other articles published on Oct 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X