న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

150 kmph వేగంతో బౌలింగ్‌ చేసే భారత బౌలర్‌ని చూశారా?

India vs South Africa: ‘Don’t see many who bowl at 150 kmph’ - Lance Klusener’s massive praise of young Indian bowler

హైదరాబాద్: ప్రపంచ క్రికెట్‌లో 150 kmph వేగంతో బౌలింగ్‌ చేసే భారత బౌలర్‌ని గతంలో ఎన్నడూ చూడలేదని భారత పర్యటనలో దక్షిణాఫ్రికా జట్టుకు అసిస్టెంట్‌ బ్యాటింగ్‌ కోచ్‌‌గా ఎంపికైన లాన్స్‌ క్లూసెనర్‌ తెలిపాడు. ఈ నేపథ్యంలో టీమిండియా యువ పేసర్ నవదీప్ షైనీపై క్లూసెనర్ ప్రశంసల వర్షం కురిపించాడు.

భారత పర్యటన కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు మాజీ క్రికెట్ దిగ్గజం లాన్స్ క్లూసెనర్‌ను అసిస్టెంట్‌ బ్యాటింగ్‌ కోచ్‌‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. గతంలో క్లూసెనర్ ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)తో కలిసి పనిచేశాడు. ఈ సందర్భంగా ఢిల్లీలోని పలువురు యువ క్రికెటర్లతో పని చేశాడు.

<strong>పాక్ ఆటగాళ్లకు షాక్.. ఇక నుంచి బిర్యానీ బంద్!!</strong>పాక్ ఆటగాళ్లకు షాక్.. ఇక నుంచి బిర్యానీ బంద్!!

నవదీప్ షైనీలో ఉన్న ప్రతిభ

నవదీప్ షైనీలో ఉన్న ప్రతిభ

ఈ సమయంలో ఢిల్లీ తరుపున ఆడుతోన్న నవదీప్ షైనీలో ఉన్న ప్రతిభను క్లూసెనర్ గుర్తించాడు. ఇటీవలే వెస్టిండిస్‌తో ముగిసిన టీ20 సిరిస్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన నవదీప్ షైనీ బౌలింగ్‌ తనను ఏమీ ఆశ్చర్యానికి గురి చేయడం లేదని క్లూసెనర్‌ చెప్పుకొచ్చాడు.

క్లూసెనర్ మాట్లాడుతూ

క్లూసెనర్ మాట్లాడుతూ

ఈ సందర్భంగా క్లూసెనర్ మాట్లాడుతూ "నవదీప్ షైనీని గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది. 150 kmph వేగంతో బౌలింగ్‌ చేసే భారత బౌలర్‌ని గతంలో ఎన్నడూ చూసిండరు. షైనీది ఒక అద్భుతమైన బౌలింగ్‌ యాక్షన్‌. అతని యాక్షన్‌ చాలా క్లియర్‌గా ఉంటుంది. ఫిట్‌గా కూడా ఉంటాడు" అని చెప్పుకొచ్చాడు.

150 kmph వేగంతో

150 kmph వేగంతో

"నేను అతనితో ఎప్పుడు మాట్లాడినా 150 kmph వేగంతో బౌలింగ్‌ వేసందుకే మొగ్గుచూపేవాడు" అని క్లూసెనర్‌ అన్నాడు. ఇటీవలే ముగిసిన వెస్టిండిస్ పర్యటనలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన నవదీప్ షైనీ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దీంతో ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్‌కు ఎంపికయ్యాడు.

అక్టోబర్ 2 నుంచి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరిస్

అక్టోబర్ 2 నుంచి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరిస్

అయితే, అక్టోబర్ 2 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు మాత్రం అతడు ఎంపికవ్వలేదు. రాబోయే రోజుల్లో టీమిండియా తరుపున టెస్టుల్లో సైతం రాణించాలనేది అతడి కోరిక. దీనిపై షైనీ మాట్లాడుతూ "టెస్టు ఫార్మాట్‌లో మా బౌలింగ్‌ యూనిట్‌ చాలా బలంగా ఉంది. విండిస్‌తో సిరీస్‌ జరిగినప్పుడు ఈ విషయాన్ని నేను గమనించా. నాకు టెస్టు జట్టులో చోటు దక్కాలంటే మరింత శ్రమించాల్సి ఉంది" అని షైనీ తెలిపాడు.

Story first published: Tuesday, September 17, 2019, 17:23 [IST]
Other articles published on Sep 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X