న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సఫారీలతో టీ20 సిరిస్: రిషబ్ పంత్ రాణించాలంటే ఈ సూచనలు పాటించాల్సిందే!

India vs South Africa 2019: SA coach Lance Klusener offers advice to Rishabh Pant

హైదరాబాద్: టీమిండియా యువ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్ పంత్‌ నిలకడగా రాణించేందుకు దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్, ఆ జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్ లాన్స్‌ క్లూసెనర్‌ విలువైన సలహాలు, సూచనలు చేశాడు. పంత్ తన వైఫల్యాల నుంచే కాకుండా వేరే తప్పుల నుంచి కూడా నేర్చుకోవాలని ఈ సందర్భంగా అతడు తెలిపాడు.

ఆరు వికెట్లు తీసిన ఆర్చర్‌: ఆసీస్‌ 225 ఆలౌట్‌, ఇంగ్లాండ్‌కు స్వల్ప ఆధిక్యంఆరు వికెట్లు తీసిన ఆర్చర్‌: ఆసీస్‌ 225 ఆలౌట్‌, ఇంగ్లాండ్‌కు స్వల్ప ఆధిక్యం

భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు

భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు

ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు ధర్మశాల వేదికగా ఆదివారం జరగనున్న తొలి టీ20లో టీమిండియాతో తలపడనుంది. ఈ సందర్భంగా లాన్స్ క్లూసెనర్ పీటీఐతో మాట్లాడుతూ "రిషబ్ పంత్ పొరపాట్లను ఎత్తిచూపడం నాకు ఇబ్బందికరంగా అనిపిస్తోంది. అలాంటి ప్రతిభావంతుడు ఎప్పుడూ ముందుండాలి. క్రీజులో కుదురుకోవడానికి కొంత సమయం తీసుకోవాలి" అని అన్నాడు.

పంత్‌లో అద్భుత టాలెంట్‌

పంత్‌లో అద్భుత టాలెంట్‌

"తనలో ఉన్న అద్భుత టాలెంట్‌ను ప్రదర్శించేందుకు ఇంకా కొంతకాలం పడుతుంది. తన తప్పుల నుంచే నేర్చుకోవడం కాకుండా ఇతరుల తప్పుల నుంచి నేర్చుకొంటేనే అంతర్జాతీయ క్రికెట్లో అతడు ముందంజలో ఉంటాడు. తనవి మాత్రమే కాకుండా ఇతరుల తప్పుల నుంచి నేర్చుకొంటేనే త్వరగా మెరుగవుతారు" అని క్లూసెనర్‌ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ లాంటి టోర్నీల్లో అద్భుత ప్రదర్శన

ఐపీఎల్ లాంటి టోర్నీల్లో అద్భుత ప్రదర్శన

ఐపీఎల్ లాంటి టోర్నీల్లో అద్భుత ప్రదర్శన చేసే రిషబ్ పంత్ అంతర్జాతీయ వన్డేల్లో 22.90, టీ20ల్లో 21.57 యావరేజిగా ఉండటం గమనార్హం. అయితే, షాట్ సెలక్షన్ లోపం వల్లే రిషబ్ పంత్ ఇంత తక్కువ యావరేజిని కలిగి ఉన్నాడని క్రికెట్ విశ్లేషకుల వాదన. అయితే, టెస్టుల్లో మాత్రం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లపై పంత్ సెంచరీలు సాధించడం విశేషం.

ధోనితో కలిసి ఆడటం పంత్ అదృష్టం

ధోనితో కలిసి ఆడటం పంత్ అదృష్టం

"ధోనీ కెరీర్‌ చివరిదశలో ఉన్న సమయంలో అతడితో కలిసి ఆడటం నిజంగా పంత్‌ అదృష్టం. తన సీనియర్‌ నుంచి అతడికి సరైన సలహాలు వస్తాయి. పంత్‌కు అద్భుతమైన కోచ్‌ల శిక్షణ లభిస్తోంది. వారు అతడి సహజ ప్రతిభను పెంచి పోషిస్తారు" అని క్లూసెనర్‌ తెలిపాడు. భారత పర్యటనలో భాగంగా సఫారీలు 3 టీ20లు, 3 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. ఈ సిరిస్ నుంచి ధోని స్వతహాగా తప్పుకోవడంతో రెగ్యులర్ వికెట్ కీపర్ బాధ్యతలను పంత్ కు అప్పగించారు.

Story first published: Saturday, September 14, 2019, 9:44 [IST]
Other articles published on Sep 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X