న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs South Africa: మూడో టెస్టు.. సిక్స్ కొట్టి తొలి డబుల్ సెంచరీ చేసిన రోహిత్!!

India vs South Africa 3rd Test: Rohit Sharma got to his maiden Test double hundred


రాంచీ: రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఓపెనర్‌ 'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మ (212; 255 బంతుల్లో 28x4, 6x6) డబుల్‌ సెంచరీ చేసాడు. 249 బంతుల్లో 28 ఫోర్లు, 5 సిక్సులతో ద్విశతకం సాధించాడు. లంచ్‌ విరామానికి ముందు 199 పరుగులతో ఉన్న రోహిత్.. సిక్స్ కొట్టి డబుల్ సెంచరీ పూర్తిచేశాడు. మరో భారీ సిక్సర్ బాదిన అనంతరం రోహిత్ పెవిలియన్ చేరాడు. రోహిత్‌కు ఇది టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ. వ‌న్డేల్లో మూడు డ‌బుల్ సెంచ‌రీలు చేసిన విషయం తెలిసిందే.

లంచ్ బ్రేక్: రోహిత్ 199.. భారత్‌ స్కోర్ 357/4

తొలి డబుల్ సెంచరీ:

తొలి డబుల్ సెంచరీ:

రోహిత్‌ శర్మ ఈ సిరీస్‌లోనే టెస్టుల్లో ఓపెనర్‌గా మారిన విషయం తెలిసిందే. విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో రోహిత్ (176, 127) రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు చేసాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా 203 పరుగులతో విజయం సాధించింది. ఇక రెండో టెస్టులో 14 పరుగులే చేసాడు. అయినా భారత్ ఇన్నింగ్స్‌ 137 పరుగులతో గెలుపొందింది. మూడో మ్యాచ్‌లో ఏకంగా ద్విశతకం చేయడం విశేషం. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎవరికీ సాధ్యంకాని విధంగా రోహిత్‌ మూడు సార్లు (264, 209, 208నాటౌట్‌) డబుల్‌ సెంచరీలు చేసాడు.

నాలుగో వికెట్‌కు 267 పరుగులు:

నాలుగో వికెట్‌కు 267 పరుగులు:

ఓవర్‌నైట్‌ స్కోర్‌ 224/3తో రెండో రోజు ఆటను కొనసాగించిన రోహిత్‌, వైస్‌కెప్టెన్‌ అజింక్య రహానే (115; 192 బంతుల్లో 17x4, 1x6) ధాటిగా ఆడారు. తొలిరోజు మెరుపులు మెరిపించిన రోహిత్, రహానే జంట మొదటి సెషన్‌లోనూ వేగంగా పరుగులు చేశారు. ఈ క్రమంలో రోహిత్ 199 బంతుల్లో 150 పరుగులు చేస్తే.. రహానే 172 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఈ జోడి నాలుగో వికెట్‌కు 267 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.

 భారీ స్కోర్‌ దిశగా భారత్:

భారీ స్కోర్‌ దిశగా భారత్:

భారత స్కోర్‌ 300 దాటాక రహానే ఔటయ్యాడు. లిండే బౌలింగ్‌లో రహానే.. క్లాసెన్‌ చేతికి చిక్కాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా హిట్‌మ్యాన్‌కు అండగా నిలిచాడు. దీంతో లంచ్‌ విరామానికి భారత్‌ 357/4తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. లంచ్ అనంతరం రోహిత్ డబుల్ సెంచరీ చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో సాహా (6), జడేజా (17) ఉన్నారు. భారత్ 92 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు భారీ స్కోర్‌ దిశగా కొనసాగుతోంది.

 తొలి రోజు 224 పరుగులు:

తొలి రోజు 224 పరుగులు:

తొలి రెండు టెస్టుల తరహాలోనే మూడో మ్యాచ్‌లోనూ తొలి రోజు భారత్‌ పట్టు నిలబెట్టుకుంది. శనివారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 58 ఓవర్లలో 3 వికెట్లకు 224 పరుగులు చేసింది. వర్షం, వెలుతురు లేమి కారణంగా టీ విరామం తర్వాత కొద్ది సేపటికే అంపైర్లు ఆటను నిలిపివేశారు. దాంతో మరో 32 ఓవర్ల ఆటను కోల్పోవాల్సి వచ్చింది. మయాంక్‌ అగర్వాల్ (10), పుజారా (0), విరాట్ కోహ్లీ (12) తక్కువ పరుగులకే వెనుదిరిగారు.

Story first published: Sunday, October 20, 2019, 13:05 [IST]
Other articles published on Oct 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X