న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దక్షిణాఫ్రికాతో భారత్‌ రెండో టీ20: పంత్‌, ధావన్‌లపై ఒత్తిడి.. డికాక్‌పైనే భారం

India vs South Africa 2nd T20I: India predicted XI, Opening combination could be tweaked, Mohali weather forecast

మొహాలి: హోమ్‌సీజన్‌ను గ్రాండ్‌గా ప్రారంభిద్దామనుకున్న టీమిండియాకు వరుణుడు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలి టీ20 మ్యాచ్‌ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడంతో భారత్, దక్షిణాఫ్రికా పోరు రెండు మ్యాచ్‌ల సిరీస్‌కే పరిమితమైంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక మ్యాచ్‌ పూర్తిగా వర్షార్పణం కాగా కీలకమైన రెండో మ్యాచ్‌కు మొహాలీ వేదిక కానుంది. బుధవారం జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు సిరీస్‌ కోల్పోయే ప్రమాదం ఉండదు కాబట్టి విజయమే లక్ష్యంగా పోరాడనున్నాయి.

<strong>'మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ధోనీ, కోహ్లీ వారి ప్రతిష్టలను త్యాగం చేయలేరు'</strong>'మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ధోనీ, కోహ్లీ వారి ప్రతిష్టలను త్యాగం చేయలేరు'

ధవన్‌ ఏం చేస్తాడో:

ధవన్‌ ఏం చేస్తాడో:

విండీస్ టూర్‌లో ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడ్డాడు. దీంతో ఈ సిరీస్‌ అతడికి కీలకం. ఓపెనింగ్‌ స్థానం కోసం యువ ఆటగాళ్లతో అతడికి పోటీ ఏర్పడింది. అయితే మొహాలీలో ధవన్‌కు ఘనమైన రికార్డుంది. టెస్టు అరంగేట్రంలో 187 పరుగులు చేసింది ఇక్కడే. మరి అచ్చొచ్చిన మైదానంలో దూకుడు కనబరుస్తూ మునుపటి ఫామ్‌ను అందుకుంటే జట్టుకు ప్రయోజనం చేకూరుతుంది. మరో

ఓపెనర్‌గా రోహిత్ ఫామ్ జట్టుకు కలిసొచ్చే అంశం. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు.

అయ్యర్‌కు అవకాశమొచ్చేనా:

అయ్యర్‌కు అవకాశమొచ్చేనా:

వెస్టిండీస్‌ టూర్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మనీశ్‌ పాండేకు తుదిజట్టులో అవకాశం దక్కుతుందా.. లేక శ్రేయస్‌ అయ్యర్‌కు చాన్స్‌ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక పంత్‌ కెరీర్‌లో ఎన్నడూ లేనంత ఒత్తిడిలో ఉన్నాడు. ఓవైపు టీ20 ప్రపంచక్‌పనకు ముందు తమకు లభించిన నాలుగైదు అవకాశాల్లోనే యువ ఆటగాళ్లు సత్తా నిరూపించుకోవాలని కెప్టెన్‌ చెబుతున్నాడు. కానీ పదే పదే చాన్స్‌ లభిస్తున్నా.. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అపార నమ్మకముంచుతున్నా పంత్‌ మాత్రం దారిలోకి రావడం లేదు. దీంతో ఈ సిరీస్ అతడికి చాలా కీలం.

 ఖలీల్‌కు నిరీక్షణ తప్పదు:

ఖలీల్‌కు నిరీక్షణ తప్పదు:

హార్దిక్‌ పాండ్యా జట్టులో ఉంటాడు. కృనాల్‌ పాండ్యా, జడేజాకు చోటు ఖాయమే. మరో స్పిన్నర్‌ స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్‌ మధ్య పోటీ నెలకొంది. దీపక్‌ చాహర్‌, నవదీప్‌ సైనీ పేస్ భాద్యతలు మోయనున్నారు. హార్దిక్‌ వీరికి సహకారం అందించనున్నాడు. స్వదేశీ పిచ్‌లపై ముగ్గురు స్పెషలిస్ట్‌ పేసర్లతో ఆడే అవకాశాలు తక్కువే కావడంతో ఖలీల్‌కు నిరీక్షణ తప్పకపోవచ్చు.

 డికాక్‌పైనే భారం:

డికాక్‌పైనే భారం:

యువకులతో కూడిన దక్షిణాఫ్రికా జట్టుకు వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ క్వింటన్‌ డికాక్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని ఆ దేశ క్రికెట్‌ బోర్డు డుప్లెసిస్‌ను పక్కన పెట్టి డికాక్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. డికాక్‌, మిల్లర్‌, వాన్‌డర్‌ డుస్సెన్‌, బవుమా బ్యాటింగ్‌లో.. రబాడ, ఫెలుక్వాయో బౌలింగ్‌లో చెలరేగి కోహ్లీ సేనను కట్టడి చేస్తే విజయంపై ఆశలు పెట్టుకోవచ్చు.

జట్లు (అంచనా):

జట్లు (అంచనా):

భారత్‌: రోహిత్‌, ధవన్‌, కోహ్లీ(కెప్టెన్‌), శ్రేయాస్‌, పంత్‌, హార్దిక్‌, క్రునాల్‌, జడేజా, వాషింగ్ట న్‌/రాహుల్‌ చాహర్‌, దీపక్‌ చాహర్‌, సైనీ.

దక్షిణాఫ్రికా:

డికాక్‌ (కెప్టెన్‌), రీజా హెండ్రిక్స్‌, బవుమా, వాన్‌డర్‌ డుస్సెన్‌, మిల్లర్‌, ఫెలుక్వాయో, ప్రిటోరియస్‌, బోర్న్‌ ఫర్టూన్‌/ఎన్‌రిచ్‌ నోర్టే, రబాడ, జూనియర్‌ దాలా, షంసీ.

Story first published: Wednesday, September 18, 2019, 16:02 [IST]
Other articles published on Sep 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X