న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దక్షిణాఫ్రికాతో టీ20 సిరిస్: టీమిండియా గేమ్ ఛేంజర్స్ వీరే!

India vs South Africa 2019: Five players who can be Indias game changers in T20 series

హైదరాబాద్: టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య సెప్టెంబర్ 15న ధర్మశాల వేదికగా జరగనున్న తొలి టీ20తో మూడు టీ20ల సిరిస్ ప్రారంభం కానుంది. భారత పర్యటనలో భాగంగా సఫారీ జట్టు 3 టీ20లు, 3 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. సాధారణంగా సొంతగడ్డపై టీమిండియా సిరిస్‌ను అంత తేలిగ్గా చేజార్చుకోదు.

నోరు పారేసుకున్న ఇంగ్లాండ్ అభిమాని: డేవిడ్ వార్నర్‌ ఏం చేశాడో తెలుసా! (వీడియో)నోరు పారేసుకున్న ఇంగ్లాండ్ అభిమాని: డేవిడ్ వార్నర్‌ ఏం చేశాడో తెలుసా! (వీడియో)

అయితే, చివరగా 2015-16లో భారత పర్యటనకు వచ్చిన సఫారీ జట్టు ధోని నాయకత్వంలోని టీమిండియాను చిత్తగా ఓడించి టీ20, వన్డే సిరిస్‌ను గెలుచుకుంది. అయితే, ఈ సిరిస్‌లో ఇరు జట్ల మధ్య ఎలాంటి వన్డేలు జరగడం లేదు. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆ తప్పుని మరోసారి పునరావృతం చేయకూడదని భావిస్తోంది.

గత పర్యటనలో టీమిండియా కేవలం ముగ్గురు ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లపైనే ఆధారపడింది. అయితే, ఈసారి మాత్రం సెలక్టర్లు పలువురు యువ క్రికెటర్లకు సైతం చోటు కల్పించారు. ఈ నేపథ్యంలో భారత పర్యటనలో భాగంగా సఫారీ జట్టుపై రాణించే అవకాశాలున్న ఆటగాళ్లను ఒక్కసారి పరిశీలిద్దాం...

హార్దిక్ పాండ్యా

హార్దిక్ పాండ్యా

వెస్టిండిస్ పర్యటన నుంచి విశ్రాంతి తీసుకున్న టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సెప్టెంబర్ 15 నుంచి సఫారీలతో జరగనున్న టీ20 సిరిస్‌కు సిద్ధమయ్యాడు. ఈ టీ20 సిరిస్‌కు భారత జట్టులో చోటు దక్కించుకున్న హార్దిక్ పాండ్యా ప్రాక్టీస్‌ మొదలు పెట్టాడు. సఫారీలతో జరిగే టీ20 సిరీస్‌కు ప్రాక్టీస్‌ ఉండాలని భావించిన హార్దిక్‌ పాండ్యా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందులో భాగంగా హార్దిక్ పాండ్యా భారీ షాట్లు ప్రాక్టీస్ చేశాడు. ముఖ్యంగా ధోని ట్రేడ్‌మార్క్‌ షాట్‌ అయిన హెలికాప్టర్‌ షాట్‌ను ప్రాక్టీస్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని హార్దిక్‌ పాండ్యా తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు.

రవీంద్ర జడేజా

రవీంద్ర జడేజా

ప్రస్తుతం భారత జట్టులో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఒకడు. ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌తో పాటు విండిస్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో సైతం జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. జడేజా అద్భుతమైన ఫీల్డర్ కూడా.

శ్రేయాస్ అయ్యర్

శ్రేయాస్ అయ్యర్

శ్రేయాస్ అయ్యర్ గత ఎనిమిది ఇన్నింగ్స్‌లను ఒక్కసారి పరిశీలిస్తే 77, 2, 47, 61 (విండిస్ ఏ జట్టుపై) 71, 65 (వన్డేల్లో వెస్టిండిస్ జట్టుపై) 26, 36 (దక్షిణాఫ్రికా ఏ జట్టుపై) చక్కటి ప్రదర్శన చేశాడు. మంచి ఫామ్‌తో పాటు నిలకడగా ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరిస్‌లో శ్రేయాస్ అయ్యర్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే అవకాశం ఉంది.

వాషింగ్టన్ సుందర్

వాషింగ్టన్ సుందర్

19 ఏళ్ల తమిళనాడుకు చెందిన ఈ క్రికెటర్ గతంలో వెస్టిండిస్‌పై అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు. టీ20ల్లో సుందర్ గణాంకాలు(1/18, 1/12, 0/23) ఇలా ఉన్నాయి. పవర్ ప్లేలో తక్కువ పరుగులివ్వడంలో దిట్ట. పవర్ హిట్టర్లను కలిగి ఉన్న వెస్టిండిస్ జట్టును సుందర్ కట్టడి చేయగల నమ్మకం సెలక్టర్లలో ఉంది. అందుకే అతడిని మూడు టీ20 సిరిస్‌కు ఎంపిక చేశారు.

నవదీప్ సైనీ

నవదీప్ సైనీ

ఇటీవలే వెస్టిండిస్‌తో జరిగిన మూడు టీ20ల సిరిస్‌లో నవదీప్ సైనీ ఐదు వికెట్లు పడగొట్టడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరిస్ అవార్డుని కూడా సొంతం చేసుకున్నాడు. 150kmph వేగంతో బంతులు వేయగల సమర్ధుడు. ముఖ్యంగా ఫాస్ట్ పిచ్‌లపై మరింత చెలరేగుతాడు. ఈ నేపథ్యంలో సఫారీలతో జరగనున్న టీ20 సిరిస్‌లో నవదీప్ సైనీ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

Story first published: Saturday, September 7, 2019, 16:12 [IST]
Other articles published on Sep 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X