న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విశాఖ టెస్టులో రోహిత్ శర్మ కొత్త అవతారం: ఫ్యాన్స్ పుల్ ఖుష్ (వీడియో)

India vs South Africa, 1st Test, Day 3: Rohit Sharma bowling against south africa

హైదరాబాద్: విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజైన శుక్రవారం సఫారీ బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లకు పరీక్షగా నిలిచారు. ఓవర్‌నైట్‌ స్కోరు 39/3తో శుక్రవారం మూడో రోజు ఆట ఆరంభించిన దక్షిణాఫ్రికా జట్టుని ఇషాంత్‌శర్మ ఆదిలోనే దెబ్బకొట్టాడు.

బవుమా (18)ను ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చి టీమిండియాకు బ్రేకిచ్చాడు. అయితే, ఆ తర్వాత సఫారీ బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. దక్షిణాఫ్రికా టాపార్డర్‌లో కీలకమైన వికెట్లను భారత బౌలర్లు సాధించినప్పటికీ ఎల్గర్‌ మాత్రం పట్టువదలకుండా ఇన్నింగ్స్‌ ఆడాడు.

IND vs SA: వైజాగ్ టెస్ట్.. మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని అరెస్ట్!!IND vs SA: వైజాగ్ టెస్ట్.. మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని అరెస్ట్!!

ఈ క్రమంలో వికెట్లు తీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ పార్ట్ టైమ్ స్పిన్నర్లను సైతం ప్రయోగించాడు. ఇందులో భాగంగా ఓపెనర్ రోహిత్ శర్మతో కూడా బౌలింగ్ వేయించాడు. ఈ మ్యాచ్‌లో టెస్టు ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన రోహిత్.. తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.

ఆటలో భాగంగా మూడో రోజైన శుక్రవారం మొత్తం రెండు ఓవర్లు వేసిన రోహిత్ శర్మ 3.50 ఎకానమీతో 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. రోహిత్ శర్మ బౌలింగ్ చేయడాన్ని చూసిన అతడి అభిమానులు సంతోషంగా ఫీలవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పంచుకున్నారు.


ఇదిలా ఉంటే, తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. రెండో రోజు సఫారీలు మూడు వికెట్లు కోల్పోవడంతో అందరూ టీమిండియా పట్టు బిగించిందని భావించారు. అయితే, ఆటలో భాగంగా మూడోరోజైన శుక్రవారం దక్షిణాఫ్రికా అద్భుతంగా పుంజుకుంది.

34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దక్షిణాఫ్రికాను ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌(160; 287 బంతుల్లో 18 ఫోర్లు, 4సిక్సర్లు), క్వింటన్ డీకాక్(111; 163 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సులు) సెంచరీలతో ఆదుకున్నారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 118 ఓవర్లకు గాను 8 వికెట్లు కోల్పోయి 385 పరుగులు చేసింది.

10వ బౌలర్‌గా: విశాఖ టెస్టులో రవీంద్ర జడేజా అరుదైన ఘనత10వ బౌలర్‌గా: విశాఖ టెస్టులో రవీంద్ర జడేజా అరుదైన ఘనత

సఫారీలు ఇంకా 117 పరుగుల వెనుకంజలో ఉన్నారు. ముత్తుస్వామి(12), కేశవ్‌ మహరాజ్‌(3) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్ (128/5) ఐదు వికెట్లతో సత్తా చాటగా... రవీంద్ర జడేజా 2, ఇషాంత్ శర్మకు ఒక వికెట్ దక్కింది. స్పిన్నర్ల ప్రభావం ఎక్కువగా ఉండటంతో కెప్టెన్‌ కోహ్లీ ఆ ఇద్దరితోనే ఎక్కువ ఓవర్లు బౌలింగ్‌ వేయించాడు.

Story first published: Friday, October 4, 2019, 18:28 [IST]
Other articles published on Oct 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X