న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SA Tour of India: ఒమిక్రాన్ వేళ... భారత పర్యటనకు సిద్ధం అంటున్న దక్షిణాఫ్రికా, డిసెంబర్ 17 తొలి టెస్టు

India vs South Africa: Cricket South Africa says it is all set to tour India amid the omicron outbreak, first test to begin on December 17th

డిసెంబర్ 17వ తేదీ నుంచి భారత్‌లో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు పర్యటిస్తుంది. అయితే కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్‌తో ఈ పర్యటన జరుగుతుందా లేదా అనే మీమాంస నెలకొంది. మొత్తంగా సౌతాఫ్రికా టూర్‌‌పై నీలినీడలు అలుముకున్నాయి. కానీ భారత పర్యటనకు తమ జట్టు సిద్ధంగా ఉందని టెస్టు మరియు వన్డే కెప్టెన్లు టెంబా బావుమా, డీన్ ఎల్గర్‌లు ప్రకటించారు. కచ్చితంగా భారత్‌ పర్యటనలో పాల్గొంటామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు బయో సెక్యూర్ జాగ్రత్తలపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.

దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వైరస్ బయటపడటంతో సౌతాఫ్రికా టూర్‌పై అందరికీ అనుమానాలు నెలకొన్నాయి. సౌతాఫ్రికా క్రికెట్ జట్టు భారత పర్యటన చేస్తుందని రద్దు విషయమైతే ఇప్పటి వరకు చర్చకు రాలేదని బీసీసీఐ తెలిపింది. డిసెంబర్ 17వ తేదీ నుంచి తొలి టెస్టు జరగనుంది. కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా జట్టు 8 సార్లు బయోబబుల్‌లో వాతావారణంలో ఉండాల్సి వచ్చింది.

ఇంగ్లాండ్, శ్రీలంక, పాకిస్తాన్‌‌లతో సిరీస్‌ కోసం బయోబబుల్‌లో సౌతాఫ్రికా జట్టు గడిపింది. తమ ఆటగాళ్ల ఆరోగ్య విషయంలో ఎక్కడా రాజీపడేది లేదని, అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని క్రికెట్ సౌతాఫ్రికా చీఫ్ మెడికల్ ఆఫీసర్ షోయబ్ మంజ్రా తెలిపారు. బయోబబుల్‌లో ఉండటం చాలా కష్టమని చెప్పుకొచ్చారు. క్రికెట్ వాతావరణంను పరిరక్షించడం తమ ముందున్న లక్ష్యమని అందుకే ఆటగాళ్లు బయటకు తిరగకుండా హోటల్ గదికే పరిమితమవుతారని మంజ్రా చెప్పారు.

బయోబబుల్‌ వాతావరణంలో ఉండి క్రికెట్ ఆడటం అంటే సవాలుతో కూడుకున్న పని అని కెప్టెన్ వన్డే కెప్టెన్ బావుమా చెప్పాడు. సుదీర్ఘంగా హోటల్‌ గదులకే పరిమితం అవడం నుంచి ప్రాక్టీస్‌ చేయడం వరకు మొత్తం మారిందని చెప్పారు. వికెట్స్ పడిన సమయంలో ఇతర ఆటగాళ్లకు హైఫై ఇవ్వడం కూడా ఇప్పుడు కుదరదని చెప్పాడు. బయోబబుల్ వాతావరణంలో ఉండి ఆట ఆడటం చాలా కష్టమని కానీ ఇది సాధ్యమయ్యేలా చేసిన క్రికెట్ సౌతాఫ్రికాను అభినందించాల్సిందే అని చెప్పాడు. బయోబబుల్‌లో అత్యుత్తమమైన నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయని కొనియాడాడు బావుమా. ఆటగాళ్ల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత క్రికెట్ సౌతాఫ్రికా బోర్డు ఇస్తోందని చెప్పారు.

ఇక టెస్టు క్రికెట్ కెప్టెన్ డీన్ ఎల్గార్ మాట్లాడుతూ... ఒక ఏడాదిగా బయోబబుల్ వాతావరణంలో ఉన్నామంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని చెప్పాడు. అయితే క్రికెట్ ఆడాలన్న ఆంక్ష ఉన్న వారెవరైనా సరే బయో బబుల్ ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటాడని చెప్పాడు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో కోవిడ్ సోకిన వారికి బయోబబుల్ ప్రాముఖ్యత తెలిసి ఉంటుందని చెప్పాడు. బయోబబుల్‌ వాతావరణం ఆటగాడిని మానసికంగా వేధిస్తుందని అయినప్పటికీ తమ జట్టు మంచి ఫలితాలను ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. అయితే ఇంకా బయోబబుల్‌లో ఎంతకాలం ఉంటామనేది ఇంకా చెప్పలేమన్నాడు. అయితే విదేశీ పర్యటనలకు వెళ్లాల్సి వస్తే మాత్రం ఆటగాళ్ల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యతను తమ బోర్డు ఇస్తోందని గుర్తు చేశాడు డీన్ ఎల్గార్.

Story first published: Wednesday, December 1, 2021, 19:03 [IST]
Other articles published on Dec 1, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X